- Home
- Business
- Business Ideas: కేవలం ఉదయం ఓ రెండు గంటలు కష్టపడితే చాలు నెలకు రూ. 35 వేలు మీ సొంతం..సూపర్ పార్ట్ టైం బిజినెస్
Business Ideas: కేవలం ఉదయం ఓ రెండు గంటలు కష్టపడితే చాలు నెలకు రూ. 35 వేలు మీ సొంతం..సూపర్ పార్ట్ టైం బిజినెస్
Business Ideas: ఈ కాలంలో ఉద్యోగాలను నమ్ముకుంటే రోజులు గడవడం కష్టంగా మారుతోంది. అందుకే ఉద్యోగంతో పాటు ఏదైనా పార్ట్ టైం వ్యాపారం చేసుకుంటే మంచి ఆదాయం లభిస్తుంది. అందుకోసం రోజుకు రెండు నుంచి మూడుగంటలు కష్టపడితే చాలు, అలాంటి వ్యాపారాల కోసం ఎదురుచూస్తున్నారా, అయితే అలాంటి వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం హోం డెలివరీ అనేది చాలా ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్, ప్రతీ వస్తువును డోర్ డెలివరీ చేయంచుకునేందుకు జనం ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో ప్రతీ ఒక్కరూ ఇంటి దగ్గరే ఉండటం వల్ల ఈ డోర్ డెలివరీలకు అలవాటు పడిపోయారు. అయితే దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. పాల ప్యాకెట్ల డోర్ డెలివరీ ద్వారా మంచి సంపాదన పొందవచ్చు. ప్రతి రోజు రెండు నుంచి మూడు గంటలు కష్టపడితే చాలు. మీరు మంచి ఆదాయం పొందే వీలుంది.
అయితే పాల ప్యాకెట్ బిజినెస్ కొత్తేమీ కాదు కదా. ఇందులో ఆదాయం ఏమిటా అని ఆలోచిస్తున్నారా. అయితే పొరపాటే, ఎందుకంటే మీరు ఇందులో చక్కటి ఆదాయం పొందవచ్చు. మొదట మీరు ఏదైనా ఒక మిల్క్ ఫ్రాంచైజీ నుంచి పాల ప్యాకెట్ల సరఫరా అయ్యేలా ఒప్పందం కుదుర్చుకోవాలి. ఆ తర్వాత మీరు ఎంపిక చేసుకున్న ప్రదేశం కూడా కొత్త కాలనీ లేదా, గేటెడ్ కమ్యూనిటీ, లేదా కొత్తగా అపార్ట్ మెంట్స్ ఎక్కువగా ప్రాంతాన్ని ఎంచుకొని మీరు పాల ప్యాకెట్ల డోర్ డెలివరీ చేస్తామని పాంప్లెట్స్, పోస్టర్స్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి.
ఆ తర్వాత మొదటి వంద మంది కస్టమర్లకు డిస్కౌంట్ ఇస్తే మీకు మొదట కస్టమర్లు వస్తారు. ఆ తర్వాత మీరు వారికి ప్రతి రోజు ఆన్ టైం మిల్క్ సప్లై చేయాల్సి ఉంటుంది. అంతే కాదు మీరు ఇందుకోసం మీరు తెల్లవారుజామున, లేదా అర్థరాత్రే పాల ప్యాకెట్ల కేసులను పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మంత్లీ ఆర్డర్లను బట్టి పాల ప్యాకెట్లను డోర్ డెలివరీ చేసుకుంటే సరిపోతుంది. మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పాల ప్యాకెట్ల సరఫరాకు ముందుగానే చెల్లిస్తే వారికి క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఇస్తే మరింత మంది వస్తారు.
ఒక్కో ప్యాకెట్ పై మీరు MRPకి విక్రయించినా 2.50 శాతం కమీషన్ లభిస్తుంది. అంటే ఉదాహరణకు ఒక లీటరు పాల ధర రూ.50 అనుకుంటే మీరు పొందే కమీషన్, రూ.1.25 పైసల కమీషన్ దక్కుతుంది. ఈ కమిషన్ మిల్క్ బ్రాండును బట్టి మారుతుంది. అయితే నాణ్యమైన బ్రాండు పాలనే విక్రయించండి. కమీషన్ కు కక్కూర్తి పడితే మొదటికే మోసం అవుతుంది. పాల ప్యాకెట్లను స్టోర్ చేసుకునేందుకు కంటెయినర్ ఫ్రిజ్ ఏర్పాటు చేసుకోండి. డోర్ డెలివరీ తెల్లవారు జామున 5 గంటలకే డోర్ డెలివరీ స్టార్ట్ చేయాలి. ఉదయం 7 గంటల లోగా డిస్ట్రిబ్యూషసన్ పూర్తి అయ్యేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది టీ, కాఫీలు ఆ సమయంలోనే ఇళ్లల్లో చేసుకుంటారు.
లెక్క కోసం మిల్క్ కార్డులను జారీ చేస్తే మేలు. ఇక డెలివరీ కోసం ఎలక్ట్రిక్ బైక్, లేదా ఎలక్ట్రిక్ వెహికిల్ వాడితే మీకు పెట్రోల్, డీజిల్ చార్జీలు ఉండవు. అలాగే టీ దుకాణాలు, కాఫీ షాపులు, హోటల్స్ కు కూడా మీరు సప్లై చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. మీ ఆదాయాన్ని బట్టి హెల్పర్లను పెట్టుకోవాలి. లేదంటే ఇద్దరు పార్ట్ నర్స్ కలిసి డెలివరీ కం వ్యాపారం చేయడం ద్వారా ఫాస్ట్ డెలివరీ తో పాటు ఎక్కువ ఆర్డర్లను కవర్ చేయొచ్చు. ఉదాహరణకు మీరు రోజుకు 1000 లీటర్ల పాలు డిస్ట్రిబ్యూట్ చేసినా మీకు కమిషన్ కింద 1250 రూపాయలు లభిస్తుంది. ఈ లెక్కన మీరు నెలకు రూ. 35000 పైనే సంపాదించుకోవచ్చు.