MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • EPFO: ఏటీఎమ్ నుంచి పీఫ్ డ‌బ్బులు డ్రా చేసుకోవ‌చ్చు.. ఎప్ప‌టి నుంచంటే? లేటెస్ట్ అప్డేట్

EPFO: ఏటీఎమ్ నుంచి పీఫ్ డ‌బ్బులు డ్రా చేసుకోవ‌చ్చు.. ఎప్ప‌టి నుంచంటే? లేటెస్ట్ అప్డేట్

EPFO: ప్రతీ నెల ఉద్యోగి జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్ సొమ్మును అత్యవసర పరిస్థితుల్లో కొంత మొత్తంలో తీసుకోవచ్చే విషయం తెలిసిందే. అయితే దీనికి ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లోకి వెళ్లి క్లైమ్ చేసుకోవ‌డం లాంటి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇదంతా మారనుంది.  

1 Min read
Author : Narender Vaitla
Published : Sep 24 2025, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏటీఎం ద్వారా పీఎఫ్ డ‌బ్బులు
Image Credit : Social Media

ఏటీఎం ద్వారా పీఎఫ్ డ‌బ్బులు

భవిష్యనిధి చందాదారులకు ఒక పెద్ద మార్పు రాబోతోంది. బ్యాంకు ఖాతాల్లాగే, EPFO సభ్యులు తమ పీఎఫ్ మొత్తాన్ని ఏటీఎం కార్డు ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయం వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశముందని సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తుది నిర్ణయం ఎప్పుడు?
Image Credit : Social Media

తుది నిర్ణయం ఎప్పుడు?

ఈ సదుపాయం అమలుపై సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీలు (CBT) అక్టోబర్ రెండో వారంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. మొదట ఈ సర్వీస్‌ను జూన్‌లో ప్రారంభించాలని కార్మికశాఖ భావించినా, విత్‌డ్రా పరిమితులపై చర్చ అవసరం ఉండడంతో కొంత వాయిదా పడింది.

Related Articles

Related image1
Paytm: మీ ఫోన్‌లో పేటీఎమ్ యాప్ ఉందా.? అయితే మీ దగ్గర రూ. 60 వేలు ఉన్నట్లే
Related image2
zodiac sign: ఈ రాశి వారికి అక్టోబ‌ర్ నెల అగ్ని ప‌రీక్ష‌.. మాట్లాడే ముందు జాగ్ర‌త్త‌గా ఉండండి.
35
విత్‌డ్రా పరిమితులపై చర్చ
Image Credit : X

విత్‌డ్రా పరిమితులపై చర్చ

నగదు ఉపసంహరణలకు గరిష్ట పరిమితి ఉండాలా లేదా అన్న అంశంపై బోర్డు నిర్ణయం తీసుకోనుంది. పరిమితులు లేకపోతే ‘భవిష్యనిధి’ అసలు ఉద్దేశ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంద‌నే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే లిమిట్ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు రానున్నాయి.

45
దేశవ్యాప్తంగా చందాదారులు
Image Credit : iSTOCK

దేశవ్యాప్తంగా చందాదారులు

ప్రస్తుతం EPFOకి 7.8 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వీరి వద్ద కలిపి దాదాపు రూ. 28 లక్షల కోట్లు డిపాజిట్ రూపంలో ఉన్నాయి. అత్యవసర సందర్భాల్లో సభ్యులు త్వరగా డబ్బులు పొందేలా ఈ సదుపాయం ఉప‌యోగ‌ప‌డుతుంది.

55
ప్రత్యేక కార్డు ద్వారా విత్‌డ్రా
Image Credit : Getty

ప్రత్యేక కార్డు ద్వారా విత్‌డ్రా

EPFO, బ్యాంకులు, ఆర్‌బీఐతో కలిసి అవసరమైన ఐటీ మౌలిక వసతులు సిద్ధం చేసింది. సభ్యులకు ప్రత్యేక EPFO కార్డు జారీ చేయనున్నారు. ఇది సాధారణ ఏటీఎం కార్డు మాదిరిగానే పనిచేస్తుంది. ఒకసారి CBT ఆమోదం లభించిన తర్వాత, విత్‌డ్రాల నిబంధనలు, పరిమితులపై స్పష్టత రానుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Paytm: మీ ఫోన్‌లో పేటీఎమ్ యాప్ ఉందా.? అయితే మీ దగ్గర రూ. 60 వేలు ఉన్నట్లే
Recommended image2
zodiac sign: ఈ రాశి వారికి అక్టోబ‌ర్ నెల అగ్ని ప‌రీక్ష‌.. మాట్లాడే ముందు జాగ్ర‌త్త‌గా ఉండండి.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved