క్రెడిట్ కార్డు బిల్లును EMIగా మార్చితే నష్టం జరుగుతుందా.?
Credit card: క్రెడిట్ కార్డు వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకులు బిల్లును EMIగా మార్చుకునే సౌకర్యం ఇస్తాయి. అయితే ఈ ప్రక్రియ సిబిల్ స్కోర్‌పై ఏమైనా ప్రభావం చూపుతుందా?

EMIగా మార్చితే సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
క్రెడిట్ కార్డు బిల్లును ఈఎమ్ఐగా మార్చితే క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం పడదు. అయితే ఈఎమ్ఐ మాత్రం సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి చెల్లింపులు క్రమంగా జరగడం వల్ల మీ రీపేమెంట్ హిస్టరీ పాజిటివ్‌గా రికార్డ్ అవుతుంది. అయితే, EMIలు ఆలస్యం చేస్తే లేదా బౌన్స్ అయితే మాత్రం సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది.
EMIలో చెల్లించడం వల్ల అదనపు ఛార్జీలు
ఇది సౌలభ్యం అయినప్పటికీ పూర్తి ఉచితం కాదు. EMI సెటప్ చేసేప్పుడు. వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఛార్జీలు, జీఎస్టీ, ప్రీ-క్లోజర్ ఫీజు (కొన్ని బ్యాంకులలో) లాంటివి వర్తిస్తాయి. కాబట్టి EMI మొదటిగా తక్కువ ఒత్తిడి ఇస్తుంది కానీ మొత్తంగా అధిక ఖర్చు అవుతుంది.
క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR) పై ప్రభావం
EMIగా మార్చిన బిల్లు కూడా మీ కార్డు లిమిట్ లోనే ఉంటుంది. దీంతో మళ్లీ కార్డు వాడితే క్రెడిట్ యుటిలైజేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా CUR 30% లోపే ఉంచితే సిబిల్ స్కోర్ బాగా ఉంటుంది. అయితే 50% లేదా అంతకంటే ఎక్కువగా వాడితే రిస్క్ పెరిగిందని బ్యాంకులు భావిస్తాయి.
EMI బెటర్ ఆప్షన్ ఎప్పుడు తీసుకోవాలి?
కింది సందర్భాల్లో బిల్లు EMIకి మార్చుకోవడం మంచి నిర్ణయం:
* ఒకేసారి మొత్తం బిల్లు చెల్లించలేనప్పుడు
* కనీస వడ్డీతో EMI ఆఫర్ ఉన్నప్పుడు
* రీపేమెంట్ పై పూర్తిగా నియంత్రణ ఉన్నప్పుడు
* Pay Later, Costly Personal Loan కన్నా EMI ఆప్షన్ చౌకగా ఉన్నప్పుడు. అయితే ప్రతిసారి EMI ఆప్షన్ తీసుకోవడం అలవాటు అయితే ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుంది.
మీ సిబిల్ స్కోర్ మెరుగుపడటానికి చిట్కాలు
* సమయానికి EMIలు చెల్లించండి
* మినిమం కాకుండా మొత్తం బిల్లు చెల్లించే అలవాటు పెట్టుకోండి
* కార్డ్ లిమిట్‌ను 30% దాటకుండా ఖర్చు చేయండి
* బ్యాంక్ నుంచి లేట్ ఫైన్, పినాల్టీలు రాకుండా చూసుకోండి
* EMI పూర్తయిన వెంటనే క్రెడిట్ వినియోగాన్ని తగ్గించండి

