- Home
- Business
- Rajiv Yuva Vikasam: రూ.50 వేలు రుణం తీసుకుని రూపాయి కూడా తిరిగి కట్టక్కరలేదు. మీరు అర్హులేనా?
Rajiv Yuva Vikasam: రూ.50 వేలు రుణం తీసుకుని రూపాయి కూడా తిరిగి కట్టక్కరలేదు. మీరు అర్హులేనా?
Rajiv Yuva Vikasam: ఈ రోజుల్లో జాబ్స్ కంటే సొంత వ్యాపారం చేసుకోవడం చాలా మంచిది. అందుకే ప్రభుత్వాలు ప్రజలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా అనేక పథకాల అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు 100% సబ్సిడీతో 50,000 రుణం ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చాయి. ఈ రుణం పొందాలంటే ఎలాంటి అర్హతలు కావాలి? ఎవరికి ఈ రుణం ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను స్వయం ఉపాధి కల్పించే దిశగా చక్కటి పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకం పేరు రాజీవ్ యువ వికాసం. దీని ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పిస్తారు. అంటే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న యువతకు, ముఖ్యంగా స్త్రీలకు 50 వేలు రుణం ఇస్తారు.
రాజీవ్ యువ వికాసం పథకం కింద 50000 రుణం పొందిన వారికి 100% సబ్సిడీ లభిస్తుంది. అంటే 50,000 రుణం తీసుకున్న వారు తిరిగి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ 100% రాయితీ రుణం పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి ఆ తేదీ లోపు మీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదు
ఈ రుణం పొందాలంటే గ్రామాల్లో నివసించే వారి వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు మించి ఉండకూడదు. నగరాల్లో నివసించే వారైతే 2 లక్షలు మించకూడదు. వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. 60 సంవత్సరాలు మించకూడదు.
ఇది కూడా చదవండి కేవలం రూ.500తో మొదలు పెట్టే 8 అదిరిపోయే బిజినెస్‌లు ఇవే
రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ రుణ సదుపాయం లభిస్తుంది. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికెట్ ఉన్నా ఈ రుణం పొందొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద విడుదల చేసిన నిధుల్లో 25% మహిళలకు కేటాయించింది. అందువల్ల మీ ఇంట్లో మహిళల పేరున ఈ రుణం తీసుకుంటే త్వరగా వస్తుంది.
100% సబ్సిడీతో 50,000 రుణాన్ని ఇంటికి ఒకరికి మాత్రమే ఇస్తారు. వితంతువులైన మహిళలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. 50,000 రుణం పొందిన వారికి 100% సబ్సిడీ లభిస్తుంది. లక్ష రూపాయలు రుణం పొందిన వారికి 90% రాయితీ లభిస్తుంది. అంటే కేవలం రూ.10 వేలు మాత్రమే తిరిగి కట్టాలి. ఈ రూ.10 వేలు కూడా బ్యాంకు లోన్ ఇస్తుంది. రెండు లక్షల లోపు రుణం పొందిన వారికి 80 శాతం రాయితీ లభిస్తుంది. నాలుగు లక్షల లోపు లోన్ తీసుకున్న వారికి 70% డిస్కౌంట్ లభిస్తుంది.