MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఎక్కువ మైలేజ్ కావాలా? ఈ CNG బైక్స్ బెస్ట్ మైలేజ్ ఇస్తాయి

ఎక్కువ మైలేజ్ కావాలా? ఈ CNG బైక్స్ బెస్ట్ మైలేజ్ ఇస్తాయి

మైలేజ్ ఎక్కువగా ఇచ్చే బైక్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్, CNG వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే పెట్రోల్ వెహికల్స్ తో పోలిస్తే ఎలక్ట్రిక్, సీఎన్జీ వెహికల్స్ మాత్రమే ఎక్కువ మైలేజీ ఇస్తాయి. CNGలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కొన్ని బైక్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 23 2025, 08:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మీరు మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? పెట్రోల్ వెహికల్స్ కంటే సీఎన్జీ, ఎలక్ట్రిక్ బైక్స్ అయితే బాగా మైలేజ్ ఇస్తాయి. ఇక్కడ ఉన్న బైకులు మీకు మంచి సెలక్షన్ కి ఉపయోగపడతాయి. ఆటోమొబైల్ మార్కెట్ లో ప్రముఖ కంపెనీలకు చెందిన రెండు CNG ద్విచక్ర వాహనాలకు చెందిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

24

TVS జూపిటర్ CNG 52 km/kg

TVS, ఆటో ఎక్స్‌పో 2025లో తమ కొత్త జూపిటర్ 125 CNGని విడుదల చేసింది. కొత్త స్కూటర్‌లో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 1.4 kg CNG ట్యాంక్ ఉంటాయి. దీని ద్వారా దాదాపు 226 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. ఈ వాహనం ఇంకా మార్కెట్ లోకి రాలేదు. TVS త్వరలోనే జూపిటర్ CNG వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేస్తుంది.

ఈ స్కూటర్ 52 km/kg CNG మైలేజ్ ఇస్తుంది. స్కూటర్‌లో LED హెడ్‌లైట్, USB ఛార్జర్, సైడ్ స్టాండ్ కట్-ఆఫ్ ఉంటాయి.

 

34

బజాజ్ ఫ్రీడమ్ 125– 65 km/kg

బజాజ్ కంపెనీ దశాబ్దాలుగా ప్రజల మన్ననలు పొందుతోంది. తక్కువ ధరకే వాహనాలు విక్రయిస్తూ ప్రజాదరణ పొందుతోంది. అందుకే ఇప్పుడు లీటరుకు అత్యధిక మైలేజ్ ఇచ్చే కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 వెహికల్ ని ఈ బ్రాండ్ కంపెనీ తీసుకొచ్చింది.

బజాజ్ ఫ్రీడమ్ 125లో పెట్రోల్, 2 kg CNG ట్యాంక్‌లు ఉంటాయి. 125cc ఇంజిన్ ఉన్న ఈ బైక్ 9.5 bhp @8000 rpm శక్తిని, 9.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

1 kg CNGతో ఈ బైక్ 65 km/kg మైలేజ్ ఇస్తుంది. భద్రత విషయంలో ఈ బైక్ బెస్ట్ అని రుజువైంది. ఫ్రీడమ్ 125 ధర మార్కెట్ లో రూ.1,10,000గా ఉంది. 

44

EV vs CNG ద్విచక్ర వాహనాలు

EV, CNG వాహనాలు ఇటీవల మార్కెట్లోకి చాలా వచ్చాయి. చాలా EV స్కూటర్లు 2.9 KWH నుండి 4 Kwh వరకు బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తాయి. CNG, పెట్రోల్ వాహనాల కంటే ఛార్జింగ్ వెహికల్స్ రోజువారీ వినియోగానికి బాగా ఉపయోగపడతాయి. ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ధర మాత్రం ఇతర వాహనాలతో పోలిస్తే కాస్త ఎక్కువే ఉంటుంది. 

EV వాహనం పూర్తిగా ఛార్జ్ కావడానికి 4 నుండి 6 గంటలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్‌లను ఉపయోగిస్తే ఛార్జింగ్ ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ లో EVల నుండి ఎక్కువ విలువ పొందవచ్చు. బడ్జెట్ సమస్య ఉంటే CNG ద్విచక్ర వాహనాలను ఎంచుకోవడం బెటర్. మీ ఆర్థిక పరిస్థితులు, ఇష్టాయిస్టాలను పరిగణించుకొని మీకు తగిన వాహనాన్ని ఎంపిక చేసుకోండి. 

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price: గుడ్ న్యూస్.. పసిడి ధర ఎంత తగ్గిందంటే...?
Recommended image2
Post office: ఏం చేయ‌కుండానే 5 ఏళ్ల‌లో రూ. 4 ల‌క్ష‌లు పొందే అవ‌కాశం.. ప్ర‌భుత్వ గ్యారెంటీతో
Recommended image3
Old Gold: పాత బంగారాన్ని అమ్మేస్తే లాభమా? వాటిని ఇచ్చి కొత్త నగలు తీసుకోవడం మంచిదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved