- Home
- Business
- Business Ideas: మహిళలు కేవలం రూ.30వేల పెట్టుబడితో, నెలకు రూ. 50 వేలు సంపాదించే బిజినెస్ ఐడియా ఇదే...
Business Ideas: మహిళలు కేవలం రూ.30వేల పెట్టుబడితో, నెలకు రూ. 50 వేలు సంపాదించే బిజినెస్ ఐడియా ఇదే...
మహిళలు ఇంటి వద్దే ఉండి బిజినెస్ చేయడం ద్వారా మీ ఇంటి ఖర్చులను తగ్గించాలని అనుకుంటున్నారా, అయితే అందుకు ఓ చక్కటి ఉపాయం ఉంది. మీరు కొంచం ఓపిక, పెట్టుబడి ఉంటే చాలు చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు.ప్రస్తుతం అలాంటి వ్యాపారం గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం రెడీ టు ఈట్ ఫుడ్స్ ట్రెండ్ నడుస్తోంది. అయితే ఇంట్లో చేసుకునే ఫుడ్ కే జనం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కానీ టైం ఉండకపోవడం వల్ల వారు ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. అలాంటి అవసరాన్నే మనం వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో దోశ, ఇడ్లీ పిండి విడిగా అమ్మడం చూస్తున్నాం. అది ఒక చక్కటి వ్యాపార అవకాశం మీరు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అంతేకాదు ప్రతిరోజు డిమాండ్ ఉంటుంది.
ప్రస్తుతం పట్టణాల్లో బ్రేక్ ఫాస్ట్ చేయడం ప్రజలు అలవాటు చేసుకున్నారు. అందుకోసం, దోశ, ఇడ్లీనే ఎక్కువగా మార్గం చేసుకున్నారు. ఇందుకోసం వారు పిండిని తయారుచేసుకోవడానికి సమయం కేటాయించాలి. అయితే ఉద్యోగాలు, ఇతర వ్యాపారాలు చేసుకునే వారికి కష్ట అవుతుంది.
అలాంటి వారి కోసం మీరు ఇడ్లీ, దోశ పిండిని విక్రయించడం ద్వారా మీరు చక్కటి వ్యాపార అవకాశంగా మలుచుకోవచ్చు. ఇందుకోసం మీరు ఇంట్లోనే ఒక గదిని ఏర్పాటు చేసుకొని ఈ వ్యాపారం ప్రారంబించవచ్చు. ఇందుకోసం ఒక వెట్ గ్రైౌండర్ కొనుగోలు చేసుకోవాలి. Commercial Wet Grinder ధర సుమారు రూ. 10 వేల నుంచి ప్రారంభం అవుతుంది. మీరు గిరాకీని బట్టి వెట్ గ్రైండర్ కొనుగోలు చేసుకోవచ్చు.
అలాగే ప్యాకింగ్ కోసం కవర్లు, అలాగే లామినేషన్ మిషిన్ పెట్టుకోవాలి. ఇక ఇడ్లీ పిండి పులియబెట్టడం కోసం కొన్ని పెద్ద పాత్రలు కూడా సిద్దం చేసుకోవాలి. ఇక ప్యాకింగ్ చేసిన తర్వాత పిండిని స్టోర్ చేసుకునేందుకు ఒక ఫ్రిజ్ కొనుగోలు చేసుకుంటే మంచిది. అప్పుడు పిండిని పాడవుకుండా స్టోర్ చేసుకోవచ్చు.
ఇక మీరు పిండిని కేజీల లెక్కన విక్రయించుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో మీరు ఒక కేజీ, దోశ, ఇడ్లీ పిండిని రూ. 50 లకు విక్రయిస్తే మంచి లాభం వస్తుంది. అయితే మీరు వీటిని సమీపంలోని పాల డిపో, లేదా కిరాణా షాపులకు అందుబాటులో ఉంచవచ్చు. వారికి ఒక్కో ప్యాకెట్ పై కమీషన్ ఇవ్వడం వల్ల మీకు సేల్స్ చేసే బాధ్యత తగ్గుతుంది.
మీరు కమర్షియల్ స్థాయిలో పెద్ద ఎత్తున పెట్టాలి అనుకుంటే మాత్రం, fssai నుంచి పర్మిషన్ పొందాలి, అలాగే మీరు లోగో రిజిష్ట్రేషన్, చేయించుకోవాలి. అలాగే కుటీర పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని పర్మిషన్లు తీసుకోవాలి. అలాగే ప్యాకింగ్ మెషీన్ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి పెట్టుబడి ఎక్కువ అవుతుంది. సుమారు రూ. 5 లక్షల వరకూ ఖర్చు అవుతుంది.అదే ఇంటివద్దే కుటీర పరిశ్రమగా పెట్టుకుంటే కేవలం రూ. 30 వేల పెట్టుబడితో ఈ వ్యాపారం స్టార్ట్ చేసి నెలకు రూ. 50 వేల వరకూ సంపాదించుకోవచ్చు.