credit card fraud కొత్త క్రెడిట్ కార్డు అన్నారు.. రూ.9 లక్షలు కొట్టేశారు!
ఇటీవలి ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. మోసగాళ్లు రకరకాల దారుల్లో జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ప్రయత్నంలో చండీగఢ్‌కు చెందిన ఒక వ్యక్తి దాదాపు 9 లక్షల రూపాయలు కోల్పోయాడు.
- FB
- TW
- Linkdin
Follow Us

కొత్త క్రెడిట్ కార్డు
కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ప్రయత్నంలో చండీగఢ్‌కు చెందిన వ్యక్తి దాదాపు 9 లక్షల రూపాయలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన డిసెంబర్ 2024లో జరిగింది. ఈ కేసులో, మోసగాళ్లు బ్యాంక్ అధికారులుగా నటించి బాధితుడికి కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడంలో సహాయం చేస్తామని చెప్పి డబ్బును కాజేశారు.
క్రెడిట్ కార్డ్ మోసాలు
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, చండీగఢ్‌లోని సెక్టార్ 31లో నివసించే బాధితుడు టి. రాజేష్ కుమార్‌ను డిసెంబర్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారి అని చెప్పుకొంటూ అజయ్ త్రిపాఠి అనే వ్యక్తి సంప్రదించాడు. కొత్త క్రెడిట్ కార్డు పొందడంలో సహాయం చేస్తానని చెప్పాడు. రాజేష్ అందుకు అంగీకరించాడు.
క్రెడిట్ కార్డ్ మోసం
తర్వాత వాట్సాప్‌లో మళ్ళీ కాల్ చేసిన మోసగాళ్ల బృందం బాధితుడి నుండి గుర్తింపు ధృవీకరణ కోసం బ్యాంక్ వివరాలను అడిగింది. రాజేష్ దానిని నమ్మి అడిగిన వివరాలను పంచుకున్నాడు. తన భార్య అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల వివరాలను కూడా మోసగాళ్లకు ఇచ్చాడు.
క్రెడిట్ కార్డ్ వినియోగదారులు
తర్వాత మోసగాళ్లు రాజేష్‌కు ఒక లింక్‌ను పంపి, దానిపై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయమని సూచించారు. రాజేష్ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, రెండు క్రెడిట్ కార్డులలో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు గమనించాడు.
క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డును ఉపయోగించి రిలయన్స్ రిటైల్ ద్వారా 8,69,400 రూపాయల విలువైన ఆరు లావాదేవీలు జరిగాయి. ఆక్సిస్ బ్యాంక్ కార్డు నుండి మరో 60,000 రూపాయలు కాజేశారు. రాజేష్ తర్వాత కార్డులను బ్లాక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, అప్పటికే సమయం మించిపోయింది.
క్రెడిట్ కార్డ్ హోల్డర్లు
మోసగాళ్లు అక్కడితో ఆగకుండా, మరుసటి రోజు బాధితుడిని మళ్ళీ సంప్రదించి మరిన్ని డబ్బులు కాజేయడానికి ప్రయత్నించారు. బాధితుడి అమెజాన్ ఖాతాను కూడా హ్యాక్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు రాజేష్ చండీగఢ్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.