మీ జేబులో ఉన్న రూ.2000 నోటు నిజమా లేక నకిలీదా..? ఇప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు..
దేశంలో నకిలీ నోట్ల చలామణి అరికట్టేందుకు డీమోనిటైజేషన్ మంచి దశగా పరిగణించవచ్చు. కానీ ఇప్పుడు మార్కెట్లోకి మళ్లీ నకిలీ నోట్ల చలామణి పుట్టుకొస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వార్షిక నివేదిక ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ .5.45 కోట్లకు పైగా విలువైన నకిలీ నోట్లు పట్టుబడ్డాయి.
ఇందులో రెండు వేల రూపాయల 8798 నకిలీ నోట్లు పట్టుబడ్డాయి వీటి విలువ మొత్తం - 1,75,96000 రూపాయలు. నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో మీకు చాలా విషయాలను తెలిసే ఉంటాయి, కానీ మీకు తెలియని నోటుకు సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి. వీటి సహాయంతో మీరు నోటు నిజమైనదా లేదా నకిలీదా అని చిటికెలో తెలుసుకోవచ్చు...
*నోటు విలువ నోటు ఎడమ వైపున దేవనాగరిలో వ్రాసి ఉంటుంది
*నోట్ మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో ఉంటుంది.
*ఆర్‌బిఐ జారీ చేసిన నోట్లపై సెక్యూరిటీ థ్రెడ్‌లో - భారత్ 2000 ఆర్‌బిఐ - అనే మూడు పదాలు ఉంటాయి. నోట్ వంగి ఉన్నప్పుడు భద్రతా థ్రెడ్ రంగు ఆకుపచ్చ నుండి నీలం రంగులోకి మారుతుంది.
*మహాత్మా గాంధీ సిరీస్ కొత్త నోట్ పై ఆర్‌బిఐ గవర్నర్ సంతకం ఉంటుంది.
*నోట్ల పై ఒక నంబర్ ప్యానెల్ ఉంటుంది దీనిలో నంబర్లు చిన్న నుండి పెద్ద వరకు వ్రాసి ఉంటుంది
*ఆర్‌బిఐ జారీ చేసిన నోట్లకు నిర్ణీత సైజ్ ఉంటుంది. 2000 రూపాయల నోటు సైజ్ 66×166 ఎంఎం.
*నోట్ కుడి వైపున అశోక పిల్లర్, వాటర్‌మార్క్ కూడా ఉంటుంది.
*నోటు ముద్రించిన సంవత్సరం నోట్ వెనుక వైపు వ్రాసి ఉంటుంది
దృష్టి లోపం ఉన్నవారు ఎలా గుర్తించాలంటే ?
*దృష్టి లోపం ఉన్నవారు కూడా నోట్లను గుర్తించవచ్చు. నోట్ ముందు భాగంలో ఎడమ ఇంకా కుడి వైపులా ఏడు గీతాలు ఉంటాయి.
*నోట్ విలువ దీర్ఘచతురస్రాకారంలో పెద్ద అక్షరాలతో ఉంటుంది.
*మహాత్మా గాంధీ బొమ్మ, అక్షరాలతో వ్రాసిన నోటు విలువ నోటుపై ముద్రించి ఉంటుంది.
దీనితో పాటు అశోక పిల్లర్ ఆకారం కూడా నోట్లో పై ఉంటుంది.
*మీరు నకిలీ నోటును గుర్తించడంలో ఏదైనా సమస్యను ఉంటే https://paisaboltahai.rbi.org.in/ వెబ్‌సైట్‌లో ఫోటో, గ్రాఫిక్‌లతో కొత్త నోట్ పూర్తి వివరాలను మీరు అర్థం చేసుకోవచ్చు. అన్ని నోట్లకు సంబంధించి పూర్తి సమాచారం ఈ వెబ్‌సైట్‌లో లభిస్తుంది.