Gold Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..రూ.22వేలు తగ్గిన బంగారం ధరలు
Gold Prices: బంగారం ధరల్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. మళ్లీ కొన్నిరోజులుగా కాస్త తగ్గుముఖం పెట్టిన పసిడి రేట్లు...రెండ్రోజులుగా కుప్పకూలుతున్నాయి. 15 రోజుల్లో రూ.20వేలు పతనమైంది.

రూ.20వేలు తగ్గిన బంగారం
బంగారం కొనాలనుకునేవారికి భారీ శుభవార్త...పసిడిపై రెండ్రోజుల్లో రూ. 7,520 క్షీణించింది. మే 13 న రూ.13 వేలు పెరిగి షాక్ ఇచ్చాయి. ఏకంగా తులం బంగారం రూ.1,67,890కు చేరుకుంది. దీంతో బంగారం ధరలు కొనడానికే వెనుకంజ వేశారు. ఇక ఆ తర్వాత కూడా రేట్లు ఎగబాకి ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే మళ్లీ కాస్త మార్కెట్లు కుదుటపడుతున్నాయి. ఇప్పుడు 10 గ్రాముల పసిడి రూ.1,45,640కు చేరుకుంది. అంటే దాదాపు రూ.22,250తగ్గింది.
అద్భుతమైన ఊరట
కొంతకాలంగా రికార్డు స్థాయిలతో సామాన్యులకు చుక్కలు చూపించిన బంగారం ధరలు..ప్రస్తుతం భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న ఆకస్మిక పరిణామాలు, బులియన్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పసిడి ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం నగలు కొనాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఊరటగా మారిందని నిపుణులు చెబుతున్నారు.
బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్
ప్రస్తుతం హైదరాబాద్ లో బంగారం ధరలు చూసుకుంటే 24 క్యారెట్ల మేలిమి బంగారంపై రూ.2,130 తగ్గి, ప్రస్తుతం ₹1,45,640 వద్దకు చేరింది.22 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,950 క్షీణించి, ₹1,33,500 వద్ద స్థిరపడింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తాయి. వెండి ధరలు కూడా దిగొస్తున్నాయి. వారం రోజుల్లో రూ.20వేలు తగ్గి రూ.2,60వేలకు చేరుకుంది.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు
అంతర్జాతీయ, భౌగోళిక పరిస్థితుల కారణంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో ముడి చమురు ధరలు కూడా పెరుగుతున్నాయి. డాలర్ బలపడుతోంది...తద్వారా బంగారం తగ్గుముఖం పడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి ఈ టైం బంగారం కొనేందుకు అనుకూలమి నిపుణులు సూచిస్తున్నారు.

