- Home
- Business
- Business Ideas: మహిళలు ఇంటి వద్ద ఉంటూ చేసుకోగలిగే ఈజీ బిజినెస్ ఇదే, నెలకు రూ. 50 వేలు సంపాదించే చాన్స్..
Business Ideas: మహిళలు ఇంటి వద్ద ఉంటూ చేసుకోగలిగే ఈజీ బిజినెస్ ఇదే, నెలకు రూ. 50 వేలు సంపాదించే చాన్స్..
మహిళలు ఇంటి వద్ద ఉంటూనే అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నారా. అయితే అతి తక్కువ పెట్టుబడి తో నే చేయగలిగే వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఈ వ్యాపారం ద్వారా మీరు పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంది, అది ఏంటో చూద్దాం.

egg curry
మహిళలు ఇంటి వద్దే ఉండి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే అతి తక్కువ పెట్టుబడి తో నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించే వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఇక పెట్టుబడి కోసం ఎలా అని ఎదురుచూస్తున్నారా. ఏ మాత్రం చింతించకండి ప్రధాని నరేంద్ర మోడీ ముద్ర యోజన ద్వారా ప్రస్తుతం 10వేల నుంచి 10 లక్షల వరకూ రుణాలను అందిస్తారు. వీటిని తీసుకోవడం ద్వారా మీరు మీ వ్యాపారం చేసి నెలకు లక్షల్లో ఆదాయం పొందే వీలుంది.
మహిళలు ఇంటి వద్దే ఉండి చేసుకోగలిగే వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఫుడ్ బిజినెస్ చాలా బాగా వర్కవుట్ అవుతోంది. హోటళ్లు రెస్టారెంట్లు కన్నా హోమ్లీ ఫుడ్ తినేందుకే జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. కర్రీ పాయింట్ కానీ ఎప్పటికీ ఆదాయం తెచ్చి పెట్టె వ్యాపారం ఇది.
విద్యార్థులు, బ్యాచిలర్లు, ఉద్యోగస్తులకు వంట చేసుకునే సమయం ఉండదు. అలాంటి వారు కేవలం అన్నం వండుకొని కర్రీ పాయింట్ నుంచి వండిన కూరలను తెచ్చుకొని భోజనం చేస్తారు. తద్వారా వారికి సమయం మిగులుతుంది. దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. మహిళలు ఇంటి వద్దనే తక్కువ పెట్టుబడి తో కర్రీ పాయింట్ స్థాపించవచ్చు. మీరు ఉదయం పూట మూడు నాలుగు గంటలు కేటాయిస్తే చాలు, మధ్యాహ్నం భోజనం సమయం నాటికి వండిన కూరలు అందుబాటులో ఉంచితే, కస్టమర్లు పెద్దఎత్తున వచ్చే వీలుంది.
కర్రీ తో పాటు, అన్నం కూడా అందుబాటులో ఉంచితే పార్సిల్ తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ కర్రీ పాయింట్ కోసం మీరు ముందుగానే మసాలా దినుసులు, పప్పు, వంట నూనెలు, బియ్యం, హోల్ సేల్ గా కొనుగోలు చేసుకుంటే మంచిది. అలాగే కూరగాయలను తాజాగా మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తే మీకు తక్కువ పడుతుంది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు స్టోర్ చేసుకుంటే మంచిది.
ఇక కూరల విషయానికి వస్తే, వెజ్ నాన్వెజ్ రెండు రకాల కూరగాయలను అందుబాటులో ఉంచితే చాలా బాగా వ్యాపారం నడుస్తుంది. ఆదివారం చికెన్ బిర్యాని అందుబాటులో ఉంచితే సేల్స్ పెరుగుతాయి. ఈ విషయానికి వస్తే డిమాండ్ను బట్టి ఉంటే మంచిది. . ఇక కర్రీ పాయింట్ నడిపేందుకు ఇద్దరు సహాయకులను పెట్టుకుంటే మంచిది. ఒకరిని కూరగాయలు కట్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. మరొకరిని మీ వంటకు సహాయపడేలా ఉంచుకోవాలి. అప్పుడు మీ పని సులువు అవుతుంది.
ఈ వ్యాపారం విజయవంతం అవ్వాలంటే నాణ్యత పైనే ఎక్కువ దృష్టి పెట్టాలి. నాణ్యమైన వాడటం ద్వారా కస్టమర్ మీ వద్దకు పదే పదే వస్తారు. నాణ్యతలో రాజీ పడితే మొదటికే మోసం వస్తుంది. ధర కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీ వ్యాపారం సక్సెస్ అవుతుంది.