రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేసారా ? ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా చేసుకోవచ్చు..
రేషన్ కార్డ్‌తో మీ ఆధార్ కార్డుని ఇంకా లింక్ చేయలేదా ? అయితే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి. ప్రజా పంపిణీ వ్యవస్థ (Public Distribution System)ని క్రమబద్ధీకరించడానికి, అసలైన లబ్ధిదారులకు సబ్సిడీ అందేలా చూడడానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్ తో-రేషన్ కార్డ్ లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. అంతేకాకుండా ఇలా చేయడం ద్వారా డూప్లికేట్ & నకిలీ రేషన్ కార్డులను తొలగించడంలో సహాయపడుతుంది.
ఆధార్-రేషన్ కార్డ్ లింక్ చేయడానికి చివరి తేదీ
ఆధార్-రేషన్ కార్డ్ లింక్ చేయడానికి చివరి తేదీ 30 జూన్ 2024. కానీ ఇప్పుడు గడువు 30 సెప్టెంబర్ 2024 వరకు పొడిగించారు.
ఆధార్ - రేషన్ ఇప్పటికి లింక్ చేయకపోతే ఆన్‌లైన్‌లో ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి...
1) ముందుగా రాష్ట్ర అధికారిక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ప్రతి రాష్ట్రానికి ఒక స్వంత పోర్టల్ ఉంటుంది.
2) ఇప్ప్పుడు ఆధార్‌తో రేషన్ లింక్ చేయడానికి అప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
3) మీ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అలాగే రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి.
4) "కంటిన్యూ/సబ్మిట్" అప్షన్ క్లిక్ చేయండి.
5) మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్‌లో వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
6) ఆధార్ రేషన్ లింక్ చేసిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది.
ఆఫ్ లైన్ ద్వారా ఆధార్ రేషన్ లింక్ చేయడానికి మీ సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించవచ్చు.