- Home
- Business
- Business Ideas: మహిళలు నెలకు రూ. 1.20 లక్షలు సంపాదించే బిజినెస్ ఇదే, ప్రధాని ముద్ర లోన్‌తో స్టార్ట్ చేయండి
Business Ideas: మహిళలు నెలకు రూ. 1.20 లక్షలు సంపాదించే బిజినెస్ ఇదే, ప్రధాని ముద్ర లోన్‌తో స్టార్ట్ చేయండి
బిజినెస్ ఐడియా: మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారం కోసం అనేక రుణాలను అందిస్తున్నాయి. కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా చక్కటి ఆదాయం సంపాదించుకోవచ్చు. అలాంటి పరిశ్రమ గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం ఇళ్లల్లో ప్రతీ ఆదివారం నాన్ వెజ్ వంటలను వండుకోవడం చూస్తున్నాం. నాన్ వెజ్ వంటలకు ప్రధానమైన ముడిసరుకు, రుచి తెచ్చేది గరం మసాలా, అయతే ఈ గరం మసాలాకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. నిజానికి బ్రాండెడ్ మసాలా కన్నా కూడా కుటీర పరిశ్రమలు తయారు చేసే మసాలా విషయంలో మంచి డిమాండ్ ఉంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
గరం మసాలా తయారీకి ముఖ్యమైనవి సుగంధ ద్రవ్యాలు, ఇందులో ధనియాలు, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి, మిరియాలు మొదలైనవి. అయితే మీ ప్రాంతంలో లభించే ఇతర సుగంధ ద్రవ్యాలను కూడా కలిపి ఈ మసాలాను తయారు చేసుకోవచ్చు.
ఇక గరం మసాలా కోసం కావాల్సిన దినుసుల కోసం కేరళ వెళితే లాభం ఉంటుంది. అక్కడ నుంచి మీకు కావాల్సిన సుగంధ ద్రవ్యాలను సగం రేటుకే తెచ్చుకోవచ్చు. వీలైతే రైల్వే పార్సెల్ సర్వీసును కూడా వాడుకోవచ్చు. తద్వారా మీకు ముడిసరుకు తక్కువ ధరకు లభిస్తుంది. కేరళలో సెకండ్ స్టాండర్డ్, ఎక్స్ పోర్ట్ రిజెక్ట్ అయిన సరుకు తక్కువ ధరకు లభిస్తుంది.
సరుకును కేరళలోని స్పైస్ బోర్డ్ ధరలకు అనుగుణంగా బేరమాడి క్వాలిటీ పరంగా చెల్లించి తెచ్చుకోవచ్చు. ఇక ధనియాలు స్థానిక మార్కెట్లో కూడా లభిస్తాయి. మీరు పరిశ్రమ స్థాపించడానికి ప్యాకింగ్ మెషీన్ కూడా కొనుగోలు చేసుకుంటే మంచిది. రెండు మూడు రూపాయలకు చిన్న సాచెట్ల కోసం ఓ యంత్రం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పెద్ద ప్యాకెట్లు 50 నుంచి 100 గ్రాముల కోసం మరో యంత్రం తయారు చేసుకోవాలి.
తయారీ యూనిట్ కోసం 200 గజాల్లో షెడ్ ఏర్పాటు చేసుకోవచ్చు. సరుకు దాచుకోవడానికి గదులు ఏర్పాటు చేసుకోవాలి. ఇక గరం మసాలా తయారీ కుటీర పరిశ్రమలకు కావాల్సింది. మీకు ఒక కమర్షియల్ ఆటా చక్కీ మెషీన్, దీని ధర రూ. 10 వేల నుంచి రూ.50 వేల వరకూ ఉంటుంది. మీ బిజినెస్ ను బట్టి మెషీన్ కొనుగోలు చేయండి. ఇక పరిశ్రమ ఏర్పాటుకు Semi-Automatic Chilli Powder Packing Machine, Packaging Type: Pouch మెషీన్ కొనుగోలు చేసుకోవాలి. దీని ధర రూ. 1.35 లక్షల వరకూ ఉంటుంది.
ఇక పర్మిషన్ల కోసం FSSAI రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ ఆతర్వాత స్థానిక పరిశ్రమల నుంచి కూడా పర్మిషన్ పొందాల్సి ఉంటుంది. ఇక డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ కోసం సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. ఇక హోల్ సేల్ మార్కెటింగ్ స్టోర్లతో పాటు, నేరుగా కిరాణా దుకాణాలకు విక్రయించవచ్చు. ఇక అమెజాన్, బిగ్ బాస్కెట్, జియో స్టోర్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్లతో సైతం విక్రయించవచ్చు. ఇక చికెన్ షాపుల్లో సైతం ఈ మసాలా ప్యాకెట్లను అమ్మేలా ప్లాన్ చేసుకోవచ్చు.
మసాలా వ్యాపారంలో లాభాల మార్జిన్ 40%-50% వరకూ ఉంటుంది. అంటే 40% లాభ మార్జిన్‌తో మీరు రోజుకు 100 కిలోల అమ్మకాలు జరిపితే ఎంత లాభం వస్తుందో తెలుసుకుందాం. ఉదాహరణకు ముడి సరుకులు, రవాణా, ఇతర ఖర్చలు పోను ఒక కిలో మసాలా ధర రూ.100/కిలో అని అనుకుందాం. అంటే 100 కిలోలు x రూ. 100 + 40% లాభ మార్జిన్ = రూ. 10,000 + రూ. 4,000 ( రోజుకు లాభం). లాభం మార్జిన్‌ని జోడించిన తర్వాత విక్రయించిన వస్తువుల ధర రూ.140/కిలో ఉంటుంది. దీని ప్రకారం, మీ నెలవారీ మసాలా వ్యాపార లాభం రూ. 4000 x 30 రూ. = రూ. 1,20,000.