- Home
- Business
- Business Ideas: మోదీ ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల రుణంతో ఈ బిజినెస్ చేస్తే...నెలకు రూ. 2 లక్షలు పక్కా..
Business Ideas: మోదీ ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల రుణంతో ఈ బిజినెస్ చేస్తే...నెలకు రూ. 2 లక్షలు పక్కా..
ఉన్న ఊరిలోనే ఆర్గానిక్ పాల ద్వారా మంచి వ్యాపారం చేసుకొని నెలకు రెండు లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

బిజినెస్ చేయడమే మీ లక్ష్యమా అయితే వెంటనే ఓ మంచి ఐడియా తో వ్యాపారం ప్రారంభించండి. ఉద్యోగం కోసం ఎదురుచూసి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. కానీ పెట్టుబడి కోసం ఆలోచిస్తున్నారా, ఇక పెట్టుబడి కోసం కూడా ఆలోచించకండి. ఎందుకంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకుల ద్వారా ముద్ర రుణాలను అందిస్తోంది. ముద్ర రుణాలను మీరు అతి తక్కువ వడ్డీ రేటుకే తీసుకునే అవకాశం ఉంది. సుమారు 50 వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు ప్రభుత్వ బ్యాంకుల నుంచి మీరు రుణం పొందే అవకాశం ఉంది.
బయట ప్రైవేటు వడ్డీలతో పోల్చినట్లయితే ముద్ర రుణాలు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. మీ వ్యాపారం ప్రారంభించాలన్న లేదా ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్న ఈ ముద్ర రుణాలు చాలా ఉపయోగపడతాయి. కావున ఇక సమయం వృధా చేసుకోకుండా, మీ సమీపంలోని ప్రభుత్వ బ్యాంకు కి వెళ్లి, మీ ప్రాజెక్టు రిపోర్టు అలాగే ఎంత మొత్తం రుణం కావాలో నిర్ణయించుకొని ముద్ర రుణం పొందవచ్చు.
ఇప్పుడు మీ పెట్టుబడితో ఏమీ వ్యాపారం చేయాలో తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఆర్గానిక్ వస్తువులను వాడేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా ఆర్గానిక్ కూరగాయలు ఆర్గానిక్ పాలు ఆర్గానిక్ వంట సరకులు ఇలాంటివి తినేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో మీరు ఆర్గానిక్ పాలను మార్కెటింగ్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఇందుకోసం ఏం చేయాలో మనం ప్రస్తుతం తెలుసుకుందాం.
ఆర్గానిక్ వ్యవసాయం పట్ల ప్రస్తుతం గ్రామాల్లో ప్రతి ఒక్కరిలోను అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో ఆర్గానిక్ పాల ఉత్పత్తి పై రైతులతో మీరు ముందుగా చర్చించండి. సాధారణ పాలకన్నా కూడా ఆర్గానిక్ పాలలో, ప్రోటీన్ విటమిన్ అలాగే వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సాధారణ ప్యాకెట్ పాల కన్నా కూడా ఆర్గానిక్ పాలపై లాభం కూడా ఎక్కువగా లభిస్తుంది.
మీరు వ్యాపారం చేయాలని డిసైడ్ అయ్యాక రైతులతో చర్చించి, వారి నుంచి పాలను సేకరించండి. ఆ తరువాత పాలను స్టోర్ చేసుకోవడానికి ఒక చిల్లింగ్ యూనిట్ ను స్థాపించండి. చిల్లింగ్ యూనిట్ నుంచి నేరుగా పాలను ప్యాకింగ్ చేసి వినియోగదారులను గుర్తించి వారికి డోర్ డెలివరీ చేస్తే సరిపోతుంది. ఈ ఈ వ్యాపారం కోసం మీరు కనీసం ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది మార్కెటింగ్ కోసం అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్డర్లు పొందడానికి ఒక మొబైల్ యాప్ సిద్ధం చేసుకోవాలి. మొబైల్ యాప్ నుంచి ఆర్డర్లను పొంది కస్టమర్లకు డోర్ డెలివరీ చేస్తే సరిపోతుంది.
ఇక రైతులకు వారికి లాభం వచ్చేలా సహకార పద్ధతిలో లాభాలను అందించాల్సి ఉంటుంది. అప్పుడు మీ వ్యాపారం రెండూ లేదా మూడింతలు అవుతుంది. అలాగే ఇతర పట్టణాల్లో సైతం ఫ్రాంచైజీలను స్థాపించడం ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది.