Recharge Plan: రోజుకు 2 జీబీ డేటా, 365 రోజుల వ్యాలిడిటీ.. రోజుకు కేవలం రూ. 4 మాత్రమే..
తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీతో కూడిన రీఛార్జ్ ప్లాన్‌లు అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి టెలికం కంపెనీలు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటోంది ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్. ఆకర్షణీయమైన ప్లాన్స్‌తో యూజర్లను అట్రాక్ట్ చేస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా మరో సూపర్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల మూడు ప్లాన్స్‌ను తొలగించిన విషయం తెలిసిందే. రూ.201, రూ.797, రూ.2999 వంటి రీఛార్జ్ ప్లాన్‌లను ఫిబ్రవరి 10 అంటే నేటి నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలోనే యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ, అధికంగా ఇంటర్నెట్ డేటా కోరుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
BSNL
రూ. 1515 రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లు 365 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. అలాగే రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఇంత తక్కువ ధరలో రోజుకు 2 జీబీ అందిస్తున్న ప్లాన్స్‌లో ఇదే బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. అయితే ఈ ప్లాన్‌లో యూజర్లు డేటాను మాత్రమే పొందుతారు. కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్ వంటి బెనిఫిట్స్ ఉండదు. ఇది కేవలం ఒక డేటా వోచర్‌లాగా పనిచేస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది.
ఇక రోజువారీ 2జీబీ డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ లెక్కన చూసుకుంటే రోజుకు కేవలం రూ.4తో యూజర్లు ఈ బెనిఫిట్‌ను పొందొచ్చన్నమాట. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లకు మొత్తం 730 జీబీ ఫాస్ట్ ఇంటర్నెట్‌తో పాటు 40 కేబీపీఎస్‌తో అన్‌లిమిటెడ్ డేటా పొందొచ్చు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఎక్కువ ధరల ప్లాన్‌లను తొలగిస్తూ తక్కువ ధర ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తోంది.
మరో ప్లాన్..
బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న మరో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో రూ. 1198 ఒకటి. ఈ ప్లాన్‌లో కూడా 365 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లకు ప్రతీ నెల 300 నిమిషాల ఫ్రీ కాలింగ్ పొందొచ్చు. అలాగే నెలకు 3 జీబీ డేటాను పొందొచ్చు. అలాగే నెలకు 30 ఉచితి ఎస్‌ఎమ్‌ఎస్‌లు, ఫ్రీ రోమింగ్ అందిస్తారు. ఈ ప్లాన్‌లో నెలకు కేవలం రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునే వారికి, సెకండ్ సిమ్ ఉపయోగించే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.