Car AC Affect Mileage: కారులో AC వాడటం వల్ల మైలేజీ తగ్గుతుందా?
Car AC Affect Mileage: కారులో AC వాడితే మైలేజీ తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. కాని అసలు విషయం ఏంటో తెలుసుకుందాం రండి. కారులో ఏసీ ఎలా పనిచేస్తుంది. మైలేజీపై ప్రభావం చూపుతుందా లేదా అన్న విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో వేసవి, చలికాలం, వర్షాకాలం ఇలా ఏ వాతావరణ పరిస్థితి ఉన్నా కారులో ఏసీ వేసుకోవడం మాత్రం కామన్ అయిపోయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బయట దుమ్ము, ధూళి, పొల్యూషన్, సౌండ్ డిస్టర్బెన్స్ ఇలా ఎన్నో కారణాల వల్ల కారు స్టార్ట్ చేస్తే చాలు ఏసీ వేయకుండా నడపలేకున్నారు. మరి ఇలా ఎక్కువగా ఏసీ వాడితే కారు మైలేజ్ తగ్గిపోతుందా? కారణాలు చూద్దాం రండి.
ప్రస్తుతం చలికాలం నడుస్తున్నా పగలు మాత్రం ఎండలు దారుణంగా ఉంటున్నాయి. వేసవికాలం రాకపోయినా ఇప్పుడు కారులో వెళ్తే AC లేకుండా ప్రయాణం కష్టంగా మారింది. కానీ AC వాడితే మైలేజీ తగ్గుతుందా అనేది చాలా మందికి ఉన్న సందేహం. అసలు ఏసీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కారులో AC వేసినప్పుడు కంప్రెసర్ శీతల వాయువును ప్రెషర్ చేస్తుంది. ఈ ఒత్తిడి వాయువును ద్రవంగా మారుస్తుంది. ఈ ద్రవం బయటి గాలితో కలిసి వేడిని బయటకు పంపుతుంది. రిసీవర్ డ్రైయర్‌లో తేమ పోయి గాలి చల్లబడుతుంది.
ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత AC కంప్రెసర్‌కు అనుసంధానమై బెల్ట్ తిరుగుతుంది. అప్పుడు AC పనిచేయడం మొదలవుతుంది.
AC వాడితే మైలేజీ తగ్గుతుందా?
దీనికి సమాధానం చాలా సులభం. కారులో AC వాడితే ఫ్యూయల్ వినియోగం పెరుగుతుంది. కానీ అది అంత ఎక్కువ కాదు. మీరు ఏసీ వేసుకొని తక్కువ దూరం ప్రయాణిస్తే మైలేజీపై పెద్దగా ప్రభావం ఉండదు. కానీ మీరు ఎక్కువ దూరం ప్రయాణిస్తే అంటే 3, 4 గంటలు AC వాడితే మైలేజీ 5 నుండి 7 % వరకు తగ్గవచ్చు.
కారులో AC ఎలా వాడాలి
కారులో ఉన్న ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడానికి ACని వాడండి. అంటే కారు చల్లబడిన తర్వాత ACని ఆపివేయండి. అలా చేస్తే కారు మైలేజీపై ప్రభావితం ఉండదు. ACని ఎక్కువ వేగంతో వాడకండి. చల్లని గాలి కోసం కిటికీలను తెరవడం మంచిది. ప్రయాణానికి ముందు ACని సర్వీస్ చేయించుకుంటే లేదా శుభ్రం చేసుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి. మైలేజీ కూడా తగ్గకుండా ఉంటుంది.