- Home
- Business
- Business Ideas: మహిళలు ఇల్లు కదలకుండా..నెలకు రూ. 50 వేల వరకూ సంపాదించాలని ఉందా..ఈ బిజినెస్ మీ కోసం..
Business Ideas: మహిళలు ఇల్లు కదలకుండా..నెలకు రూ. 50 వేల వరకూ సంపాదించాలని ఉందా..ఈ బిజినెస్ మీ కోసం..
మహిళలు మీరు ఇంటి వద్ద ఉండి మంచి వ్యాపారం చేయాలని భావిస్తున్నారా. అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు ఒక చిన్న ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగానే ఒక చిన్న వ్యాపార ఆలోచన మీ కుటుంబ ఆదాయాన్ని పెంచుతుంది అలాంటి ఓ బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా మహిళలకు కంచి పట్టుచీరలు అంటే చాలా ఇష్టం. అయితే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పెళ్లిళ్లు శుభకార్యాలకు ధరించే కంచి పట్టు చీరల ధర సుమారు 5000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. ఇక పెళ్లిళ్లలో పెళ్లికూతురు ధరించే పట్టు చీర ధర కనీసం పాతికవేల రూపాయల వరకు ఉంటుంది.
ఈ నేపథ్యంలో సాధారణంగా మధ్యతరగతి ప్రజలు ఇంత పెట్టుబడి పెట్టి చీరలను కొనుగోలు చేయలేరు కావున మీరు నెల వాయిదాల రూపంలో కంచి పట్టుచీరలను విక్రయించినట్లయితే మంచి ఆదాయం పొందే వీలుంది. ముందుగా మీరు తమిళనాడులోని తంజావూరు, కాంచీపురం ప్రాంతాలకు వెళ్లి అక్కడ హోల్ సేల్ మార్కెట్లో తక్కువ ధరకే చీరలను కొనుగోలు చేయవచ్చు. వాటిపై మీరు మార్కెట్ ధరకు నెల వాయిదాల రూపంలో విక్రయించినట్లయితే చక్కటి లాభం పొందే వీలుంది.
ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఇంటి వద్ద ఉండే ఈ వ్యాపారం చేసే అవకాశం లభిస్తుంది. . అయితే నెల వాయిదాలను మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు పెట్టుకుంటే మంచిది. అంతకన్నా ఎక్కువ ఉంటే మీకు గిట్టుబాటు కాకపోవచ్చు. మూడు నెలల వాయిదాలు అయితే మీకు పెద్దగా నష్టం ఉండదు. . అయితే మీ ప్రాంతంలో తెలిసినవారు అదేవిధంగా మీ పరిచయస్తులకు మాత్రమే విక్రయిస్తే మంచిది లేకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది.
ఈ బిజినెస్ ద్వారా మీరు ప్రతి నెల ఆదాయం పొందే అవకాశాలు లభిస్తుంది. అదే విధంగా కంచి పట్టు చీరలను హోల్ సేల్ ధరలకు తీసుకొచ్చి నేరుగా మార్కెట్ ధరలకే షోరూం కన్నా తక్కువ ధరకే విక్రయిస్తే మరింత లాభం పొందే అవకాశం ఉంది. కంచి పట్టుచీరలతోపాటు ఫ్యాన్సీ చీరలు సైతం విక్రయిస్తే మంచి లాభం పొందే వీలుంది. సూరత్ పట్టణంలో అతి తక్కువ ధరకే చీరలు లభ్యమవుతాయి. మీరు నేరుగా సూరత్ వెళ్లి లాట్ పద్ధతిలో చీరలు తెచ్చుకొని విక్రయిస్తే మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది.
కంచి పట్టు చీరలతో పాటు, బెనారస్ ధర్మవరం పోచంపల్లి చీరలను కూడా తెచ్చుకొని విక్రయిస్తే మీకు మరింత లాభం వచ్చే అవకాశం ఉంది అలాగే కస్టమర్లు కూడా రెగ్యులర్ గా వస్తారు. అయితే తక్కువ ధర ఉన్న చీరలను నెల వాయిదాల పద్ధతిలో కాకుండా నేరుగానే విక్రయించండి 15వేల నుంచి ఎక్కువ ఉన్న చీరలు మాత్రమే నెల వాయిదాల రూపంలో విక్రయించండి అప్పుడే మీకు మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది.
నోట్: పైన పేర్కొన్న బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆదాయాలు, వ్యయం కేవలం అంచనా మాత్రమే. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు, ఏషియా నెట్ తెలుగు వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.