- Home
- Business
- Business Ideas: సంవత్సరంలో 365 రోజులు డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే, షాపు అవసరం లేదు...నెలకు లక్షల్లో ఆదాయం..
Business Ideas: సంవత్సరంలో 365 రోజులు డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే, షాపు అవసరం లేదు...నెలకు లక్షల్లో ఆదాయం..
బిజినెస్ చేయడమే మీ లక్ష్యమా, అయితే సమయం వృధా చేయవద్దు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముద్రా రుణాల పథకం ప్రారంభించినప్పటి నుంచి నిరుద్యోగులు లక్షలాది సంఖ్యలో ఈ రుణాలు పొంది తమ సొంత వ్యాపారాలను ఏర్పాటు చేసుకొని సొంత కాళ్లపై నిలబడుతున్నారు. మీరు కూడా చాలీచాలని జీతాలతో ఉద్యోగం చేసే బదులు ముద్రా రుణాలతో వ్యాపారం చేసుకుంటే చక్కటి ఆదాయం సంపాదించుకోవచ్చు. అలాగే జీవితంలో ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ రుణాలతో ఏ వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తున్నారా, అయితే మీ ప్రతిభకు తగ్గ వ్యాపారాలను ఎంచక్కా ఏర్పాటు చేసుకోవచ్చు. అటువంటి వ్యాపార ఐడియాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏర్పాటు చేసే వ్యాపారం ఎల్లప్పుడూ గిరాకీ ఉండేలా అలాగే నిరంతరం సీజన్ తో సంబంధం లేకుండా కొనసాగాలంటే ఫుడ్ బిజినెస్ అన్నింటికన్నా శ్రేయస్కారమైనది. ఎందుకంటే ఇందులో అటు చక్కటి లాభంతో పాటు అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ప్రాఫిట్ మార్జిన్ ఫుడ్ బిజినెస్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పట్టణాల్లోనూ నగరాల్లోనూ ఫుడ్ బిజినెస్ తిరుగు లేదనేది చెప్పాలి.
బ్రేక్ ఫాస్ట్ అలవాటు ప్రజల్లో పెరగడంతో టిఫిన్ సెంటర్లకు చక్కటి గిరాకీ ఏర్పడింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేసి తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవడం మనం తరచూ చూస్తూ ఉంటాం. ఇక బ్రేక్ ఫాస్ట్ కోసం టిఫిన్ సెంటర్లు నగరంలో చాలా ఉంటాయి. అయినప్పటికీ ఏ టిఫిన్ సెంటర్ గిరాకీ ఆ టిఫిన్ సెంటర్ కి ఉంటుంది. అయితే టిఫిన్ సెంటర్ ఏర్పాటుకు మీకు ఒక మంచి సెంటర్ కావాల్సి ఉంటుంది. కానీ అద్దె భారం ఎక్కువ అనిపిస్తే మాత్రం మొబైల్ టిఫిన్ సెంటర్స్ చాలా ఉత్తమం అని చెప్పాలి.
మొబైల్ టిఫిన్ సెంటర్స్ ను ఫుడ్ ట్రక్స్ రూపంలో చాలా ప్రసిద్ధి చెందాయి. వీటికి షాపు అవసరం లేదు అలాగే పెట్టుబడి కూడా చాలా తక్కువ ఒక వాహనం ఉంటే సరిపోతుంది. మీకు ఎక్కడ గిరాకీ ఉంటే అక్కడికి వెళ్లి టిఫిన్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా మీకు మంచి లాభం పొందే అవకాశం దక్కుతుంది.
ఇక ఈ మొబైల్ టిఫిన్ సెంటర్ ఏర్పాటుకు మీకు కావాల్సింది, ఒక మినీ ట్రక్ ప్రస్తుతం కమర్షియల్ సెగ్మెంట్లో లభించే ఈ మినీ ట్రక్కుల ధర విషయానికి వస్తే మహీంద్రా, టాటా, మారుతి, అశోక్ లేలాండ్ లాంటి సంస్థలు ఈ మినీ ట్రక్కులను తయారు చేస్తున్నాయి. వీటి ధర రూ. 5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మీ బడ్జెట్ ఇంకా తక్కువ అనుకుంటే,సెకండ్ హ్యాండ్ లో కూడా ఈ మినీ ట్రక్కులను కొనుగోలు చేసి మొబైల్ టిఫిన్ సెంటర్ కింద మోడిఫికేషన్ చేయించుకోవచ్చు.
అలాగే మొబైల్ టిఫిన్ సెంటర్ ఏర్పాటు కోసం మీ వాహనంలో ఒక కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ అలాగే రెండు స్టౌలను ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని కుర్చీలు కూడా దగ్గర పెట్టుకుంటే మంచిది. ఇక మొబైల్ టిఫిన్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఆఫీసులు, విద్యాసంస్థలు, మార్కెట్ స్థలాలు, ప్రయాణికులు ఎక్కువగా సందర్శించే ప్రదేశాల్లో, ఈ మొబైల్ టిఫిన్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలి. వీటి ఏర్పాటుకు వాహనం ఖర్చు పోను మరొక 50 వేల వరకు వంట సామాన్లకు ఖర్చవుతుంది. అంటే సుమారు 5 లక్షల నుంచి పది లక్షల మధ్యలో మీరు ఈ మొబైల్ టిఫిన్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవచ్చు.
మొబైల్ టిఫిన్ సెంటర్ ను ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు కూడా కచ్చితంగా టిఫిన్స్ ప్రిపేర్ చేసేలా వంట నేర్చుకుంటే మంచిది. పని వాళ్ళ మీద ఆధారపడితే మీరు టిఫిన్ సెంటర్ ను నడపడం చాలా కష్టం అవతుంది. అలాగే టిఫిన్ సెంటర్ ను ప్రతిరోజు మార్చకుండా ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల రెగ్యులర్ కస్టమర్లు పొందే అవకాశం ఉంది. అలాగే సాయంకాలం పూట మీ మొబైల్ టిఫిన్ సెంటర్లో స్టాక్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా కూడా అదనపు ఆదాయం నీరు పొందే వీలుంది. అయితే టిఫిన్స్ ఒక సెంటర్లో ఏర్పాటు చేస్తే స్నాక్స్ మరో సెంటర్లో ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇక మీ వంట సామాన్లు అలాగే ఆహార పదార్థాలను స్టోర్ చేసుకునేందుకు మీ ఇంట్లోనే ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. తద్వారా మీ సరుకులను ఏర్పాటు చేసుకొని టిఫిన్ సెంటర్ ను దిగ్విజయంగా నడుపుకోవచ్చు.