Business Ideas: మహిళలు జస్ట్ 4 గంటలు కష్టపడితే చాలు నెలకు రూ. 1 లక్ష సంపాదించడం ఖాయం...
మహిళలు ఇంట్లో కూర్చొని ఒక లక్ష రూపాయలు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. మీ ఖాళీ సమయాన్ని వినియోగించుకొని మహిళలు ఇంటి వద్ద చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. అటువంటి బిజినెస్ ఐడియా గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఫుడ్ బిజినెస్ కు తిరుగులేదనే చెప్పాలి. ఎందుకంటే ఫుడ్ బిజినెస్ ద్వారా ప్రతి సంవత్సరం చక్కటి ఆదాయ వృద్ధితో సాగుతుంది. ఎల్లప్పటికీ డిమాండ్ ఉన్న బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఫుడ్ బిజినెస్ అనే చెప్పాలి. అందుకే మీరు కూడా ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ఆదాయాన్ని పొందే అవకాశాన్ని వినియోగించుకోండి. తద్వారా మీ ఇంటి ఖర్చులకు చేదోడు వాదోడుగా ఉండే అవకాశం మీకు లభిస్తుంది.
ఇక మీ వ్యాపారానికి కావాల్సింది రుణం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం వ్యాపారం ప్రారంభించేందుకు ముద్రా రుణాలను ఇస్తోంది. ఈ ముద్రా రుణాల్లో దాదాపు 60 శాతం రుణాలు మహిళలు తీసుకున్నట్లు ఇటీవల గణాంకాలు వెలుడుతున్నాయి. 50 వేల రూపాయల నుంచి పది లక్షల వరకు మీరు ముద్రా రుణాల ద్వారా పొందే అవకాశం ఉంది. బయట లభించే ప్రైవేటు రుణాల కన్నా కూడా ముద్రా రుణాలు చాలా తక్కువ వడ్డీ రేట్లకే లభిస్తుంటాయి. నెలసరి వాయిదాలు కూడా సులభంగా చెల్లించుకోవచ్చు వడ్డీతో పాటు అసలు ఉంటుంది.
ఇప్పుడు ఇక మహిళలు ఇంటి వద్ద ఉండే చేయగలిగే ఓ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఉదయం పూట టిఫిన్ చేయడం అనేది ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశం గా మార్చుకునే వీలుంది. ఉదయం మంచి ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ను అందుబాటులో ఉంచడం ద్వారా చక్కటి వ్యాపారం పొందవచ్చు.
ఇందు కోసం మీరు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు కష్టపడితే సరిపోతుంది. చిరుధాన్యాలతో చేసిన బ్రేక్ ఫాస్ట్ ను అందుబాటులో ఉంచడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. చిరుధాన్యాలతో చేసే బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం, ఉప్మా, పొంగలి చేసుకుంటే సరిపోతుంది. ఇక చిరుధాన్యాల్లో మీరు కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటివి వాడుకుంటే సరిపోతుంది.
చిరుధాన్యాల్లో పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కావున షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తీసుకుంటే మంచిది. కావున మీరు మీ బిజినెస్ ను ఏర్పాటు చేసే ముందు మీ ప్రాంతంలో ఓ కరపత్రం వేయించి మీరు చిరుధాన్యాలతో బ్రేక్ ఫాస్ట్ అందిస్తామని ప్రచారం చేయించుకుంటే మంచిది. తద్వారా మీకు మంచి ఆర్డర్లు పొందే అవకాశం ఉంది. వ్యాపారం బాగుంటే మీకు నెలకు ఒక లక్ష రూపాయలు వరకు మిగిలిన అవకాశం ఉంది.