MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Ideas: డిగ్రీ ఫెయిల్ అయినా పర్లేదు...ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 1 లక్ష నుంచి 2 లక్షలు పక్కా..

Business Ideas: డిగ్రీ ఫెయిల్ అయినా పర్లేదు...ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 1 లక్ష నుంచి 2 లక్షలు పక్కా..

వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా...అయితే డబ్బులు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. స్వంత కాళ్లపై వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఈ ఐడియా ఉపయోగపడే అవకాశం ఉంది. 

Krishna Adhitya | Published : Sep 13 2023, 06:05 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

నిరుద్యోగులు వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా, అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ముద్ర రుణాలతో మీరు వ్యాపారం చేసినట్లయితే, ప్రతినెల చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. .మీరు ముద్ర లోన్ పొందాలి అనుకుంటే మీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్య బ్యాంకును సంప్రదిస్తే సరిపోతుంది. దానికి కావాల్సినటువంటి దరఖాస్తులు ఇతర పత్రాలను సమర్పించడం ద్వారా ఎలాంటి తనఖా లేకుండానే మీరు 50 వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు.

27
Asianet Image

మీ వ్యాపారానికి సంబంధించిన మూలధనం పరిష్కారం అయ్యాక ఏ వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. 

37
Asianet Image

ప్రతి మనిషికి కావాల్సిన నిత్యవసర వస్తువుల్లో సబ్బు కూడా ఒకటి. మనం సబ్బు లేకుండా స్నానం చేయడం అసాధ్యం. మన శరీరం నుంచి మురికిని తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేసేందుకు సబ్బులు ఎంతో ఉపయోగపడతాయి. మీరు సబ్బును ఎంత తరచుగా ఉపయోగిస్తారో తెలిసిన విషయమే. దీన్ని బట్టి మార్కెట్లో మీరు సబ్బులకు ఉన్న డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు.

47
Asianet Image

 మీరు సబ్బుల వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే,  దీనికి సంబంధించినటువంటి శిక్షణ పొందితే మంచిది. తద్వారా మీరు మార్కెట్లో డిమాండ్ను బట్టి సబ్బులను తయారు చేయవచ్చు.  సబ్బుల్లో చాలా రకాలు ఉంటాయి.  అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలతో మీరు పోటీ పడలేకపోవచ్చు.  కానీ మీరు ఏదైనా ఒక ప్రత్యేకత తో కూడిన సబ్బులు తయారు చేసినట్లు అయితే మార్కెట్లో మీరు నిలబడవచ్చు. 

57
Asianet Image

ఉదాహరణకు మైసూర్ శాండిల్ సోప్ గత కొన్ని దశాబ్దాలుగా చందనం నూనెతో తయారుచేసిన సబ్బులను మార్కెట్లో విడుదల చేస్తోంది. తద్వారా ఈ సబ్బులకు మార్కెట్లో ఎన్ని రకాలు సబ్బులు వచ్చినప్పటికీ డిమాండ్ తగ్గడం లేదు. అటువంటి ప్రత్యేకత ఉన్నటువంటి సబ్బులు మీరు కనుక తయారు చేసినట్లు అయితే మార్కెట్లో నిలిచిపోయే అవకాశం ఉంది.

67
Asianet Image

 మీరు సభ్యులను తయారు చేయడానికి ఒక యూనిట్ స్థాపించాల్సి ఉంటుంది.  అదేవిధంగా సబ్బులకు  సంబంధించిన ముడి పదార్థాల కోసం హోల్సేల్ మార్కెట్ నుంచి సరుకులను తెలుసుకోవాల్సి ఉంటుంది.  దీనికి సంబంధించిన సుగంధ తైలాలను కూడా  తెచ్చుకోవాల్సి ఉంటుంది.  ఇవన్నీ ముడి సరుకుగా ఉపయోగపడతాయి.  హస్త కళలను ప్రోత్సహించే ప్రభుత్వ దుకాణాల్లో మీరు ఈ సబ్బులను విక్రయించవచ్చు.  మార్కెట్లో ఎన్ని సబ్బులు ఉన్నప్పటికీ హ్యాండ్ మేడ్ వస్తువులకు చాలా డిమాండ్ ఉంటుంది.  మీరు తయారు చేసే సబ్బు మార్కెట్లో ఉన్నటువంటి ఇతర సభ్యులతో పోల్చితే  ప్రత్యేకతను కలిగి ఉన్నట్లయితే కచ్చితంగా కస్టమర్ల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ లభిస్తుంది. 

77
Asianet Image

ఇక మీ సబ్బు ప్రచారం కోసం సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుంటే మంచిది.  సోషల్ మీడియాలో కస్టమర్ల నుంచి వచ్చినటువంటి ఫీడ్ బ్యాక్ ను ఉపయోగించుకున్నట్లయితే చక్కటి ప్రచారం మీకు లభిస్తుంది.  ఇక సబ్బు పరిశ్రమను ప్రారంభించాలి అనుకున్నట్లయితే మీరు కొన్ని పర్మిషన్లను పొందాల్సి ఉంటుంది.  మున్సిపాలిటీ నుంచి కూడా అనుమతులు పొందాల్సి ఉంటుంది.  ఆన్లైన్లో వ్యాపారం చేయాలి అనుకున్నట్లయితే జీఎస్టీ నెంబర్ కూడా పొందాల్సి ఉంటుంది

Krishna Adhitya
About the Author
Krishna Adhitya
 
Recommended Stories
Top Stories