MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Business
  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్: సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీకోసం రెడీగా ఉన్నాయి

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీకోసం రెడీగా ఉన్నాయి

మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే 2025 సంవత్సరం ప్రారంభంలోనే మీకు ఎన్నో అవకాశాలు సిద్దంగా ఉన్నాయి. ఈ ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. అనేక రంగాల్లో అర్హతలకు తగ్గ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా జనవరి నెలలోనే అనేక నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఏఏ శాఖలు, ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఇక్కడ వివరాలు తెలుసుకోండి.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 02 2025, 11:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు వాటి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంత కాలానికి వారందరి ఎదురు చూపులు ఫలించాయి. దేశంలోని వివిధ విభాగాలు, శాఖలు, సంస్థల్లో ఖాళీలను నింపేందుకు 2025 సంవత్సరం ప్రారంభ నెల అయిన జనవరిలోనే నోటిఫికేషన్లు విడుదల చేశారు. ముఖ్యంగా కోచిన్ షిప్‌యార్డ్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రైల్వే, సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, ఎన్ఎల్సీ ఇండియా వంటి సంస్థల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో వివరాలు తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కోచిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో వివిధ విభాగాల్లో శిక్షణ ఉద్యోగాలకు నియామకాలు జరుగుతున్నాయి.  వీటికి 27 సంవత్సరాల వయస్సు వరకు వయో పరిమితి ఉంది. మొత్తం 44 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కనీసం ఇంజనీరింగ్ విద్యార్హత ఉండాలి. ఇదే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్, సీఏ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కోచిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నడుస్తుంది. ఈ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు 06.01.2024 చివరి తేదీ.

35

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో కూడా పలు విభాగాల్లో ఖాళీలను పూరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్, సైంటిస్ట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ విభాగాల్లో 44 ఖాళీలు ఉన్నాయి. వీటికి అప్లై చేయాలంటే 28 సంవత్సరాల వయస్సు లోపు ఉండాలి. ఈ రెండు కేటగిరీల్లో జాబ్స్ కి దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ 07.01.2025, 09.01.2025. మీరు అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి. 
 

45

భారతీయ రైల్వేల్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సంస్థలో 11 ఖాళీలు భర్తీ కానున్నాయి. ప్రత్యక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. 55 సంవత్సరాల లోపు వారు ప్రయత్నించవచ్చు. ఇంటర్వ్యూ తేదీలు 09.01.2025 మరియు 10.01.2025. పూర్తి వివరాలు తెలియాలంటే ఇండియన్ రైల్వే అఫీషియల్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి. 
 

55

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ లో చాలా కాలంగా 179 ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ జాబ్ కి అప్లై చేయాలంటే 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ : 12.01.2025.

ఎన్ఎల్సీ ఇండియాలో 167 ట్రైనింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. GATE పరీక్ష స్కోరు ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుంది. దీనికి అప్లై చేయాలంటే 30 ఏళ్లు దాటి ఉండకూడదు. ఈ పోస్టుల దరఖాస్తుకు 15.01.2025 చివరి తేదీ. 

ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్‌సైట్లలో ప్రకటనలను చూడండి.
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పండుగలు దగ్గర పడుతున్న వేళ బిగ్ షాక్ ఇచ్చిన పసిడి...కొనుగోలుదారులపై పెరిగిన మరింత భారం
Recommended image2
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image3
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved