- Home
- Business
- సిబిల్ స్కోర్ 600 కన్నా తక్కువ ఉన్నా బ్యాంకులో లోన్ కావాలా..ఇలా చేస్తే నిమిషాల్లో లోన్ రావడం ఖాయం..
సిబిల్ స్కోర్ 600 కన్నా తక్కువ ఉన్నా బ్యాంకులో లోన్ కావాలా..ఇలా చేస్తే నిమిషాల్లో లోన్ రావడం ఖాయం..
సిబిల్ స్కోర్ లేకపోయినప్పటికీ మీకు రుణం కావాలా అయితే ఇక ఏమాత్రం ఆందోళన చెందకండి మీ ఇంట్లో బంగారం ఉంటే చాలు దాంతో ఏం చక్కా మీరు? ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించకుండానే రుణం పొందే విలువ ఉంది అందుకు కావాల్సిన వివరాలను మనం తెలుసుకుందాం.

సాధారణంగా బ్యాంకు నుంచి రుణం పొందాలంటే సిబిల్ స్కోర్ అనేది తప్పనిసరి అయింది సివిల్స్ కోసం 750 పాయింట్లు దాటితే మాత్రమే రుణం మంజూరు చేసేందుకు బ్యాంకులో ఆసక్తి చూపిస్తున్నాయి లేనిపక్షంలో రుణాలను ఇవ్వడం లేదు. 600 పాయింట్లు కన్నా తక్కువ ఉంటే అసలు రుణ దరఖాస్తులను ఆమోదించడం లేదు మరి సిబిల్ స్కోర్ లేకుండా మీకు రుణం పొందాలనుకుంటే మీకు అత్యవసర సమయంలో బ్యాంకు నుంచి రుణం కావాలనుకుంటే మాత్రం అందుబాటులో ఉన్న ఏకైక మార్గం గోల్డ్ లోన్ పొందడమే.
ప్రస్తుతం మార్కెట్లో పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సైతం బంగారు రుణాలను అందిస్తున్నాయి. అతి తక్కువ డాక్యుమెంటేషన్ తో, కేవలం నిమిషాల వ్యవధిలోనే బంగారం రుణాలను అందిస్తున్నాయి. బంగారం మార్కెట్ విలువలో సుమారు 75 శాతం వరకు మీకు నగదు రూపంలో రుణం లభిస్తుంది అత్యవసర సమయంలో ఈ రుణం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మీకు ఎక్కువ మొత్తంలో రుణం లభించే అవకాశం ఉంది.
అటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల తో పాటు అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల సైతం బంగారు రుణాలను అందిస్తున్నాయి. మీరు తీసుకున్న రుణంపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది అయితే బంగారం నగలపై అతి తక్కువ చేస్తున్న బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.40 శాతం వడ్డీకే రుణాలను అందిస్తోంది. అలాగే మరో ప్రభుత్వ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.45 శాతానికే రుణాలను అందిస్తోంది ఇక మరో ప్రభుత్వ బ్యాంకు దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయినా ఎస్బిఐ 8.55 శాతానికే రుణాలను అందిస్తోంది.
ఇక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలైన ముత్తూట్ ఫైనాన్స్ 12 శాతానికి బంగారు రుణాలను అందిస్తోంది. ఇక మనపురం ఫైనాన్స్ 9.9 శాతానికి బంగారు రుణాలను అందిస్తోంది. ఇక ప్రైవేట్ బ్యాంకు అయినా ఐసిఐసిఐ బ్యాంక్ 11 శాతానికి, యాక్సిస్ బ్యాంకు 17 శాతానికి రుణాలను అందిస్తున్నాయి.
మీరు సులభవాయిదాల్లో రుణాలను చెల్లించుకుని బంగారు నగలను విడిపించుకోవచ్చు. ఎలాంటి సిబిల్ స్కోర్ లేకుండానే మీరు బంగారు రుణాలను పొందవచ్చు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో బంగారు రుణాలు మీకు తోడ్పడుతాయి.