రతన్ టాటాపై సైరస్ మిస్త్రీ సంచలన వ్యాఖ్యలు.. నష్టానికి వారిదే బాధ్యత అని బెదిరింపు..?

First Published 13, Jun 2020, 1:11 PM

‘టాటా’ సన్స్ గ్రూపునకు ‘సైరస్ మిస్త్రీ’ సుద్దులు మొదలుబెట్టారు. తనను తొలిగించిన తర్వాత గ్రూపునకు జరిగిన నష్టానికి 30 ఏళ్లలో ఎరుగని నష్టానికి టాటా ట్రస్టీలదే బాధ్యత అని బెదిరింపులకు దిగారు. దీనికి కారణం టాటా సన్స్ ప్రైవేట్ లిమిడెడ్‌గా మార్చడమేనని సెలవిచ్చారు.

ముంబై: టాటా గ్రూప్‌ మూడు దశాబ్దాల్లో కనివిని ఎరుగని నష్టాల్లోకి జారుకుందని, మొత్తం రూ.13 వేల కోట్ల నికర నష్టాన్ని సద్దుబాటు చేసిందని టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్ర్తీ ఆరోపించారు. గత డిసెంబర్‌లో మిస్ర్తీని గ్రూప్‌ చైర్మన్‌గా ఎన్సీఎల్‌ఏటీ పునుద్ధరించడాన్ని సవాలు చేస్తూ టాటా గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టుకు ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ ఆరోపణ చేశారు.

టాటా గ్రూప్‌ ఎమిరిటస్‌ చైర్మన్‌ రతన్‌ టాటా ప్రపంచ స్థాయి గవర్నెన్స్‌ ప్రమాణాలకు కట్టుబడి 2012లో టాటా సన్స్‌ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన నాటి నుంచి తనపై జరిగిన వ్యయాలన్నీ, తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. తన పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా లేదని నిరూపించడానికి టాటా గ్రూప్‌లో కామధేనువు వంటి టీసీఎస్‌ ఏటా చెల్లిస్తున్న 85 శాతం భారీ డివిడెండును మినహాయించి నష్టాలను లెక్క కట్టి చూపారని కూడా మిస్ర్తీ ఆరోపించారు.

అదే లెక్కను ఈ రోజున కూడా పరిగణనలోకి తీసుకుని టీసీఎస్‌ డివిడెండును మినహాయిస్తే నష్టం రూ.13 వేల కోట్లుంటుందని సైరస్ మిస్త్రీ అన్నారు. 2016తో పోల్చితే గత ఏడాది టాటా సన్స్‌ నిర్వహణాపరమైన నష్టాలు 282 శాతం పెరిగి రూ.550 కోట్ల నుంచి రూ.2100 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. టాటా సన్స్ సంస్థకు వారసత్వంగా సంక్రమించిన కొన్ని ఇబ్బందుల కారణంగా ఇటీవల సంవత్సరాల్లో పనితీరు దారుణంగా దెబ్బ తిన్నదని సైరస్ మిస్త్రీ ఆరోపించారు.

పనితీరు నిరాశావహంగా ఉండడం వల్లనే తనను సంప్రదాయ విరుద్ధంగా తొలగించినట్టు టాటా సన్స్ చేసిన వాదనను కూడా సవాలు చేస్తూ ఈ చర్యకు కొద్ది వారాల ముందే నామినేషన్‌, రెమ్యూనరేషన్‌ కమిటీ తన పనితీరుపై సంతృప్తి ప్రకటించిన విషయం గుర్తు చేశారు.గ్రూప్‌ పనితీరు దారుణంగా దిగజారడానికి 12 టాటా ట్రస్ట్‌లదే బాధ్యత అని ఆరోపిస్తూ పలు ప్రధాన నిర్ణయాల్లో కొందరు ట్రస్టీలు కీలక పాత్ర పోషించారని నిరూపించేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని సైరస్ మిస్త్రీ పేర్కొన్నారు. ట్రస్టీల కారణంగా ఇతర షేర్‌హోల్డర్లపై ప్రతికూల ప్రభావం పడిందని అన్నారు. ఇందుకు వారందరూ బాధ్యత వహించాల్సిందేనని ఆయన తెలిపారు.

తాను చైర్మన్‌గా పని చేసిన కాలంలో టాటా గ్రూప్‌ మార్కెట్‌ విలువ సెన్సెక్స్‌లో నమోదైన వృద్ధి కన్నా 5 శాతం అధికంగా ఉందని, వరుసగా మూడేళ్ల పాటు వార్షిక నికరాదాయం 34.6 శాతం పెరిగిందని సైరస్ మిస్త్రీ వ్యాఖ్యానించారు.‘నేను చైర్మన్‌గా ఉన్న నాలుగేళ్లలో గ్రూప్‌పై రుణభారం రూ.69.877 కోట్ల మేరకు పెరిగితే వైదొలగిన తర్వాత రెండేళ్ల కాలంలోనే రూ.80,740 కోట్లకు పెరిగింది. టాటా సన్స్‌ను ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా మార్చడం ఇందుకు కారణం. రుణ వ్యయాలు 2016-2019 మధ్య 92 శాతం పెరిగి రూ.2776 కోట్లకు చేరాయి’ అని సైరస్ మిస్త్రీ తెలిపారు.

‘రతన్‌ టాటా హయాంలో కంపెనీకి సరైన పెట్టుబడి వ్యూహం లేదు. ఏ ఒక్క ఏడాదీ ఎలాంటి  వ్యూహపత్రం బోర్డుకు సమర్పించలేదు. సమర్థ వంతమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే భారత కార్పొరేట్‌ చరిత్రలో  గ్రూప్‌ విలువపరంగా ఇంత భారీ విధ్వసం చవి చూసింది’ అని వ్యాఖ్యానించారు. ‘గత మూడేళ్లలోనే టాటా సన్స్‌ వివిధ అనుబంధ కంపెనీల్లో రూ.67 వేల కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా పెట్టుబడి విలువలో రూ.40 వేల కోట్ల నష్టం ఏర్పడింది. స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్ అయిన నాన్‌ టెలికాం పెట్టుబడుల విలువ 23 శాతం క్షీణించి రూ.16,243 కోట్లకు పడిపోయింది’ అని సైరస్ మిస్త్రీ తెలిపారు. అదే కాలంలో సెన్సెక్స్‌లో 27 శాతం వృద్ధి నమోదైతే టాటా గ్రూప్‌ ఇండెక్స్‌ కన్నా 50 శాతం తక్కువ వృద్ధి నమోదు చేసింది.

loader