MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Credit Card: క్రెడిట్ కార్డుతో డబ్బు విత్ డ్రా చేస్తున్నారా? ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..

Credit Card: క్రెడిట్ కార్డుతో డబ్బు విత్ డ్రా చేస్తున్నారా? ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..

Credit Card: ఈ మధ్యకాలంలోక్రెడిట్ కార్డ్ వినియోగం గణనీయంగా పెరిగింది. క్రెడిట్ కార్డ్ పొందడం ఇప్పుడు సులభం అయినప్పటికీ, చాలా మందికి దాని లాభానష్టాలు పూర్తిగా తెలియవు. ప్రతి ఒక్కరు క్రెడిట్‌ కార్డులపై అవగాహన, దాని లాభానష్టాలేంటో తెలుసుకోవాలి. 

2 Min read
Author : Rajesh K
Published : Jul 19 2025, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 క్రెడిట్ కార్డుతో డబ్బు విత్ డ్రా చేస్తే..
Image Credit : our own

క్రెడిట్ కార్డుతో డబ్బు విత్ డ్రా చేస్తే..

ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం గణనీయంగా పెరిగింది. ఇది ఆన్‌లైన్ షాపింగ్, అత్యవసర ఖర్చులు, రివార్డ్ పాయింట్ల కోసం ఉపయోగపడుతుంది. కానీ అజాగ్రత్తగా వాడితే అప్పుల్లో పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్‌తో ఏటీఎం నుంచి నేరుగా డబ్బులు తీయడం పెద్ద తప్పు. దీనిపై భారీ వడ్డీ, అదనపు ఛార్జీలు విధిస్తారు. కావున జాగ్రత్తగా వాడాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అప్పుల్లో చిక్కుకునే ప్రమాదం
Image Credit : our own

అప్పుల్లో చిక్కుకునే ప్రమాదం

ఒక క్రెడిట్ కార్డుతో డబ్బులు తీసి, మరో కార్డు బిల్లు తీర్చడం అనేది చాలామంది పాటించే పద్ధతి. కానీ ఇది తాత్కాలికంగా సమస్యను పరిష్కరించినట్టు అనిపించినా, భవిష్యత్‌లో పెద్ద ఆర్థిక భారంగా మారుతుంది. క్రెడిట్ కార్డుతో డబ్బులు తీసినప్పటి నుంచే 35% నుంచి 45% వరకు అధిక వడ్డీ వర్తిస్తుంది. ఇది ఇంటి లోన్ లేదా వ్యక్తిగత లోన్ వడ్డీలతో (8% - 15%) పోలిస్తే చాలానే ఎక్కువ.  ఇలా చేయడం వల్ల అప్పు మీద అప్పు పెరిగి, ఆర్థికంగా పూర్తిగా కుదేలయ్యే ప్రమాదం ఉంది.  

35
ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
Image Credit : Getty

ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

క్రెడిట్ కార్డుతో నేరుగా షాపింగ్ చేస్తే 45-50 రోజుల వరకూ వడ్డీ లేని గడువు లభిస్తుంది. కానీ అదే కార్డుతో ATMలో డబ్బులు తీస్తే, వడ్డీ వెంటనే ప్రారంభమవుతుంది. అలాగే 2% - 3% ఫీజు కూడా అదనంగా వేస్తారు. అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో తక్కువ వడ్డీతో వ్యక్తిగత లోన్ లేదా బ్యాంకు లోన్ తీసుకోవడం ఉత్తమం. 

45
క్రెడిట్ కార్డుతో డబ్బు తీయడం లాభం? నష్టమా?
Image Credit : our own

క్రెడిట్ కార్డుతో డబ్బు తీయడం లాభం? నష్టమా?

క్రెడిట్ కార్డుతో డబ్బులు తీసుకోవడం చాలా ఖరీదైన వ్యవహారమే. డబ్బు తీసిన వెంటనే 2% - 3% క్యాష్ అడ్వాన్స్‌ ఫీజు వసూలు చేస్తారు. ఇకపై ప్రతిరోజూ 35% - 45% వరకూ భారీ వడ్డీ కూడా వర్తిస్తుంది. ఈ మొత్తాన్ని వాడకపోయినా, వడ్డీ చెల్లించాల్సిందే. ఇలా వినియోగించిన  మొత్తం కన్నా ఎక్కువ ఖర్చవుతుంది. సాధారణంగా ఇంటి లోన్,  వెహికల్ లోన్, వ్యక్తిగత లోన్లకు 8% - 15% వడ్డీ ఉంటుంది. అందుకే అత్యవసర సమయాల్లోనూ క్రెడిట్ కార్డుతో డబ్బులు తీయడం సరికాదనే చెప్పాలి. 

55
జాగ్రత్తలు తప్పనిసరి
Image Credit : Getty

జాగ్రత్తలు తప్పనిసరి

క్రెడిట్ కార్డు ఉండటం తప్పు కాదు, కానీ జాగ్రత్తగా వాడటం చాలా ముఖ్యం. అత్యవసర ఖర్చులు, షాపింగ్, రివార్డ్స్ కోసం ఉపయోగపడినా, అజాగ్రత్తగా వాడితే అప్పుల్లో పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డుతో నేరుగా డబ్బులు తీయడం చాలా ప్రమాదకరం, ఎందుకంటే దీనిపై ఎక్కువ వడ్డీ, అదనపు ఛార్జీలు విధిస్తారు.  అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిత సమయాల్లో క్రెడిట్ కార్డును దూరంగా ఉండాలి. భవిష్యత్ అవసరాల కోసం బ్యాంకు లోన్లు లేదా అత్యవసర నిధిని ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Recommended image2
Amazon Sale: వాషింగ్ మెషీన్ కొనేందుకు ఇదే మంచి టైమ్.. అమెజాన్ లో బెస్ట్ డీల్స్ ఇవిగో
Recommended image3
Gold Price Fall: నవరాత్రి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. దిగొచ్చిన బంగారం
Related Stories
Recommended image1
Credit card: మార‌నున్న క్రెడిట్ కార్డ్ మినిమం అమౌంట్ డ్యూ నిబంధ‌న‌లు.. జూలై 15 నుంచే
Recommended image2
Credit Card: క్రెడిట్ కార్డు ఉన్నా వాడట్లేదా? అయినా బిల్లు కట్టాల్సిందే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved