- Home
- Business
- Business Ideas: మహిళలూ..ఇల్లు కదలకుండానే నెలకు రూ.1 లక్ష సంపాదించాలని ఉందా..అయితే ఈ బిజినెస్ మీ కోసం..
Business Ideas: మహిళలూ..ఇల్లు కదలకుండానే నెలకు రూ.1 లక్ష సంపాదించాలని ఉందా..అయితే ఈ బిజినెస్ మీ కోసం..
మహిళలు ఇంట్లో ఉంటూనే, మీరు కుటీర పరిశ్రమ స్థాపించి మంచి ఆదాయం పొందాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే చక్కటి ప్లాన్ తో మీ ముందుకు వచ్చేసాం. దీనికి మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి. ఎంత రాబడి ఎంతో తెలుసుకుందాం.

వ్యాపారం చేయడం ద్వారా మంచి ఆదాయం పొందాలని ఎదురు చూస్తున్నారా. అయితే ముఖ్యంగా మహిళలు ఇంట్లో కూర్చొని పెద్ద ఎత్తున డబ్బు సంపాదించే ఓ వ్యాపారం గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మహిళలు ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. అంతే కాదు మహిళలు తమ ఖాళీ సమయాన్ని వృధా చేసుకోకుండా కొద్దిగా కష్టపడితే చాలు ప్రతినెలా ఒక లక్ష వరకు ఆదాయం సంపాదించే ఓ మంచి బిజినెస్ ఐడియాను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
ఫుడ్ బిజినెస్ ద్వారా ప్రతి ఒక్కరు మంచి సక్సెస్ అందుకుంటున్నారు. మీరు కూడా ఫుడ్ బిజినెస్ ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది. అలాంటి ఫుడ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. తెలుగింటి సాంప్రదాయ రుచులను తినేందుకు ప్రస్తుతం చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు దీన్నే మహిళలు ఒక వ్యాపార అవకాశంగా మలుచుకునే వీలుంది. తెలుగింటి రుచులు అంటే ఊరగాయలు, అప్పడాలు, నాన్ వెజ్ వంటకాలు చిరుతిళ్లు అనేకం ఉన్నాయి. వీటిలో మీరు ఎందులో పర్ఫెక్ట్ గా చేస్తారో తెలుసుకొని ఆ బిజినెస్ పెడితే సరిపోతుంది.
ఉదాహరణకు ఊరగాయల బిజినెస్ పెట్టుకోవడం ద్వారా మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఎందుకంటే ఊరగాయలు సంవత్సరం పొడుగుతున్న నిలువగా ఉంటాయి ఒక్కసారిగా పాడవ్వవు. సంవత్సరం పొడుగుతా వీటిని స్టోర్ చేసుకొని విక్రయించుకుంటే మంచి లాభం పొందవచ్చు. ఊరగాయల్లో నాన్ వెజ్ ఊరగాయాలను తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా చికెన్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్స్ పికిల్, క్రాబ్స్ పికిల్ వంటివి తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. నాన్ వెజ్ పచ్చళ్లను విదేశాలకు సైతం తీసుకువెళ్లేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు.
మహిళలు మీరు ఇంట్లో ఉండి ఈ నాన్ వెజ్ పచ్చళ్ల బిజినెస్ సులభంగా ప్రారంభించవచ్చు. ఇందుకోసం మీ ఇంట్లోనే ఒక గదిని వంటగదిగా మార్చుకోండి. తాజా చికెన్ మటన్ అలాగే చేపలు రొయ్యలు సప్లై చేసే వారితో ఒప్పందం కుదురుచుకోండి. ఆన్లైన్ ద్వారా ఆర్డర్లను పొంది మీరు ఈ బిజినెస్ను స్టార్ట్ చేయవచ్చు ఇంకా ప్యాకేజింగ్ కోసం ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేయండి ఎందుకంటే విదేశాలకు పచ్చళ్లను తీసుకెళ్లాలంటే ప్యాకింగ్ చాలా ముఖ్యం. లేకపోతే పచ్చళ్ళు పాడయ్యే ప్రమాదం ఉంది.
ఇక పచ్చళ్ళు బిజినెస్ లో సక్సెస్ సాధించాలంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మంచి ప్రచారం చేస్తే మాత్రం మీరు కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. మంచి నాణ్యమైన వస్తువులను వాడినట్లయితే రుచి కూడా అమోఘంగా ఉండే అవకాశం ఉంది. నాణ్యతను నిర్ధారించేందుకు ఫుడ్ క్వాలిటీ స్టాండర్డ్స్ వారి దగ్గర నుంచి సర్టిఫికెట్ పొందితే సరిపోతుంది.