మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు వున్నాయో తెలియడంలేదా..? ఇప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు...
మీకు తెలియకుండానే ఎవరైనా మీ పేరిట సిమ్ కార్డులు తీసుకున్నారా..? ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు వున్నాయో తెలుసకోవడం చాలా ముఖ్యం. ఇది ఇప్పుడు చాలా ఈజీ పని...
SIM Cards
సెల్ ఫోన్... ప్రస్తుత టెక్ జమానాలో మనిషి నిత్యావసర జాబితాలో చేరిపోయింది. మొబైల్ లేకుంటే మనిషి మనుగడే సాగదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రపంచాన్నే అరచేతిలో పెడుతున్న ఫోన్ వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా వున్నాయి. ముఖ్యంగా సైబర్ కేటుగాళ్ల పనిని సులువు చేస్తున్నవే ఈ సెల్ ఫోన్స్.
SIM Cards
అయితే మనకు తెలియకుండానే మన పేరుతో ఇలా సైబర్ నేరాలతో పాటు మరేదైనా మోసాలు జరగవచ్చు. ఇలా జరక్కుండా ప్రతి ఒక్కరు ముందుజాగ్రత్తగా చేయాల్సింది మన పేరుతో ఎన్ని సిమ్ కార్డ్స్ వున్నాయో చూసుకోవడమే. మనం వాడకున్నా, మన దగ్గర లేకున్నా మన పేరిట సిమ్ కార్డులు పుట్టుకొచ్చే ప్రమాదం వుంది. అవి సైబర్ కేటుగాళ్ల చేతిలో పడ్డాయో అంతే సంగతి... ఆ నేరం మన ఖాతాలో పడుతుంది.
SIM Cards
గతంలో ఫ్రీ డాటా కోసమే, ఫ్రీ టాక్ టైమ్ కోసమో ఎక్కువగా సిమ్ కార్డులు కొనుగోలుచేసారా..? ఆ సిమ్ కార్డులు వాడిన తర్వాత అలాగే పక్కనబడేసినా యాక్టివేట్ లో వుండే అవకాశం వుంది. ఇది ఎవరి చేతిలో అయినా పడితే ప్రమాదమే. అలాగే మన ఆదార్ కార్డు ఎలాగో సైబర్ కేటుగాళ్ళ చేతిలో పడిందనుకొండి వాళ్లు దాంతో సిమ్ కార్డులు కొనే ప్రమాదముంది. దాన్ని ఉపయోగించే నేరాలకు పాల్పడవచ్చు. కాబట్టి మన పేరిట ఎన్ని సిమ్ కార్డులు వున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసమే భారత ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ తీసుకువచ్చింది.
SIM Cards
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం 'సంచార్ సాథి(sancharsaathi)' పోర్టల్ తీసుకువచ్చింది. ఇది TAFCOP (టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్) సేవలను అందిస్తుంది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం సంస్థల వినియోగదారులు ఈ పోర్టల్ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
SIM Cards
ఈ పోర్టల్ లో ద్వారా మీ పేరిట ఎన్ని సిమ్ కార్డులు వున్నాయో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా https://sancharsaathi.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయండి. పేజ్ ఓపెన్ కాగానే సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కనిపిస్తాయి. అందులో నో యువర్ మొబైల్ కనెక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ అడుగుతుంది... ఎంటర్ చేయండి. వెంటనే మొబైల్ నంబర్ కు ఓ ఓటిపి వస్తుంది... దాన్ని ఎంటర్ చేయగానే మీ పేరుతో వున్న అన్ని ఫోన్ నంబర్లు కనిపిస్తాయి.
SIM Cards
ఇలా మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు వున్నాయో తెలుసుకొండి. అందులో మీరు వాడకుండా వున్నవాటిని బ్లాక్ చేసుకొండి. ఇలా చేయడంద్వారా మీరు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా వుంటారు.