Car Loan: కార్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 10 విషయాలు చెక్ చేసుకోండి!
Car Loan: కొత్తగా కారు కొనడానికి లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. కార్ లోన్ కి దరఖాస్తు చేసే ముందు ఈ విషయాలు తెలుసుకొని అప్లై చేస్తే లోన్ తప్పకుండా వస్తుంది.

వడ్డీ రేటు
కార్ లోన్ల వడ్డీ రేట్లు ప్రస్తుతం సంవత్సరానికి 8.65% నుండి 15% వరకు ఉన్నాయి. మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం, లోన్ వ్యవధి, కారు మోడల్, డౌన్ పేమెంట్ వంటి అనేక అంశాలు కార్ లోన్ వడ్డీ రేటును ప్రభావితం చేస్తాయి. ఆన్‌లైన్‌లో వివిధ రకాల కార్ లోన్ ఆఫర్‌లను పోల్చి మీకు అనుకూలమైన వడ్డీ రేటు ఇచ్చే ప్రొవైడర్‌లను సంప్రదించడం మంచిది.
కార్ తయారీదారుల భాగస్వామ్యం
కార్ లోన్ తీసుకునే ముందు, కారు తయారీదారులు నిర్దిష్ట లోన్ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉన్నారా అని ఆరా తీయడం మంచిది. చాలా సార్లు కారు తయారీదారులు నిర్దిష్ట వాహన మోడళ్లకు పోటీ వడ్డీ రేట్లు, అనుకూలమైన నిబంధనలతో లోన్‌లను అందించడానికి బ్యాంకులతో కలిసి పనిచేస్తారు.
లోన్ వ్యవధి
లాంగ్ టర్న్ లోన్ వల్ల నెలవారీ వాయిదాలను తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే లోన్ మొత్తం వడ్డీ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా లోన్ ప్రొవైడర్లు కార్ లోన్‌లకు ఏడు సంవత్సరాల వరకు తిరిగి చెల్లించే వ్యవధిని అందిస్తారు.
క్రెడిట్ స్కోర్
మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే అనుకూలమైన వడ్డీ రేటుతో కార్ లోన్ పొందవచ్చు. కాబట్టి లోన్ కి దరఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. మీ స్కోర్ తక్కువగా ఉంటే, దాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోండి.
ఇతర ఛార్జీలు
కొంతమంది లోన్ ప్రొవైడర్లు కార్ లోన్లకు తక్కువ వడ్డీ రేట్లను అందిస్తారు. కానీ వారు ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజులు, లోన్‌తో సంబంధం ఉన్న అదనపు ఛార్జీలను కూడా విధించవచ్చు. పోటీ వడ్డీ రేట్లతో కనిష్ట ఛార్జీలను నిర్వహించే లోన్ ప్రొవైడర్లను ఎంచుకోవడం మంచిది.
తిరిగి చెల్లించే అవకాశాలు
మీ కార్ లోన్‌ను నిర్ణీత వ్యవధికి ముందే తిరిగి చెల్లించాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ లోన్ ప్రొవైడర్ ముందస్తు చెల్లింపు లేదా ముందస్తుగా లోన్‌ను ముగించడానికి ఛార్జీలు విధించవచ్చు.
సేవ, ప్రాసెసింగ్ టైమ్
కార్ లోన్ కి దరఖాస్తు చేసే ప్రక్రియ సులభతరం కావాలంటే కనీస డాక్యుమెంట్లు అవసరం. మీ లోన్ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయడానికి, మీ లోన్ ఖాతాకు సంబంధించిన బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవడానికి మీకు వీలుండాలి. కాబట్టి కస్టమర్ సర్వీస్ అవసరాలను సమర్థవంతంగా తీర్చగల లోన్ ప్రొవైడర్‌ను ఎంచుకోవడం ముఖ్యం.
లోన్ ఒప్పందం
కార్ లోన్ ప్రారంభంలో ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ లోన్ ఒప్పందం నిబంధనలను పూర్తిగా సమీక్షించాలి. లోన్ ప్రొవైడర్ తరచుగా వడ్డీ రేటును సవరించవచ్చు. మీ లోన్‌కు ఏ ఛార్జీలు వర్తిస్తాయో తెలుసుకోండి.
కార్ లోన్‌లకు ప్రత్యామ్నాయాలు
సాంప్రదాయ బ్యాంకుల నుండి కార్ లోన్ కోసం అర్హత సాధించలేని వ్యక్తులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యామ్నాయ ఆర్థిక ఎంపికలు ఉన్నాయి. సెక్యూరిటీలతో కూడిన లోన్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారం లోన్‌ల ద్వారా కూడా మీకు అవసరమైన డబ్బును ఏర్పాటు చేసుకోవచ్చు.