ప్రపంచవ్యాప్తంగా చైనా స్టేటస్ ఎందుకు పెరుగుతోంది ? అమెరికన్లు అక్కడ ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారు..?

First Published Feb 17, 2021, 5:14 PM IST

ఆగ్రా రాజ్యమైన అమెరికాను ఓడించి యూరోపియన్ యూనియన్ (ఇయు) లో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా మారింది. 2020లో యూరోపియన్ యూనియన్ గణాంకాల సంస్థ యూరోస్టాట్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చైనా -ఇయు మధ్య 383.5 యూరోల టర్నోవర్ ఉంది. ఇయు నుండి చైనాకు ఎగుమతులు 2.2 శాతం పెరిగాయి, అలాగే చైనా నుండి దిగుమతులు 5.6 శాతం పెరిగాయి. అంతకుముందు యు.ఎస్ ఎల్లప్పుడూ ఇ.యుకి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండేది. అయితే గత ఏడాది ఇ.యు నుంచి అమెరికాకు ఎగుమతులు ఎనిమిది శాతం, దిగుమతులు 13 శాతం తగ్గాయి.