- Home
- Business
- Business Ideas: అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే ఈ బిజినెస్ కు తిరుగేలేదు...నెలకు లక్షల్లో ఆదాయం..
Business Ideas: అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే ఈ బిజినెస్ కు తిరుగేలేదు...నెలకు లక్షల్లో ఆదాయం..
సొంత వ్యాపారం చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం పొందాలి అని చాలా మంది అనుకుంటారు. అయితే అందుకు తగిన మార్గం తెలియక చాలామంది ఆగిపోతుంటారు. అయితే మీరు కూడా సొంత వ్యాపారం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆదాయం పొందాలని అనుకుంటున్నారా. అందుకు చాలా మార్గాలు ఉన్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముద్ర రుణాలను అందిస్తోంది బ్యాంకుల వద్ద రుణాలు పొందిన యువతరం, చాలా మంది సొంత కాళ్లపై నిలబడుతున్నారు.

మీరు కూడా సొంత వ్యాపారం చేయాలనుకుంటున్నారా అయితే హౌస్, ఆఫీస్ క్లీనింగ్ సర్వీస్ ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. ప్రస్తుత కాలంలో పట్టణాల్లోనూ నగరాల్లోనూ విల్లాలు, పెద్ద పెద్ద బంగళాలో, ఫామ్ హౌస్ లు పెరిగిపోతున్నారు. అలాగే నగరాల్లో ఆఫీస్ స్పేస్ కూడా రోజురోజుకు పెరుగుతోంది. వీటన్నిటికీ ప్రతిరోజు క్లీనింగ్ చేసేందుకు సిబ్బంది ఉన్నప్పటికీ, డెడికేటెడ్ పూర్తిస్థాయి క్లీనింగ్ చేసేందుకు హౌస్ క్లీనింగ్ సర్వీసు వారిని సంప్రదిస్తుంటారు. ఉదాహరణకు ప్రస్తుతం మార్కెట్లో అర్బన్ క్లాప్ లాంటి సంస్థలు, ఇలాంటి సర్వీసులు అందిస్తున్నాయి.
మీరు కూడా ఇలాంటి సర్వీసులను అందించేందుకు కోసం స్థాపించి వ్యాపారం చేస్తే చక్కటి ఆదాయం పొందే వీలుంది. ఈ రోజుల్లో ఆఫీసులకు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లలో ఈ హౌస్ క్లీనింగ్ సర్వీసులకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ హౌస్ క్లీనింగ్ సర్వీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా కంపెనీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఒక ఆఫీసును గోడౌన్ మెయింటైన్ చేయాలి. క్లీనింగ్ సర్వీస్ కోసం హెల్పర్స్ ను రిక్రూట్ చేసుకోవాలి. హౌస్ క్లీనింగ్ ఎక్కువ మొత్తంలో మెషీన్లను వాడాలి. ఇందుకోసం వాక్యూం క్లీనర్లు, ఇతను ఇండస్ట్రియల్ వ్యాక్యూమ్ క్లీనర్ లను వాడాల్సి ఉంటుంది. అలాగే టైల్స్, ఫ్లోరింగ్ క్లీనింగ్ కోసం వివిధ రసాయనాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
home cleaning
ఇక ఈ హౌస్ క్లీనింగ్ సర్వీస్ బిజినెస్ కోసం సుమారు 5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. జీఎస్టీఐఎన్ నెంబర్ కూడా పొందాల్సి ఉంటుంది. ముఖ్యంగా హాస్పిటల్స్ హోటల్ సన్ కార్పొరేట్ ఆఫీసులకు సర్వీసులు అందించాలంటే తప్పనిసరిగా జిఎస్టి నెంబర్ ఉండాలి. వ్యాపార ప్రకటన కోసం పాంప్లెట్లు, టీవీ యాడ్స్, సోషల్ మీడియాలో ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్లను పొందేందుకు మొబైల్ యాప్, వెబ్సైట్, రూపొందించుకుంటే చాలా మంచిది. అలాగే సిబ్బందికి ముందుగానే శిక్షణ ఇస్తే, ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఈ బిజినెస్ లో చక్కటి ఆదాయం ఉంటుంది. మీ సర్వీస్ బాగుంటే రెగ్యులర్ గా మీకు ఆర్డర్లు వస్తుంటాయి.
ఈ బిజినెస్ ద్వారా మీరు ఆదాయం పొందడమే కాదు నలుగురికి ఉపాధి కూడా కల్పించే అవకాశం ఉంది. అలాగే ఫెస్టివల్స్ సమయంలో చాలామంది ఈ హోమ్ క్లీనింగ్ సర్వీసులను ఆశ్రయిస్తుంటారు. అలాంటివారికి వేరు డిస్కౌంట్ ఇస్తే ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించవచ్చు