- Home
- Telangana
- చెరువులో శవం ఉందని పోలీసులకు సమాచారం.. వెళ్లి చేయి పట్టుకొని లాగగా షాకింగ్ సంఘటన. వైరల్ వీడియో
చెరువులో శవం ఉందని పోలీసులకు సమాచారం.. వెళ్లి చేయి పట్టుకొని లాగగా షాకింగ్ సంఘటన. వైరల్ వీడియో
Viral Video: ఏమంటూ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ముఖ్యంగా వైరల్ వీడియోలకు నెట్టింట ఫుల్ క్రేజ్ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. తాజాగా ఇలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది.

చెరువులో మనిషి
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోన్న వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి చెరువులో పడుకుని ఉన్నాడు. దీంతో అటుగా వెళ్తున్న కొందరు దీనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. చెరువులో ఉన్న వ్యక్తి మరణించాడని భావించి 108 అంబులెన్స్‌కు సైతం కాల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షణాల్లో సంఘటన స్థలానికి చేరుకున్నారు
పట్టుకొని లాగగా..
చెరువు గట్టున నీటిలో పడుకున్న వ్యక్తి కచ్చితంగా మరణించాడని పోలీసులు కూడా భావించారు. దీంతో అతన్ని బయటకు లాగుదామని చేయి పట్టుకుని.. కాస్త బయటకు లాగారు కూడా. అయితే అంతలోనే ఒక్కసారిగా సదరు వ్యక్తి ఎవరు లాగుతున్నారంటూ వెనక్కి తిరిగి చూశాడు. దీంతో పోలీస్ ఆఫీసర్ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు.
ఎందుకిలా అని ప్రశ్నించగా..
సదరు వ్యక్తి బయటకు వచ్చిన వెంటనే పోలీసులు అతనిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇలా చెరువులో ఎందుకు పడుకున్నావు అని అడిగారు. అయితే ఆ వ్యక్తి ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మద్యం మత్తులో మాట్లాడుతూ.. పోలీసులనే రూ. 50 ఇవ్వండి అని అడగడం వైరల్‌గా మారింది.
చక్కర్లు కొడుతోన్న వీడియో..
పోలీసుల ప్రశ్నలకు బదులిచ్చిన సదరు వ్యక్తి.. తాను సమీపంలోని ఓ గ్రైనేట్ మైనింగ్‌లో పనిచేస్తానని చెప్పుకొచ్చాడు. రోజుకు 12 గంటలు చేసి అలసిపోయానని, అందుకే ఇలా నీటిలో విశ్రాంతి తీసుకుంటున్నాని చెప్పుకొచ్చాడు. దీనంతటనీ అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ ట్రెండ్ అవుతోంది.
వీడియో పాతదే అయినా..
నిజానికి ఈ వీడియో గతంలో తీసిందే అయినా తాజాగా మళ్లీ వైరల్ అవుతోంది. charanraj81 అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఏకంగా 2.60 లక్షల మంది వీక్షించడం విశేషం. ఏది ఏమైనా ఇప్పుడీ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.