- Home
- Business
- Business Ideas: ఉన్న ఊరిలోనే కాలు కదపకుండా నెలకు రూ. 1 లక్ష దాకా సంపాదించే బిజినెస్ ఇదే..
Business Ideas: ఉన్న ఊరిలోనే కాలు కదపకుండా నెలకు రూ. 1 లక్ష దాకా సంపాదించే బిజినెస్ ఇదే..
నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసి సమయాన్ని వృధా చేసుకుంటున్నారా. అయితే ఇకపై ఏమాత్రం సమయాన్ని వృధా చేసుకోకుండా, చక్కటి వ్యాపారం ప్రారంభించి ప్రతినెల మంచి ఆదాయాన్ని పొందండి. అలాంటి ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాము. ఈ బిజినెస్ చేయడం ద్వారా ప్రతినెల చక్కటి ఆదాయం పొందే వీలుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లోనూ ఫిల్టర్ కాఫీ తాగడం అలవాటు చేసుకుంటున్నారు. ఫిల్టర్ కాఫీ రుచి చాలా బాగుంటుంది ఫిల్టర్ కాఫీ తోనే బ్లాక్ కాఫీ కూడా తయారు చేసుకుంటారు. సాధారణంగా పెద్ద పెద్ద సంస్థలు ఫిల్టర్ కాఫీ పొడిని ప్యాక్ చేసి విక్రయిస్తూ ఉంటాయి. అయితే ఈ ప్యాక్ చేసినటువంటి కాపీ పొడిలో సరైన అరోమా అంటే సువాసన ఉండదు. అప్పటికప్పుడు కాఫీ గింజలను పొడి చేయడం ద్వారా చక్కటి సువాసన పొందవచ్చు. ఇలా అప్పటికప్పుడు కాఫీ గింజలను మర పట్టి చేసే పొడిని కొనేందుకే జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంది. మీరు కూడా కాఫీ తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందే వీరుంది. Regular Coffee Grinding Machine ధర సుమారు పాతిక వేల వరకు ఉంటుంది. ఈ మిషన్ లో మీరు కాఫీ గింజలను పొడి చేయవచ్చు. అయితే కాఫీ పొడిని 100% ప్యూర్ గా ఎవరూ విక్రయించరు. కాఫీలో చికరీ మిశ్రమాన్ని కలపాల్సి ఉంటుంది. ఈ చికరి పొడిని మార్కెట్లో విక్రయిస్తారు. సాధారణంగా 70% కాఫీ పొడి కలిపితే అందులో 30% చికరీ మిశ్రమాన్ని కలపాల్సి ఉంటుంది. ఈ కాఫీ పొడిని చక్కగా ప్యాక్ చేసి విక్రయించవచ్చు.
కాఫీ గింజలను మీరు హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ కాఫీ గింజలు మార్కెట్లో రోస్టెడ్ ట్రాఫిక్ గింజలుగా విక్రయిస్తుంటారు. వీటి ధర ఒక కేజీ రూ.300 వరకు ఉంటుంది. దీన్ని మీరు పొడి చేసి, చికరీ కలిపి విక్రయిస్తే దాదాపు 50 శాతం వరకూ లాభం వస్తుంది.
కాఫీ పొడితో పాటు టీ పొడిని కూడా విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. అలాగే ఈ కాఫీ పొడి షాప్ తో పాటు తయారుచేసిన కాఫీని విక్రయించడం ద్వారా కూడా, మీ సేల్స్ పెరిగే అవకాశం ఉంది. మీరు హోల్సేల్ ప్రాతిపదికన కాపీ గింజలను కొనుగోలు చేయాలి అనుకుంటే, ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో కాఫీ గింజలను విక్రయిస్తారు. అలాగే కర్ణాటక నుంచి కూడా కాఫీ గింజలను కొనుగోలు చేసుకోవచ్చు. అప్పుడు మీకు తక్కువ ధరకే కాఫీ గింజలు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.