- Home
- Business
- Business Ideas: కేరళ వెళ్లి ఒక అరక్వింటాలు బస్తా తెచ్చుకొని మీ ఊరిలో అమ్మితే చాలు..బస్తాపై రూ.60 వేల లాభం..
Business Ideas: కేరళ వెళ్లి ఒక అరక్వింటాలు బస్తా తెచ్చుకొని మీ ఊరిలో అమ్మితే చాలు..బస్తాపై రూ.60 వేల లాభం..
వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా అయితే ఏ మాత్రం ఆలోచించకుండా రంగంలోకి దిగవద్దు. మార్కెట్ ను అర్థం చేసుకొని ప్లానింగ్, పర్ఫెక్షన్ తో రంగంలోకి దిగితే మీకు చక్కటి ఆదాయం సమకూరుతుంది. నిజానికి డిమాండ్ ను గమనించి వ్యాపారం చేసుకుంటే అంతకన్నా విలువైనది మరొకటి ఉండదు. యాలకుల వ్యాపారం గురించి తెలుసుకుందాం.

యాలకులు వ్యాపారం నిజానికి కోట్లలో టర్నోవర్ ఉన్న బిజినెస్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం వాస్తవం. కావాలంటే మీరు తనిఖీ చేసుకోవచ్చు. కేరళ రాష్ట్రంలో ఇడుక్కి జిల్లాలో కుట్టడి అనే ప్రాంతంలో స్పైస్ బోర్డ్ ద్వారా ఈ యాలకులను విక్రయిస్తారు. అక్కడ ఆన్ లైన్ ద్వారా బిడ్డింగ్ పద్ధతుల్లో ఈ యాలకుల లాట్ ను వేలం వేసి వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు.
అయితే ఇక్కడ నేరుగా మనం వ్యాపారం ప్రారంభ దశలోనే బిడ్డింగ్ పద్ధతుల్లో కొనుగోలు చేయలేము. కానీ అక్కడ కొన్ని వందల మంది వ్యాపారులు వస్తారు. వారి నుంచి మనం ఈ యాలకుల బిజినెస్ మర్మాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎక్స్ పోర్ట్ క్వాలిటీ యాలకులు కాకుండ సెకండ్ గ్రేడ్ యాలకులను వారి నుంచి కొనుగోలు చేయవచ్చు. వాటిని మనం ప్యాక్ చేయడం ద్వారా రిటైల్ వ్యాపారులకు సేల్ చేయవచ్చు. తద్వారా చక్కటి లాభం పొందవచ్చు.
ఇక యాలకుల బిజినెస్ లో ముఖ్యంగా కావల్సింది. 5 MM, 6mm. 7mm, 6.5 mm కేటగిరీల్లో యాలకులు ఉంటాయి. కేటగిరీని బట్టి వీటి ధర ఉంటుంది. అయితే ఎక్స్ పోర్ట్ బల్క్ రిజెక్షన్ యాలకులు ఒక ధర పలుకుతుంది. ఎక్స్ పోర్ట్ రిజెక్ట్ అయినంత మాత్రాన అవి క్వాలిటీ లేనివి కాదు. మంచి క్వాలిటీనే ఉంటాయి. దేశీయ మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది.
ఈ బల్క్ రిజెక్షన్ అయినటువంటి యాలకుల కిలో ధర రూ. 800 వరకూ ఉంటుంది. ఇందులో క్వాలిటీని బట్టి మనం రేటు చెల్లించాల్సి ఉంటుంది. అయితే వీటిని బల్క్ గా కొనుగోలు చేసుకొని మనం వ్యాపారం ప్రారంభించవచ్చు. సాధారణంగా కిరాణా షాపుల్లో మనకు లభించేది 5-6 MM యాలకులే లభిస్తాయి. అంతేకాదు బల్క్ రిజెక్షన్ క్వాలిటీ అయితే సరిపోతుంది.
వీటిని మీరు కొనుగోలు చేసి కేరళ నుంచి డైరక్టుగా రైలులోనే తెచ్చుకోవచ్చు. ఎందుకంటే 50 కేజీలు తెచ్చుకున్న మనకు ఖర్చు కేవలం 40 వేలు అవుతుంది. అయితే వీటిని జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయించి తెచ్చుకోవాలి. ఆ తర్వాత మీరు వీటిని ఇంటికి తెచ్చుకొని చిన్న కవర్లలో 10 గ్రాముల నుంచి 50 గ్రాముల ప్యాక్స్ గా తయారు చేసుకొవాలి. 50 గ్రాముల ప్యాకెట్ రిటైల్ మార్కెట్లో రూ. 100 పలుకుతోంది. మీరు ఒక కిలో యాలకులను 50 గ్రాముల చొప్పున 20 ప్యాకెట్లుగా చేసి విక్రయించవచ్చు. అంటే ఒక కిలో ప్యాకెట్లను మీరు రూ. 2000కు విక్రయించవచ్చు. ఈ లెక్కన మీకు ఒక కేజీ యాలకులపై 1200 రూపాయల లాభం పొందవచ్చు. ఈ లెక్కన మీరు రూ.40 వేలకు తెచ్చిన సరుకును రూ. 1 లక్షకు అమ్మవచ్చు. అంటే అరక్వింటా అమ్మితే రూ. 60 వేల వరకూ లాభం మీ సొంతం.