- Home
- Business
- రూ. 5 లక్షల పర్సనల్ లోన్ కావాలా, అయితే అతి తక్కువ వడ్డీ రేటుకే ఈ బ్యాంకుల్లో దొరుకుతోంది..చెక్ చేసుకోండి..
రూ. 5 లక్షల పర్సనల్ లోన్ కావాలా, అయితే అతి తక్కువ వడ్డీ రేటుకే ఈ బ్యాంకుల్లో దొరుకుతోంది..చెక్ చేసుకోండి..
ఎవరికైనా డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకులు అందించే పర్సనల్ లోన్స్ చాలా సహాయ పడతాయి. ఏ అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాంటి సమయాల్లో బ్యాంకు రుణాలు చాలా ఉపయోగ పడతాయి. బయట ప్రైవేటు రుణాల కన్నా కూడా బ్యాంకు రుణాలు చాలా సేఫ్. వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది. వేతనంలో మీ ఈఎంఐ వాయిదా కట్ అయిపోతుంది. దీంతో మీకు పెద్దగా భారం అనిపించదు. అందుకే అత్యవసర సమయాల్లో ప్రైవేటు రుణాల కన్నా కూడా బ్యాంకు రుణాలపైనే ఎక్కువగా ఆధారపడాలని నిపుణులు చెబుతున్నారు.

ఇతర రుణాల మాదిరిగా కాకుండా, వ్యక్తిగత రుణాలను ఎక్కడైనా ఉపయోగించవచ్చు. 5 లక్షల పర్సనల్ లోనుపై ఎక్కడ తక్కువ వడ్డీ లభిస్తుందో తెలుసుకోవాలంటే, బ్యాంకుల వడ్డీ రేట్ల గురించి తెలుసుకోండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యక్తిగత రుణాలపై 8.9 నుండి 10.55 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 5 లక్షల పర్సనల్ లోనుపై చౌకైన వడ్డీ రేటును అందిస్తుంది. అది కూడా కేవలం 8.9 శాతం వడ్డీతో కావడం విశేషం. ఇది 5 సంవత్సరాల రీపేమెంట్ కాలవ్యవధితో వస్తుంది. దీని EMI రూ. 10,355 అవుతుంది.
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5 సంవత్సరాల కాలవ్యవధితో రూ. 5 లక్షల పర్సనల్ లోనుపై 9.8 శాతం వడ్డీ రేటును కలిగి ఉంది. దీని EMI రూ.10,574 అవుతుంది.
ప్రైవేట్ రంగ Yes బ్యాంక్ 10 శాతం రేటుతో రూ. 5 లక్షల వ్యక్తిగత రుణాన్ని అందిస్తుంది, ఇది 5 సంవత్సరాల రీపేమెంట్ కాలవ్యవధితో వస్తుంది. దీని EMI రూ.10,624 అవుతుంది.
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా 5 సంవత్సరాల కాలవ్యవధికి రూ. 5 లక్షల రుణంపై 10.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. దీని EMI రూ. 10,673 అవుతుంది.
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI వ్యక్తిగత రుణాలపై 10.55 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 5 సంవత్సరాల రీపేమెంట్ వ్యవధితో రూ. 5 లక్షల రుణంపై EMI రూ. 10,759 గా ఉంది.