MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • car maintenance tips: మీ కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఈ టిప్స్ పాటించండి

car maintenance tips: మీ కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఈ టిప్స్ పాటించండి

car maintenance tips: ఈ రోజుల్లో కారు లేకపోతే ఎలా? కాని కారు ఎక్కువ కాలం ఇబ్బందులు లేకుండా పనిచేయాలంటే దాని మెయింటనెన్స్ సరిగ్గా చూసుకోవాలి. లేకపోతే చాలా త్వరగా దెబ్బతింటుంది. కారు లైఫ్ టైమ్ పెరగాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jun 01 2025, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆయిల్స్ చెక్ చేయించండి
Image Credit : Google

ఆయిల్స్ చెక్ చేయించండి

కారు పైకి బాగానే కనిపిస్తున్నా ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఫ్లూయిడ్, కూలెంట్, విండ్‌షీల్డ్ వాషర్ ఫ్లూయిడ్ లాంటి ఆయిల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసి మార్చుకోకపోతే కారు లోపల లోపల దెబ్బతింటుంది. పైకి మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. కారు బాగా పనిచేయాలంటే ఇంజిన్ ఆయిల్, మొదలైనవి చాలా ఇంపార్టెంట్. కారుకు అవే ప్రాణం. వాటిని తరచూ తనిఖీ చేసి లెవల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అవసరమైతే మార్చాలి. ఇది కారు పనితీరు మెరుగుపరుస్తుంది.

25
వైపర్ బ్లేడ్లు మార్చేయండి
Image Credit : Getty

వైపర్ బ్లేడ్లు మార్చేయండి

వర్షాకాలంలో వాన పడేటప్పుడు దారి సరిగ్గా కనిపించకపోతే వైపర్ వేస్తాం కదా.. అప్పుడు గుర్తొస్తుంది అయ్యో.. వైపర్ మార్పించాలనుకున్నాం అని..  కాని ఈ సారి అప్పటి దాకా ఆగకుండా వెంటనే మార్పించండి. వైపర్ పాడైన వెంటనే మార్చకపోతే గ్లాస్ దెబ్బతింటుంది. వైపర్ మార్చుకుంటే వందలు మాత్రమే ఖర్చవుతాయి. గ్లాస్ మార్చాల్సి వస్తే వేలల్లో ఖర్చవుతుంది. వైపర్ బ్లేడ్‌లు సరిగ్గా పనిచేయాలంటే వాటిని శుభ్రమైన, తడిగా ఉన్న వస్త్రంతో క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. బ్లేడ్‌లు పాడైపోతే వెంటనే మార్చాలి. 

Related Articles

Related image1
Top 5 Electric Vehicles: ఒక్కసారి ఛార్జ్ చేస్తే వందల కి.మీ. దూసుకుపోయే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Related image2
Electric Vehicles: కారు ప్రియులకు గుడ్ న్యూస్: పెట్రోల్ కార్ల ధరకే ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్
35
బ్రేకుల తనిఖీ తప్పనిసరి
Image Credit : Shutterstock

బ్రేకుల తనిఖీ తప్పనిసరి

కారు భద్రతకు బ్రేకులు అత్యంత కీలకం. బ్రేక్ ప్యాడ్‌లు, రోటర్‌లు అరిగిపోక ముందే వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నిపుణుల ద్వారా తరచూ తనిఖీ చేయించుకోవాలి. అవసరమైతే వెంటనే మార్పించాలి. లేదంటే అనవసరమైన ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లవుతుంది. బ్రేక్ సిస్టమ్ పనితీరు బాగుంటేనే ప్రయాణాలు హ్యాపీగా సాగుతాయి. 

45
బ్యాటరీ పాడవకుండా చూసుకోండి
Image Credit : our own

బ్యాటరీ పాడవకుండా చూసుకోండి

కారు బ్యాటరీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. తుప్పు లేదా లీకేజీ వంటి సమస్యలుంటే వెంటనే బాగుచేయించాలి. బ్యాటరీలో ఇతర సాంకేతిక సమస్యలున్నా చెక్ చేయించి వెంటనే రిపేర్ చేయించాలి. బ్యాటరీ మూతలు తీసి లోపల లిక్విడ్ లెవల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. బ్యాటరీ మెయింటనెన్స్ బాగుంటే స్టార్టింగ్ సమస్యలు రావు. 

55
టైర్లను చెక్ చేస్తూ ఉండండి
Image Credit : Gemini

టైర్లను చెక్ చేస్తూ ఉండండి

టైర్ల స్థితిని తరచుగా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఎక్కడైన పగుళ్లు వంటివి ఉంటే వెంటనే టైర్ మార్చేయాలి. లేదంటే పేలిపోయే ప్రమాదం ఉంటుంది. టైర్లో గాలి తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా ఇబ్బందే. కారు బ్రాండ్ ని బట్టి టైర్లకు ఎంత గాలి ఉండాలో ఆ కంపెనీ నిర్ణయిస్తుంది. ఆ లెక్కనే ఎప్పుడూ టైర్లలో గాలి పట్టించాలి. టైర్లను జాగ్రత్తగా చూసుకుంటే డ్రైవింగ్‌ సేఫ్ గా చేసుకోవచ్చు. ఇంధన వినియోగం కూడా మెరుగవుతుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Post office: ఏం చేయ‌కుండానే 5 ఏళ్ల‌లో రూ. 4 ల‌క్ష‌లు పొందే అవ‌కాశం.. ప్ర‌భుత్వ గ్యారెంటీతో
Recommended image2
Old Gold: పాత బంగారాన్ని అమ్మేస్తే లాభమా? వాటిని ఇచ్చి కొత్త నగలు తీసుకోవడం మంచిదా?
Recommended image3
మ‌హిళ‌లు ఇలా చేస్తే మీరే మ‌హా రాణులు.. ఇంట్లో నుంచే నెల‌కు రూ. 25 వేలు సంపాదించే అవ‌కాశం
Related Stories
Recommended image1
Top 5 Electric Vehicles: ఒక్కసారి ఛార్జ్ చేస్తే వందల కి.మీ. దూసుకుపోయే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Recommended image2
Electric Vehicles: కారు ప్రియులకు గుడ్ న్యూస్: పెట్రోల్ కార్ల ధరకే ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved