Business Ideas: మహిళలు ఇంటి వద్ద ఉంటూనే రోజుకు 2, 3 గంటలు కష్టపడితే చాలు, నెలకు రూ. 50 వేలు సంపాదించే చాన్స్
మహిళలు డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మీ ఖాళీ సమయాన్ని వినియోగించుకుని కాస్త సమయం కేటాయిస్తే చాలు నెలకు కనీసం 50 వేల వరకు సంపాదించే ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. మహిళలు తమ ఇంటి వద్ద ఉంటూనే, కాస్త సమయాన్ని కేటాయిస్తే చాలు, మీరు మంచి ఆదాయం పొందే వీలుంది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం.
నగరాలు పట్టణాల్లో, బ్యాచిలర్ లు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు వీరికి మధ్యాహ్నం వేళ భోజనం చేయడం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్లు, మెస్సుల్లో భోజనం చేస్తే చాలా ఖర్చు అవుతోంది దీనికి పరిష్కారం, మొబైల్ ఫుడ్ స్టాల్ అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఆఫీసులు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు అధికంగా ఉన్న ప్రదేశాలు ఈ మొబైల్ ఫుడ్ స్టాల్స్ వెలుస్తున్నాయి. వీటిలో మధ్యాహ్న భోజనానికి సరిపడా ఆహారాన్ని వెంట తెచ్చుకుంటారు. తక్కువ ధరకే భోజనం పెడతారు. దీన్నే మీరు కూడా వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు
ఇంటి వద్ద ఉండే మహిళలు ప్రతిరోజు కొద్ది గంటల సమయాన్ని కేటాయించి, కనీసం 20 నుంచి 30 మందికి భోజనం తయారు చేసి, ఈ మొబైల్ ఫుడ్ స్టాల్ ద్వారా ఏర్పాటు చేసినట్లయితే, మీకు చక్కటి ఆదాయం ప్రతిరోజు లభిస్తుంది. ఈ మొబైల్ ఫుడ్ స్టాల్ కోసం, మీరు స్థానికంగా పర్మిషన్ తీసుకుని, స్ట్రీట్ ఫుడ్ ప్రాతిపదికన విక్రయించినట్లయితే, ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంపాదించుకోవచ్చు.
ఈ మొబైల్ ఫుడ్ కోర్ట్ ద్వారా మీరు ప్రతిరోజు ఆదాయం పొందే వీలుంది. ముందుగా మీ డిమాండ్ను బట్టి ఆహారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు మీకు వేస్టేజ్ ఉండదు. లేకపోతే ఆహారం వేస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక ధరలను అందుబాటులో ఉంచాలి. లాభం మార్జిన్ తగ్గించుకుంటే, స్థిరంగా కస్టమర్లు వస్తుంటారు. మధ్యాహ్న భోజనానికి అన్నం, కూర, పప్పు, సాంబారు, పెరుగు లేదా మజ్జిగ, రోటి పచ్చడి అందుబాటులో ఉంచాలి. ఈ బిజినెస్ కోసం అయ్యే పెట్టుబడి కూడా చాలా తక్కువ. కేవలం గిన్నెలు కొనుక్కుంటే సరిపోతుంది.
మెనూ ప్రతి రోజు మారుస్తుండాలి. ఒకవేళ మీరు నాన్వెజ్ కూడా అందుబాటులో ఉంచినట్లు అయితే, మరింత ఎక్కువ లాభం పొందే వీలుంది. చికెన్ బిర్యాని తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే దీన్ని కూడా మీరు డిమాండ్ను బట్టి తయారుచేసుకుని పెట్టుకుంటే మంచిది. ఇక రుచి నాణ్యత విషయంలో లో ఏ మాత్రం రాజీ పడకూడదు. కస్టమర్లు చెప్పిన సలహాలను ఫీడ్ బ్యాక్ ఆధారంగా మీరు వంటలు వండితే మంచిది.
నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, మీ ఖర్చులు, మిగులు రెండూ కూడా చూసుకొని ధర నిర్ణయిస్తే రిస్కు ఉండదు. ఆహారం వేస్ట్ అవ్వకుండా, కాస్త చూసుకొని సర్వ్ చేసుకోవాలి. అప్పుడే నష్టపోకుండా ఉంటారు. అలాగే సరుకులను కూడా హోల్ సేల్ ధరలకే తెచ్చుకోవాలి. కూరగాయలను కూడా రెగ్యులర్గా సప్లై చేసే వారి దగ్గర్నుంచి తీసుకుంటే మంచిది. ఉడికించిన కోడిగుడ్లు, కోడిగుడ్డు ఆమ్లెట్ వేసి అదనంగా ఛార్జ్ చేస్తే, మీకు మరింత లాభం వచ్చే అవకాశం ఉంది. ఈ బిజినెస్ చేస్తున్న వారు కనీసం నెలకు రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకూ సంపాదిస్తున్నారు.