- Home
- Business
- Business Ideas: ఉద్యోగం చేసినా డబ్బులు సరిపోవడం లేదా, అయితే ఈ బిజినెస్ చేస్తే, ప్రతి నెల రూ.50 వేలు పక్కా..
Business Ideas: ఉద్యోగం చేసినా డబ్బులు సరిపోవడం లేదా, అయితే ఈ బిజినెస్ చేస్తే, ప్రతి నెల రూ.50 వేలు పక్కా..
నిరుద్యోగులారా ఉద్యోగం కోసం చూసి చూసి అలసి పోయారా, అయితే ఏ మాత్రం నిరాశపడవద్దు. మీ ప్రతిభకు తగ్గ ఉద్యగం దొరకక పోతే, ఏ మాత్రం ఆలస్యం చేయకండి. ఎన్నో వ్యాపార అవకాశాలు మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకొని జీవితంలో ముందడుగు వేయవచ్చు. అలాంటి వ్యాపార అవకాశాల గురించి తెలుసుకుందాం.

ఫుడ్ బిజినెస్ కు తిరుగు లేదనే చెప్పాలి. ఎందుకంటే పట్టణాలు నగరాల్లో, వేలాది మంది తమ పనుల మీద తిరుగుతూ ఉంటారు. వేళకు సరైన ఆహారం దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారికి స్ట్రీట్ ఫుడ్ దిక్కవుతుంది. మీరు కూడా ఫుడ్ బిజినెస్ లో రాణించాలి అనుకుంటే దీన్నే అవకాశంగా మార్చుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ వ్యాపారం చేయడం ద్వారా, మీరు చక్కటి ఆదాయం సంపాదించే వీలుంది.
తక్కువ పెట్టుబడి తో ఎక్కువ రాబడి పొందాలంటే, బ్రెడ్ ఆమ్లెట్ వ్యాపారం సరైన ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. ఎందుకంటే, సమయానికి మంచి తినాలి అనుకునేవారికి, బ్రెడ్ ఆమ్లెట్ మంచి గా చెప్పవచ్చు.ప్రోటీన్, కార్బోహైడ్రేట్ కలగలిసిన హెల్తీ బ్రేక్ ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అనే చెప్పాలి. దీన్ని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా తినేందుకు జనం ఆసక్తి చూపిస్తారు.
మీరు బ్రెడ్ ఆమ్లెట్ వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే, ముందుగా ఒక మంచి సెంటర్ ను సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కువగా కోచింగ్ సెంటర్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఆఫీసులు, కమర్షియల్ సెంటర్లను ఎంపిక చేసుకోవాలి. స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో మొబైల్ ఆల్ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. స్థానిక మునిసిపాలిటీ వద్ద పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మీరు వీధి విక్రేతగా లైసెన్సు పొందవచ్చు.
ఇక బ్రెడ్ ఆమ్లెట్ కోసం ముందుగా మీరు దాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలి. వీలైతే అనుభవజ్ఞుల వద్ద సలహాలను తీసుకోవాలి. అప్పుడే మీరు వ్యాపారంలో సక్సెస్ అవుతారు. ఇక ధర కూడా మీ ఖర్చులను బేరీజు వేసుకొని, రేటు ఫిక్స్ చేసుకోవాలి. మీ ఖర్చు మీద 50 శాతం లాభం ఉండేలా మార్జిన్ నిర్ణయించుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు.
ఉదయం నుంచి రాత్రి వరకు ఈ బ్రెడ్ ఆమ్లెట్ సెంటర్ నడుపుతుంటే మీకు లాభం ఎక్కువగా వస్తుంది. దీంతో పాటు టీ, కాఫీలను అందుబాటులో ఉంచుకుంటే మంచిది. మొబైల్ డేటా సెంటర్ కోసం మీరు ఒక కమర్షియల్ ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేసుకుంటే మంచిది.సొంత కమర్షియల్ వాహనాన్ని ఫుడ్ ట్రక్ గా మార్చుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ చేసేందుకు. ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ చాలా అవసరం అవుతుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర సుమారు 2000 రూపాయల పైనే ఉంటుంది. కమర్షియల్ స్టౌను ఏర్పాటు చేసుకోవాలి. దీని ధర కూడా సుమారు 2 వేల రూపాయలు ఉంటుంది.
రుచి నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కోడిగుడ్డు బ్రెడ్ ను హోల్ సేల్ ధరకే తీసుకోవాలి. అప్పుడే మీకు సరైన లాభం అందుకోగలరు. బ్రెడ్ ఆమ్లెట్ తోపాటు, శాండ్విచ్, దోశ, కూడా అందుబాటులో ఉంచితే కస్టమర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.