అమెరికా అధ్యక్షుడు ఎవరు? Chat GPT ఏం చెప్పిందో తెలుసా?
అమెరికాకు కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యాడని, ఆయన డొనాల్డ్ ట్రంప్ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. కాని టెక్నాలజీలో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసిన Chat GPTని ‘అమెరికా అధ్యక్షుడు ఎవరు?’ అని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? రండి తెలుసుకుందాం.

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తున్నారు. 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ పనిచేశారు. ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత జనవరి 20, 2025న ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. డొనాల్డ్ ట్రంప్ గతంలో 2017 నుండి 2021 వరకు 45వ అధ్యక్షుడిగా పనిచేశారు.
అయితే Chat GPTని ఇటీవల కొన్ని సంస్థలు, పలువురు అమెరికా అధ్యక్షుడు ఎవరు అని అడిగితే జో బిడెన్ అని తప్పుగా చెప్పిందట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు, రెండోసారి పదవిలో ఉన్నారు. Chat GPTవంటి AI మోడల్స్ లో పెద్ద లోపాలే ఉన్నాయని ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
డొనాల్డ్ ట్రంప్ వరుసగా రెండుసార్లు అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి అమెరికా అధ్యక్షుడిగా నిలిచారు. ఇది ఒకరకంగా రికార్డ్ ల్లో నిలిచే విషయం. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద AI వేదిక అయిన Chat GPT ఇలా తప్పు చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
ఎందుకంటే మనలో చాలామంది ఏదైనా ప్రశ్నకు సమాధానం కావాలంటే వెంటనే Chat GPTని అడుగుతున్నాం. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఎవరు అనే ప్రశ్నకు జో బిడెన్ అని తప్పుగా చెప్పడంతో విమర్శలు వచ్చాయి. చాట్‌జిపిటి ఇచ్చిన సమాధానం ఏంటంటే.. “ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జనవరి 20, 2021 నుండి 46వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు”. అని మెసేజ్ ఇచ్చింది. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో ఈ లోపాన్ని కొందరు నిపుణులు సరిచేశారట.
ప్రపంచవ్యాప్తంగా అందరూ ఉపయోగించే Chat GPT ఇలాంటి తప్పులు చేయడం చర్చనీయాంశమైంది. Chat GPTకి పోటీగా చైనా కంపెనీ కొత్త AI మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇది AI రంగంలో కొత్త మార్పులు తీసుకొస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
2023లో చైనా క్వాంటమ్ హెడ్జ్ ఫండ్ అధిపతి లియాంగ్ వెన్‌ఫెంగ్ స్థాపించిన కంపెనీ డీప్‌సీక్. ఈ కంపెనీ డీప్‌సీక్, R1,R1 జీరో అనే రెండు AI మోడళ్లను ప్రవేశపెట్టింది. వీటిలో R1 మోడల్ ఇప్పటికే వినియోగంలోకి వచ్చింది.
ఇది ఒక సాధారణ AI మోడల్. అదే సమయంలో ఇంకా వినియోగంలోకి రాని R1 జీరో స్వయంగా నేర్చుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉందట. అమెరికా కంపెనీలు AI మోడల్స్ కోసం పెట్టే ఖర్చు కంటే తక్కువకే R1 జీరో మోడల్ తయారైందట. కేవలం 6 మిలియన్ డాలర్లతో డీప్‌సీక్ AI రూపొందించబడిందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే డీప్‌సీక్ అగ్రస్థానంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.