- Home
- Business
- Gold Rate: ఏప్రిల్ 22 నాటికి బంగారం తులం ధర త్వరలోనే రూ.65000 దాటే చాన్స్...ఆ తర్వాత రూ.50 వేలకు పడిపోతుందా..?
Gold Rate: ఏప్రిల్ 22 నాటికి బంగారం తులం ధర త్వరలోనే రూ.65000 దాటే చాన్స్...ఆ తర్వాత రూ.50 వేలకు పడిపోతుందా..?
బంగారం ధర ప్రస్తుతం 60000 దాటిపోయింది దీంతో ఇక భవిష్యత్తులో బంగారం ధర దిగిరాదని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ కొంతమంది నిపుణులు మాత్రం బంగారం ధర త్వరలోనే 50,000 దిగువకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందుకు దారి తీసే కారణాలను సైతం చెబుతున్నారు అవేంటో తెలుసుకుందాం.

బంగారం ధర ఏకంగా 60000 దాటిపోయింది. దీంతో పసిడి ప్రియులకు కంట్లో కన్నీళ్లు వస్తున్నాయి. ఒక్క గ్రాము బంగారం కొనాలి అన్న సుమారు 6000 పెట్టాల్సి వస్తోంది. దీంతో బంగారం కొనుగోలు చేసేవారు పసిడి ధర ఎప్పుడు తగ్గుతుందా నీ ఎదురుచూస్తున్నారు. అర తులం పెట్టి చిన్న బంగారు గొలుసు చేయించుకోవాలన్నా కూడా దాదాపు 30 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో బంగారు నగల జోలికి మధ్యతరగతి ప్రజలు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి. ఎప్పుడు తగ్గుతాయి. మళ్లీ బంగారం ధరలు సామాన్య ధరలకు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయా, లేదా అనే సంగతులను తెలుసుకుందాం.
బంగారం ధరలు మార్చి నెలలో జీవితాల కాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఏకంగా 61 వేల రూపాయలకు బంగారం ధర పలికింది. దీని వెనక ప్రధానంగా అమెరికాలోని బ్యాంకింగ్ సంక్షోభం, ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అమెరికాలోని బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా డాలర్ బలహీనపడింది. అటు అమెరికాలో ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. బ్యాంకింగ్ స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూడాయి. దీంతో మదుపుదారులు సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావించే బంగారంలోకి తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో 50 వేల సమీపంలో ఉన్న బంగారం ఒక్కసారిగా జీవితకాల గరిష్ట స్థాయి అయినా 56 వేలను తాకి అప్పటినుంచి 60 వేలు దాటిపోయింది. ఇదంతా కేవలం రెండు వారాల వ్యవధిలోనే జరిగిపోయింది.
బంగారం ధర ఇలా ఆకాశమే హద్దుగా పెరగడంతో పసిడి ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. అటు అమెరికాలో కూడా ఔన్స్ ( 31 గ్రాములు) బంగారం ధర రెండువేల డాలర్లు దాటిపోయింది. దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. మరోవైపు పసిడి ధరలు ఆకాశాన్ని తాకడంతో రాబోయే అక్షయ తృతీయ పైన కూడా ఎఫెక్ట్ కనిపిస్తుందని నగల దుకాణాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాదు ఈ అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధర 65 వేల రూపాయలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని వెనుక కారణం లేకపోలేదు. పసిడి ధర అతి త్వరలోనే అంతర్జాతీయంగా 2100 డాలర్లు దాటే అవకాశం ఉందని ఈ రేంజ్ లో బంగారం పెరిగితే మాత్రం దేశీయంగా కూడా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు బంగారం ధర తగ్గాలంటే అమెరికాలో మొదలైన బ్యాంకింగ్ సంక్షోభానికి ముగింపు రావాల్సి ఉందని, అలాగే పశ్చిమ దేశాల్లో ఆర్థిక సంక్షోభం సర్దుమనిగితే నెమ్మదిగా బంగారం ధరలు కూడా భూమార్గం పడతాయని, భవిష్యత్తులో 50 వేల దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు. గతంలో 56 వేల రూపాయల గరిష్ట స్థాయిని తాకిన బంగారం ఆ తరువాత 48 వేల రూపాయలకు పతనమైంది. ఈ నేపథ్యంలో పసిడి ధర భవిష్యత్తులో 50వేల దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.