MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Munagaku Business: మునగాకులతో చేసే బిజినెస్.. నష్టమే రాదు, మూడెకరాల భూమి ఉంటే చాలు

Munagaku Business: మునగాకులతో చేసే బిజినెస్.. నష్టమే రాదు, మూడెకరాల భూమి ఉంటే చాలు

Munagaku Business: ఆర్మీలో పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు మునగాకుతో లక్షలు సంపాదిస్తున్నారు. వారి పేరు దీపక్ గడేకర్, సంతోష్ నార్వాడే. కేవలం 3 ఎకరాల భూమిలో మునగాకు పౌడర్ తయారు చేస్తూ ఏడాదికి లక్షల్లో సంపాదిస్తున్నారు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 02 2026, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మునగాకు పొడితో బిజినెస్
Image Credit : Chatgpt

మునగాకు పొడితో బిజినెస్

మునగాకును ఇప్పుడు సూపర్ ఫుడ్ గా చెప్పుకుంటున్నారు. ఇందులో ఉండే పోషకాలు, రోగనిరోధక శక్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా దీనికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. 2025 నాటికి 0.65 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ మునగాకు పౌడర్ మార్కెట్, 2035 నాటికి 1.16 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అయితే ఈ గ్లోబల్ డిమాండ్‌లో 80 శాతం మన భారతదేశమే తీరుస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న దీపక్, సంతోష్.. తమ 15 ఎకరాల  భూమిలో మొత్తం 3 ఎకరాల్లో మునగ సాగు మొదలుపెట్టారు. ఎక్కువ ఆకు దిగుబడినిచ్చే 'వలియాపట్టి' (Valiyapatti) రకం విత్తనాలను చల్లారు. ఇందుకోసం వీళ్లు తమిళనాడులోని కోయంబత్తూరు వరకు వెళ్లారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తెలివైన బిజినెస్
Image Credit : Gemini AI

తెలివైన బిజినెస్

చాలామంది రైతులు మునగాకును అమ్మి డబ్బు సంపాదిస్తారు. కానీ వారికి వచ్చేది చాలా తక్కువ.  కానీ ఈ మాజీ సైనికులు ఇక్కడే తమ తెలివిని ఉపయోగించారు. ఆకును నేరుగా అమ్మకుండా, దాన్ని పౌడర్‌గా మార్చి  'దివ్యనితి ఆగ్రో అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్' పేరుతో సొంత బ్రాండ్‌ను మార్కెట్లోకి తెచ్చారు.  పౌడర్‌ను 100 గ్రాముల ప్యాకెట్లుగా మార్చి రూ. 80కి అమ్మసాగారు. సొంత బ్రాండ్‌పై అమ్మితే కిలోకు రూ.800 వస్తుంది.

Related Articles

Related image1
First Petrol Bunk: మన దేశంలో మొట్టమొదటి పెట్రోల్ బంక్ ఇదే.. అప్పట్లో పెట్రోల్‌ను వాహనాల్లో ఎలా నింపేవారో తెలుసా?
Related image2
Colour of Gold: బంగారానికి ఆ పసుపు రంగు ఎలా వచ్చింది? దీని వెనుక మిస్టరీ ఇదే
34
తక్కువ పెట్టుబడితో
Image Credit : Gemini AI

తక్కువ పెట్టుబడితో

మునగ సాగులో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్.. దీనికి ఎక్కువ నీరు, నిర్వహణ అవసరం లేదు. మొదట్లో ఆకులను నీడలో ఆరబెట్టేందుకు షెడ్, పౌడర్ చేసే 'పల్వరైజర్' (Pulveriser) యంత్రం కోసం సుమారు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత, రసాయన ఎరువులకు బదులు, ఆవు పేడ, వర్మీకంపోస్ట్, స్థానికంగా తయారుచేసే 'తక్ అండి సంజీవక్' (Tak Andi Sanjeevak) అనే సహజ పోషక ద్రావణాన్ని మాత్రమే వాడుతున్నారు. ఏడాదికి 3 నుంచి 4 సార్లు సులభంగా ఆకు కోతకు వస్తుంది. వీరికి నష్టమే లేకుండా సొంత బిజినెస్ చక్కగా నడుస్తోంది.

44
ఎక్కడ అమ్మాలి?
Image Credit : Gemini AI

ఎక్కడ అమ్మాలి?

మీ ఆహార ఉత్పత్తి ఏదైనా అమ్మేందుకు FSSAI లైసెన్స్ తీసుకోవాలి. 100 గ్రా, 250 గ్రా ప్యాకెట్లలో ఆకర్షణీయంగా ప్యాక్ చేసి ఆన్‌లైన్‌లో (Amazon, Flipkart), స్థానిక ఆర్గానిక్ స్టోర్లలో అమ్మడం మొదలుపెట్టాలి. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను వీడి, పండించిన పంటను మనమే వాల్యూ యాడ్ చేసి, బ్రాండింగ్ చేసి అమ్మితే.. వ్యవసాయంలో కూడా ఐటీ ఉద్యోగాల కన్నా ఎక్కువ సంపాదించవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షార్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Recommended image2
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image3
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Related Stories
Recommended image1
First Petrol Bunk: మన దేశంలో మొట్టమొదటి పెట్రోల్ బంక్ ఇదే.. అప్పట్లో పెట్రోల్‌ను వాహనాల్లో ఎలా నింపేవారో తెలుసా?
Recommended image2
Colour of Gold: బంగారానికి ఆ పసుపు రంగు ఎలా వచ్చింది? దీని వెనుక మిస్టరీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved