- Home
- Business
- Business Ideas: ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా, మహిళలు ఇంటివద్దే రూ. 1 లక్ష వరకూ సంపాదించే బిజినెస్ ఇదే..
Business Ideas: ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా, మహిళలు ఇంటివద్దే రూ. 1 లక్ష వరకూ సంపాదించే బిజినెస్ ఇదే..
బిజినెస్ చేయడమే లక్ష్యమా అయితే మహిళలు సైతం ఇంటివద్ద ఉంటూనే చేయగలిగే ఓ బిజినెస్ గురించి ప్రస్తుతం తెలుసుకుందాం ఈ బిజినెస్ ద్వారా ప్రతినెల చక్కటి ఆదాయం పొందే వీలుంది తద్వారా మీరు పెరుగుతున్న ఖర్చుల మీ ఆదాయంతో కళ్లెం వేయవచ్చు ఇప్పుడు ఇంటి వద్ద నుండి చేయగలిగే ఓ బిజినెస్ గురించి తెలుసుకుందాం.

ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ ద్వారా అనేక బిజినెస్ లను చేసే అవకాశం దక్కుతోంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ అవగాహన ఉన్నవారికి ఇంటి వద్ద కూర్చుని ఆన్లైన్ ద్వారా అనేక ఫ్రీలాన్స్ జాబ్స్ చేయవచ్చు. ముఖ్యంగా కోడింగ్ అలాగే ఆటో క్యాడ్ సహా పలు సాఫ్ట్ వేర్ కోర్సులు నేర్చుకున్నవారికి, రెగ్యులర్ జాబ్ కన్నా ఫ్రీ లాన్స్ జాబ్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం పొందే వీలుంది.
ఫ్రీలాన్సర్ లకు అనేక కంపెనీలు తమ ప్రాజెక్టు లో భాగస్వామ్యం చేసుకొని మంచి ఆదాయం చెల్లిస్తున్నాయి ఒకవేళ మీకు సాఫ్ట్వేర్ పట్ల అవగాహన ఉన్నట్లయితే ఇంటి వద్ద చేయగలిగే జాబ్స్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఫ్రీలాన్సర్స్ ద్వారా తమ ప్రాజెక్టులను పూర్తి చేయించుకుంటున్నారు. అయితే ఈ ఫ్రీలాన్సర్ జాబులను వెతికి పట్టుకోవడం చాలా కష్టం.
ఫ్రీలాన్సర్ జాబ్స్ కోసం అనేక వెబ్ సైట్స్ సిద్ధంగా ఉన్నాయి. Fiverr, Upwork, Freelancer లాంటి వెబ్ సైట్స్ ద్వారా మీరు ఫ్రీలాన్సర్ జాబ్స్ పొందే వీలుంది. తద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే వీలుంది.
ఫ్రీలాన్సర్ జాబ్స్ కోసం మీరు అప్డేట్ చేసిన రెజ్యూమ్ ను ఈ ఫ్రీలాన్సర్ వెబ్సైట్లలో నమోదు చేసుకోవాలి. అలాగే ఆఫర్లను స్పందించి ఈమెయిల్స్ పెట్టాలి. తద్వారా మీరు ఫ్రీలాన్స్ జాబ్స్ పొందవచ్చు. అయితే నిబంధనలను పూర్తిగా చదవాలి. జాబ్ రివ్యూలను కూడా చూసుకోవాలి. లేకపోతే మోసం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఫ్రీలాన్సర్ జాబ్స్ ఎక్కువగా స్టార్టప్ కంపెనీలు ఆఫర్ చేస్తుంటాయి. రెగ్యులర్ ఎంప్లాయిస్ కన్నా కూడా తక్కువ పెట్టుబడి తో, ఫ్రీలాన్సర్ లను రిక్రూట్ చేసుకుని ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటారు. ఫ్రీలాన్సర్ గా మీరు జాబ్ చేసే ముందు కంపెనీ ప్రొఫైల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఒక్కోసారి కొన్ని ఫేక్ కంపెనీలు మీతో ప్రాజెక్టు చేయించుకొని, డబ్బులు ఎగ్గొట్టే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.
అలాగే ఫ్రీలాన్స్ జాబ్స్ చేసేందుకు మీరు సరైన సమయాన్ని కూడా ఎంచుకోవాలి. మీ టైమింగ్స్ ఎడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మీరు సక్సెస్ ఫుల్ గా కెరీర్ రన్ చేసుకోగలుగుతారు.