MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • జాబ్ చేస్తూనే ఈ బిజినెస్ చేయొచ్చు: నెలకు రూ.30 వేలు గ్యారెంటీ

జాబ్ చేస్తూనే ఈ బిజినెస్ చేయొచ్చు: నెలకు రూ.30 వేలు గ్యారెంటీ

మీరు ఉద్యోగం చేస్తూ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే IRCTC టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ వ్యాపారం మీకు మంచి ఆప్షన్. దీని కోసం మీరు ప్రత్యేకంగా కష్టపడాల్సిన పని లేదు. కేవలం టిక్కెట్లు బుక్ చేస్తే సరిపోతుంది. ప్రతి టిక్కెట్ పై కమిషన్ కింద మీరు మనీ సంపాదించొచ్చు. IRCTC టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ అవడానికి మీరు ఏం చేయాలో ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోండి.  

3 Min read
Naga Surya Phani Kumar
Published : Oct 18 2024, 02:11 PM IST| Updated : Oct 18 2024, 02:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇప్పుడు టెక్నాలజీ ఎంతలా పెరిగిపోయిందంటే ఎంత దూరమైనా టిక్కెట్లను ఆన్ లైన్ లోనే బుక్ చేసేసుకుంటున్నారు. బస్, ట్రైన్, విమానం ఇలా ట్రాన్స్ పోర్ట్ ఏదైనా ఆన్ లైన్ లో ఈజీగా బుక్ చేసుకుంటున్నారు. ప్రయాణానికి కనీసం వారం, 15 రోజుల ముందు అయితే టిక్కెట్లు ఆన్ లైన్ లో ఈజీగా దొరుకుతాయి. అయితే అర్జెంట్ గా అదే రోజు వెళ్లాల్సి వస్తే ఏ ట్రాన్స్ పోర్ట్ కైనా టిక్కెట్స్ దొరకడం చాలా కష్టం. అయితే ఏజెంట్స్ కి ప్రత్యేకమైన కోటా ఉంటుంది. ఇన్ని టిక్కెట్స్ అని వాళ్లకు కేటాయిస్తారు. అందువల్ల చివరి నిమిషంలోనూ వాళ్లు టిక్కెట్లు బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం గడుపుతున్న ఈ బిజీ లైఫ్ లో ఎవరి ప్రయాణాలైనా అప్పటికప్పుడే డిసైడ్ అవుతున్నాయి. అందువల్ల టిక్కెట్స్ దొరకాలంటే ఏంజెట్స్ ను కలవక తప్పదు. ఇదే మీకు మంచి బిజినెస్ పాయింట్ అవుతుంది. మీరు కనుక IRCTC టిక్కెట్ ఏజెంట్ గా చేరితే కస్టమర్లు మీ సేవలు తప్పకుండా ఉపయోగించుకుంటారు. 
 

25

IRCTC (Indian Railway Catering and Tourism Corporation) టికెట్ బుకింగ్ ఏజెంట్‌గా ఉండటం కోసం ముందుగా మీరు IRCTC నుంచి ఆమోదం పొందాలి. దీని కోసం IRCTC అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మీ ఆధార్, పాన్ కార్డు వంటి అవసరమైన డాక్యుమెంట్లతో పాటు అప్లికేషన్ ఫీని చెల్లించాలి. మీరు ఎంచుకొనే బిజినెస్ మోడల్‌పై ఆధారపడి ఐఆర్‌సీటీసీ ఏజెంట్లుగా ఉండటం కోసం చెల్లించాల్సిన ఫీజులో తేడా ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయ్యాక మీరు అధికారిక టికెట్ బుకింగ్ ఏజెంట్‌ అవుతారు.  

ఒక సంవత్సరం IRCTC ఏజెంట్ లైసెన్స్ కోసం రూ. 3,999 ఫీజు చెల్లించాలి. రెండేళ్ల లైసెన్స్ కు రూ.6,999 కట్టాలి. మీరు ఏజెంట్‌గా మారిన తర్వాత టిక్కెట్ బుకింగ్ ఫీజులు నెలకు బుక్ చేసిన టిక్కెట్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి.
 

35

టికెట్ బుకింగ్ ఏజెంట్లకు ఆదాయం ప్రధానంగా వారు చేసే బుకింగ్స్ ఆధారంగా ఉంటుంది. IRCTC ఏజెంట్లు ప్రతి టికెట్ బుకింగ్ మీద కమీషన్ పొందుతారు. సాధారణంగా మీరు స్లీపర్ క్లాస్ టికెట్ బుకింగ్ మీద రూ. 20 వరకు, ఏసీ క్లాస్ టికెట్ మీద రూ. 40 వరకు కమీషన్ పొందొచ్చు. అలాగే ప్రతి నెల బుకింగ్‌లు పెరిగిన కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. సగటున ఒక IRCTC ఏజెంట్ నెలకు రూ. 10,000 నుంచి రూ. 30,000 వరకు సంపాదించవచ్చు. ఇది బిజినెస్ ఎలా నిర్వహిస్తారనేది పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుంది.

ఉద్యోగం చేస్తూ ఏజెంట్ గా ఎలా?

మీరు ఉద్యోగం చేస్తూనే ఐఆర్‌సీటీసీలో టికెట్ బుకింగ్ ఏజెంట్‌గా పని చేయవచ్చు. ఎందుకంటే ఇది పార్ట్‌టైమ్‌గా కూడా చేయగలిగే వ్యాపారం. మీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, కస్టమర్‌లు బట్టి మీకు అనుసరించడానికి ఇష్టం వచ్చిన సమయంలో టికెట్ బుకింగ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. దీనివల్ల మీరు రోజువారీ ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయం పొందగలుగుతారు.
 

45

నెలకు ఎన్ని టిక్కెట్లయినా బుక్ చేయొచ్చు..

మీరు ప్రతి నెల ఎన్ని టిక్కెట్లు అయినా బుక్ చేసుకోవచ్చు. వీటికి లిమిట్ లేదు. మీరు జనరల్ రిజర్వేషన్, తత్కాల్ టిక్కెట్‌లు కూడా అపరిమితంగా బుక్ చేసుకోవచ్చు. దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి కూడా మీకు అనుమతి ఉంది.

సెలవులు, పండుగలు వంటి పీక్ సీజన్లలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉదాహరణకు మీరు నెలలో 200 ఏసీ క్లాస్ టిక్కెట్లు బుక్ చేస్తే మీరు రూ. 8,000 సంపాదించవచ్చు. ఇవే కాకుండా ఇతర టిక్కెట్లు బుక్ చేస్తే మరింత ఆదాయం వస్తుంది. ఇలా మీరు సుమారు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదించొచ్చు. 
 

55

నెలలో మీరు కనీసం 500 టిక్కెట్లు బుక్ చేయగలిగితే మీకు మంచి ఆదాయం వస్తుంది. 100 టిక్కట్ల లోపు ఒక్కో టిక్కెట్టుపై IRCTC రూ.10 తీసుకుంటుంది. 101 నుంచి 300 టిక్కెట్లు బుక్ చేస్తే ఒక్కో టిక్కెట్టుకు రూ.8 తీసుకుంటారు. 300 కంటే ఎక్కువ టిక్కెట్లు బుక్ చేసుకుంటే రూ.5 చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు. ఇలా మీరు ఎన్ని టిక్కెట్లయినా బుక్ చేయవచ్చు. IRCTC టిక్కెట్ బుకింగ్ ఏజెంట్‌గా మారడం అనేది లాభదాయకమైన వ్యాపార ఆలోచన. పెట్టుబడి తక్కువ. సంపాదన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్యాపారాన్ని మీరు ఎక్కడి నుండైనా నిర్వహించవచ్చు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Recommended image2
Highest Paid CEOs : 2025లో అత్యధిక జీతం అందుకున్న టెక్ సీఈవోలు వీళ్లే..!
Recommended image3
Top 10 Companies : ఇండియాలో టాప్ 10 కంపెనీలు ఇవే... మార్కెట్ క్యాప్‌లో కింగ్ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved