పండుగ సీజన్ లో వాహనదారులకు షాక్.. ఆకాశానికి ఇంధన ధరలు..
న్యూఢిల్లీ: వాహనదారులకు నేడు కాస్త ఉపశమనం కలిగింది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలకు నేడు బ్రేక్ పడింది. సోమవారం ఇంధన ధరలు రికార్డు స్థాయిలో చేరిన్నప్పటికీ మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి సవరణలు జరగలేదు.

అంతర్జాతీయ మార్కెట్లలో ధరల పెంపు కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఏడవ రోజు సోమవారం పెరిగాయి. దీంతో ఇంధన ధరలు సరికొత్త గరిష్ట స్థాయికి చేరాయి. తాజా సవరణలో దేశ రాజధానిలో పెట్రోల్ 30 పైసలు, డీజిల్ 35 పైసలు పెంచారు.
ప్రముఖ మెట్రో నగరాలలో పెట్రోల్, డీజిల్ రికార్డు స్థాయిలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 104.44 గా ఉంది, ముంబైలో పెట్రోల్ అత్యధికంగా రూ .110.41 కి చేరింది.
చమురు రిటైలర్ల ధరల నోటిఫికేషన్ ప్రకారం భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో డీజిల్ లీటరుకు రూ. 101.03కి విక్రయిస్తోంది.
కోల్‌కతాలో పెట్రోల్ లీటరుకు రూ. 105.10 కి, డీజిల్ లీటరుకు రూ .96.28 కి విక్రయిస్తోంది. చెన్నైలో పెట్రోల్ రూ. 101.79 కి, డీజిల్ లీటరుకు రూ .97.59 కి విక్రయిస్తుంది.
సెప్టెంబర్ 5 నుండి పెట్రోల్ ధరలు స్థిరత్వాన్ని కొనసాగించాయి, అయితే చమురు కంపెనీలు ఈ వారం ధరలను పెంచాయి. గత ఎనిమిది రోజులలో ఆరు రోజులు పెట్రోల్ ధరలు పెరిగాయి, సుమారు లీటరుకు రూ .1.45 పెరిగింది.
చమురు కంపెనీలు ఆమోదించిన ధరల ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకి సమీక్షించి సవరిస్తుంటాయి. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి.