రైలు టికెట్ పై వుండే H1, H2, A1 వంటి అక్షరాలకు ఇంత మీనింగ్ వుందా?
ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న రైల్వే టిక్కెట్లపై H1, H2, A1 వంటి గుర్తులుంటాయి గమనించారా? వీటి అర్థమేంటో తెలుసా?
Indian Railway
రైల్వే జర్నీ అనేది మధ్యతరగతి ప్రజల జీవన విధానం. చాలా మంది ప్రజలు భారతీయ రైల్వేలలో ప్రయాణించడానికి ఇష్టపడతారు ఎందుకంటే రైలు టిక్కెట్ ధర ఇతర రవాణా మార్గాల కంటే తక్కువగా ఉంటుంది. అందువల్లే ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ఈ సేవను ఉపయోగించుకుంటున్నారు,
అయితే రైలు ప్రయాణం కోసం ముందస్తుగా టికెట్ బుకింగ్ చేసుకుంటే ప్రయాణికుడి పేరు, వయస్సు, ప్రయాణ తేదీ, సీటు నంబర్ నమోదు చేస్తారు. అలాగే టిక్కెట్‌పై H1, H2 లేదా A1 వంటివి పేర్కొనబడినప్పుడు కొంతమంది ప్రయాణికులు గందరగోళానికి గురవుతారు. టికెట్‌పై H1, H2, A1 అని రాసి ఉంటే అర్థమేమిటో తెలుసుకుందాం.
Indian Railway
ప్రయాణీకులు వారి అభిరుచులు, బడ్జెట్ ఆధారంగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. కొందరు స్లీపర్ క్లాసులో ప్రయాణాన్ని కోరుకుంటే మరికొందరు AC క్లాస్ ను ఎంచుకుంటారు. చాలామందికి రైళ్లలో ఫస్ట్ AC, సెకండ్ AC,థర్డ్ AC క్లాసుల గురించి తెలిసినప్పటికీ, H1, H2, A1 హోదాల గురించి పెద్దగా తెలియదు.. దీంతో టెకెట్ పై ఈ పదాలు కనిపించగానే కంగారు పడతారు.
Indian Railway
ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ టికెట్‌పై H1 అని రాసి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ కోచ్‌లు చాలా విభిన్నమైన, ప్రత్యేకమైన సౌకర్యాలను కలిగి ఉంటాయి. ఈ కోచ్‌లలో ప్రత్యేక క్యాబిన్‌లు ఉంటాయి. క్యాబిన్‌లో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. మీరు రెండు సీట్లను రిజర్వ్ చేసుకుంటే ఆ క్యాబిన్ మొత్తం మీదే. ఈ కోచ్ సీట్లపై H1 అని రాసి ఉంటుంది.
Indian Railway
ఫస్ట్ క్లాస్ ఏసి కంపార్ట్‌మెంట్ రెండు విభాగాలుగా విభజించబడి వుంటుంది... H1 మరియు H2. టికెట్ పై H2 అని వుంటే మీ సీటు ఫస్ట్ క్లాస్ ఏసిలోనే H2 విభాగంలో వుందని అర్థం.
A1 మరియు A2 అంటే ఏమిటి?
మీ టికెట్ "A1" లేదా "A2" చూపిస్తే, గందరగోళం చెందాల్సిన అవసరం లేదు. ఇవి సెకండ్ క్లాస్ ఏసి కోచ్ లను సూచిస్తాయి. టిక్కెట్‌పై A1 అని రాసి ఉంటే మీ సీటు సెకండ్ క్లాస్ ఫస్ట్ ఏసీ కోచ్‌లో ఉందని తెలుసుకోవాలి. A2 అని రాస్తే మీ సీటు సెకండ్ క్లాస్ సెకండ్ కోచ్‌లో ఉందని తెలుసుకోవాలి. అదేవిధంగా మీ టికెట్‌లో "3A" కనిపిస్తే అది థర్డ్ క్లాస్ ఏసిని సూచిస్తుంది.
టికెట్‌పై బి1, బి2, బి3 అని రాసి ఉంటే మీ సీటు థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లో ఉందని అర్థం. కొన్నిసార్లు స్లీపర్ కోచ్ టిక్కెట్లు మూడవ తరగతి కోచ్‌కు మార్చబడతాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు.