- Home
- Business
- Business Ideas: మహిళలు ఇంటి దగ్గర పని చేసేందుకు ఓ రెండు గంటలు సమయం ఉందా... అయితే లక్షల్లో ఆదాయం మీ సొంతం..
Business Ideas: మహిళలు ఇంటి దగ్గర పని చేసేందుకు ఓ రెండు గంటలు సమయం ఉందా... అయితే లక్షల్లో ఆదాయం మీ సొంతం..
మహిళలు మీ రోజులో ఇంటి దగ్గర మీరు పని చేయడానికి రెండు గంటల ఖాళీ సమయం ఉందా, అయితే మీ ఖాళీ సమయాన్ని ఒక వ్యాపార అవకాశంగా మార్చుకొని నెలకు లక్షల్లో ఆదాయం పొందే వీలుంది. అలాంటి అవకాశం ఏంటో తెలుసుకుందాం.

మహిళలు ఇంటి దగ్గరే ఉండి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా.. తద్వారా చక్కటి ఆదాయం పొందాలని ప్లాన్ చేసుకుంటున్నారా… పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఇంట్లో కేవలం ఒక్కరు సంపాదిస్తే సరిపోదు. భార్య భర్త ఇద్దరూ సంపాదిస్తేనే ఖర్చులూ అలాగే ఆదా చేయవచ్చు. అయితే కుటుంబ బాధ్యతలు అదృష్ట మహిళలు ఇంటి దగ్గరే ఉండి చేయగలిగే చిరు వ్యాపారాలు ద్వారా కూడా మంచి ఆదాయం పొందే వీలుంది. అలాంటి వ్యాపార అవకాశాల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
మహిళలు ఇంటి వద్ద ఉండి చేయగలిగే వ్యాపారాల్లో ఫుడ్ బిజినెస్ కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లోనూ బ్రేక్ ఫాస్ట్ చేయడం అలవాటుగా మారింది. వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. ఎక్కువగా ఇడ్లీ దోశ తినేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు దోష ఇడ్లీ పిండిని విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం దోష ఇడ్లీ పిండిని విక్రయిస్తున్నాయి.
మహిళలు ఇంటి వద్దే కేవలం ఒకటి నుంచి రెండు గంటలు కష్టపడితే చాలు ద్వారా ఇడ్లీ దోశ పిండి విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ముందుగా దీనికోసం ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం. ఇడ్లీ దోశ పిండి కోసం మీరు వెట్ గ్రైండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే పెద్ద మొత్తంలో మీరు పిండి రుబ్బు కొని, ప్యాకింగ్ చేసి విక్రయించే అవకాశం కలుగుతుంది.
ప్రస్తుతం మార్కెట్లో వెట్ గ్రైండర్స్ కమర్షియల్ తరహాలో అయితే 10వేల నుంచి నాణ్యమైనవి లభిస్తున్నాయి. మీ ఇంట్లోనే ఈ వెట్ గ్రైండర్ ను ఏర్పాటు చేసుకుని. మొదట్లో కొద్ది మొత్తంలోనే పిండి రుబ్బుకుని, ఇడ్లీ దోశ పిండి ని విక్రయించుకోవచ్చు. అపార్ట్మెంట్లు కాలనీలు గేటెడ్ కమ్యూనిటీల్లో మీరు పిండి విక్రయిస్తామని ఫోన్ నెంబర్ ఇవ్వడం ద్వారా ఆర్డర్లను సులభంగా పొందవచ్చు. వీలైతే హోమ్ డెలివరీ చేయడం ద్వారా కూడా పెద్ద మొత్తంలో పొందే అవకాశం ఉంది.
మార్కెట్లో ప్రస్తుతం విక్రయిస్తున్న ఇడ్లీ దోశ పిండి ధరలు ఎంత ఉన్నాయో కనుక్కొని. వాటి కన్నా తక్కువ ధరకు విక్రయిస్తే మీకు చక్కటి ఆదాయం లభిస్తుంది. అంతే కాదు లాభం ఎంత కావాలో మీరే నిర్ణయించుకోండి ముడి పదార్థాలు కరెంటు ఖర్చు వంటివి పరిగణనలోకి తీసుకొని పిండిని విక్రయిస్తే మీరు నష్టపోకుండా ఉంటారు. అలాగే ఆర్డర్లను బట్టి పిండి తయారు చేసుకుంటే నష్టపోరు. పిండిని స్టోర్ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్ కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిది. అలాగే ప్యాకేజింగ్ మెసేజ్ కూడా తీసుకోవడం ద్వారా కవర్లను సీజ్ చేసే అవకాశం దక్కుతుంది. తద్వారా మీకు సమయం మిగులుతుంది.
అలాగే ఇడ్లీ దోశ పిండి విక్రయించేందుకు సమీపంలోని కిరాణా షాపుల్లో సైతం అమ్మకానికి పెట్టి కమిషన్ ప్రాతిపదికన విక్రయదారుల తో ఒప్పందం మాట్లాడుకుంటే మరిన్ని ఆర్డర్లను పొందవచ్చు. మరింత పెద్ద తరహాలో ఈ వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే మీరు సపరేట్గా వర్కర్లను పెట్టుకొని కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకుని FSSAI నమోదు చే నియించుకుని, బ్యాంకు నుంచి రుణం పొంది వ్యాపారం వి ప్రారంభించవచ్చు తద్వారా ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంది.