- Home
- Business
- Business Ideas: మహిళలూ నెలకు రూ. 1 లక్ష సంపాదించడమే మీ లక్ష్యమా, అయితే ఈ కోర్సు చేస్తే చాలు, నెలకు లక్షలే..
Business Ideas: మహిళలూ నెలకు రూ. 1 లక్ష సంపాదించడమే మీ లక్ష్యమా, అయితే ఈ కోర్సు చేస్తే చాలు, నెలకు లక్షలే..
మహిళలు ఇంట్లో ఉండే డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా, ఓ చక్కటి బిజినెస్ ఐడియా ద్వారా మీరు ఇంట్లో ఉండే లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం. ఉంది ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ డిజైనింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.

చాలామంది యువతీ యువకులు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో చక్కటి ఆదాయం సంపాదిస్తున్నారు. అంతేకాదు అంతర్జాతీయ ఖ్యాతి పొందుతున్నారు మీరు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
Image Credit: Getty Images
ప్రస్తుత కాలంలో ప్రతి సందర్భానికి డిజైనింగ్ దుస్తులు ధరించేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ గ్రామంలో చక్కగా సంపాదించే అవకాశం ఉంది. సినిమా రంగంలోనూ ఫ్యాషన్ డిజైనర్లకు మంచి అవకాశం ఉంది. అలాగే పలు వస్త్ర దుకాణాలు సైతం ఫ్యాషన్ డిజైనర్ లను పెట్టుకుంటున్నాయి తద్వారా కొత్త కొత్త డిజైన్లు మార్కెట్లోకి తెచ్చేందుకు వారికి వీలుగా ఉంటుంది. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ లో కొంతమంది ప్రతి నెల లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. అలాగే సొంతంగా బోటింగ్ తెరవడం ద్వారా కూడా మీరు చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి మహిళలు ప్రవేశించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. తద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి వయస్సుతో సంబంధం లేదు. . ఏ వయసు వారైనా ఈ రంగంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా యువతీ యువకులు అందరూ ఈ రంగంలో చక్కగా రాణించే అవకాశం ఉంది. అయితే మహిళలకు ఎక్కువగా ఇందులో రాణించే అవకాశం ఉంటుంది.
మీరు ఫ్యాషన్ డిజైనింగ్ రంగాన్ని ఎంచుకున్నట్లయితే అతి తక్కువ ధరకే కోర్సులో చేరే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన సెట్విన్ సంస్థ అతి తక్కువ ధరకే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో అనేక కోర్సులను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను సెటిల్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు తద్వారా మీరు అతి తక్కువ ధరకే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను నేర్చుకోవచ్చు. ఫ్యాషన్ డిజైనర్లకు అటు ఉద్యోగాలతో పాటు, అనేక వ్యాపార అవకాశాలు కూడా సిద్ధంగా ఉంటాయి తద్వారా వారు మంచి కెరీర్ బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఫ్యాషన్ డిజైనర్లకు అంతర్జాతీయంగా కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లు ప్యారిస్, లండన్, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో కూడా చక్కటి అవకాశాలను పొందుతున్నారు. అలాగే మీ ప్రాంతంలో ఓ బొటిక్ తెరవడం ద్వారా కూడా చక్కటి ఆదాయం పొందే వీలుంది.
ఈ మధ్య కాలంలో చాలా మంది తమ ప్రత్యేక సందర్భాలలో ఫ్యాషన్ డిజైనర్లతో డ్రెస్ డిజైన్ చేయించుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లిసందర్భాల్లో ఫ్యాషన్ డిజైనర్లతో డ్రెస్ డిజైన్ చేయించుకోవడం ఆనవాయితీగా మారింది. డిజైనర్ వేర్ దుస్తులను కొనుగోలు చేసేందుకు సైతం యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాషన్ డిజైనర్లకు వస్త్ర ప్రపంచం లో కూడా చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి.