- Home
- Business
- మహిళలూ ఇంటి వద్దే ఉండి, నెలలో కొన్ని రోజులు ఓ గంట పని చేస్తే చాలు, లక్షల్లో ఆదాయం మీ సొంతం..
మహిళలూ ఇంటి వద్దే ఉండి, నెలలో కొన్ని రోజులు ఓ గంట పని చేస్తే చాలు, లక్షల్లో ఆదాయం మీ సొంతం..
మహిళలు ఇంట్లో కూర్చుని చేయగలిగే అనేక వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి తద్వారా ఇంటి ఖర్చులకు చేదోడు వాదోడుగా మీ ఆదాయం కూడా పెంచుకునే అవకాశం కలుగుతుంది. చాలా మంది మహిళలు ఇంటి వద్ద నుంచే వ్యాపారం చేయాలి అనుకుంటే మాత్రం అనేక వ్యాపార అవకాశాలు మన కళ్ళముందే ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వ్యాపారం గురించి తెలుసుకుందాం.

మహిళలందరూ ఇష్టపడే మెహందీ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ప్రొఫెషనలిజంను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా బిజీ లైఫ్ కారణంగా చిన్న చిన్న పనుల కోసం కూడా ప్రొఫెషనల్స్ పైనే ఆధారపడుతున్నారు. అందులో మెహందీ ప్రొఫెషనల్ కూడా ఒకటి. ముఖ్యంగా మహిళలు పెళ్లిళ్లు ఫంక్షన్స్ పండుగలు సందర్భం మెహందీ చేతులకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. గతంలో అయితే స్నేహితులు లేదా బంధువుల సహాయంతో మెహందీ డిజైన్స్ చేతులకు పెట్టించుకునే వారు.
Image: Getty Images
ప్రస్తుతం ప్రొఫెషనల్ యుగంలో మెహందీ చేతులకు పెట్టడం కూడా వ్యాపారం అయిపోయింది. ఇందుకు ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఒక్కో చేతికి ఒక్కో డిజైన్ చొప్పున వసూలు చేస్తున్నారు. మీకు కూడా మెహందీ డిజైన్ చేయడం వస్తే చక్కటి వ్యాపార అవకాశం మీ చేతుల్లో ఉన్నట్లే. ముఖ్యంగా మెహందీ ప్రొఫెషనల్స్ కు పెళ్లిళ్లలో మంచి డిమాండ్ ఉంది. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు వీరికి చేతి నిండా పనే రోజుకు వేలల్లో సంపాదిస్తారు.
మీరు కూడా మెహందీ ప్రొఫెషనల్ అవ్వాలి అనుకుంటే, ఏం చేయాలో తెలుసుకుందాం. ఒకవేళ మీకు ముందుగానే మెహందీ డిజైన్స్ వచ్చి ఉంటే ఆన్ లైన్ ద్వారా మీరు క్లయింట్లను పొందవచ్చు. ఇందుకోసం మీరు ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మెహందీ డిజైన్ వీడియోస్ ను తయారు చేసి మీ పేరిట ఒక ఛానల్ లేదా పేజ్ ను క్రియేట్ చేసి ఆ వీడియోలను అందులో అప్లోడ్ చేయండి ప్రతి వీడియోలను మీ కాంటాక్ట్ నెంబర్ తెలియజేయండి. ఎవరికైతే మెహేంది ప్రొఫెషనల్ అవసరం ఉందో వారు ఆ వీడియో చూసి మీకు కాల్ చేస్తారు. అయితే యూట్యూబ్ ద్వారా మీ వీడియోస్ అన్ని చూసినట్లయితే మీకు మంచి యూట్యూబ్ రెవిన్యూ కూడా వస్తుంది.
Image: Getty Images
ఇక మీరు మెహందీ ప్రొఫెషనల్ కాకపోతే, మెహందీ డిజైన్ కోర్సు చేయవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెట్విన్ సంస్థ ద్వారా సర్టిఫికెట్ మెహందీ ప్రొఫెషనల్ కోర్సులను అందిస్తోంది. ఈ సర్టిఫికేట్ ఉపయోగించి మీరు వెడ్డింగ్ ప్లానర్స్ అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల్లో మీరు మెహందీ ప్రొఫెషనల్ గా చేరవచ్చు. తద్వారా మీకు మంచి గుర్తింపు ఆదాయం లభిస్తుంది.