- Home
- Business
- Business Ideas: సిల్లీగా తీసుకోవద్దు.. చికెన్ షాపు పెట్టడం ద్వారా నెలకు ఎంత సంపాదించవచ్చో తెలుసా..?
Business Ideas: సిల్లీగా తీసుకోవద్దు.. చికెన్ షాపు పెట్టడం ద్వారా నెలకు ఎంత సంపాదించవచ్చో తెలుసా..?
Business Ideas: ఉద్యోగం కోసం చూస్తున్నారా..మీరు కోరుకున్న ఉద్యోగం దక్కడం లేదా, అయితే టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఉద్యోగం వేటలో పడి సమయం వృధా చేసుకునే బదులు వ్యాపారం చేసుకుంటే అంతకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు. అలాగే మనపైన ఎవరూ బాసులు ఉండరు. మీ కష్టమే మీకు ఫలితం తెచ్చిపెడుతుంది. అలాంటి వ్యాపారాల గురించి తెలుసుకుందాం.

సండే వచ్చిందంటే చాలు ముక్క దిగందే పొద్దు పోదు అనేది కొత్త సామెత. నిజమే ఇప్పుడు సండే వచ్చిందంటే ప్రతీ ఇంట్లో చికెన్ వినియోగం బాగా పెరిగింది. సండే రోజు చికెన్ వంటకాలు చేసుకోవడం చూస్తున్నాం. అలాగే మార్కెట్లో కూడా ఇతర నాన్ వెజ్ ఐటెంల కన్నా కూడా చికెన్ వినియోగమే ఎక్కువగా ఉంటోంది. అందుకే ఈ అవకాశాన్ని మీరు ఉపాధిగా మార్చుకోవచ్చు. ఎలాగోతెలుసుకుందాం.
చికెన్ షాప్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా చికెన్ షాపులో చికెన్ కొనుగోలు చేసే వారి సంఖ్య దాాదాపు అన్ని సీజన్లలో ఎక్కువగా ఉంటోంది. అందుకే చికెన్ షాపులకు చాలా గిరాకీ ఉంటోంది. ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, కర్రీ పాయింట్స్ ఇలా అన్ని ప్రాంతాల్లో చికెన్ డిమాండ్ విపరీతంగా ఉంటోంది. అందుకే చికెన్ షాపు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
ముందుగా చికెన్ షాపు ఏర్పాటుకు కావాల్సింది చక్కటి డిమాండ్ ఉన్న స్థలం. అప్పుడే మీ చికెన్ షాపు క్లిక్ అవుతుంది. ఇప్పుడు పట్టణాలు మాత్రమే కాదు, పల్లెటూర్లలో నూ, చిన్న పట్టణాల్లోనూ చికెన్ షాపులకు కస్టమర్ల తాకిడి పెరుగుతోంది. అందుకే మీరు కొత్తగా ఏర్పడుతున్న కాలనీల్లో చికెన్ షాపు ఏర్పాటు చేసుకుంటే మేలు. ముఖ్యంగా మీ చికెన్ షాపు ఇళ్లకు దగ్గరగానూ, మెయిన్ రోడ్డుపై ఉంటే లాభం.
ఇక చికెన్ షాపు ఏర్పాటుకు కావాల్సింది ఫ్రాంచైజీ మోడల్ అయితే బాగుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అనేక పౌల్ట్రీ సంస్థలు తమ ఫ్రాంచైజీ మోడల్ ద్వారా చికెన్ షాపు పెట్టుకునేందుకు వీలు కల్పిస్తున్నాయి. ఫ్రాంచైజీ ఏర్పాటుకు నిర్ణీత మొత్తం చెల్లించడం ద్వారా షాపు డిజైన్ , ఇతర వస్తువులను వాళ్లే ఏర్పాటు చేస్తారు. ఇక ప్రతి వారం లైవ్ బర్డ్స్ ను కూడా సరఫరా చేస్తారు.
ఫ్రాంచైజీల విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో సుగుణ చికెన్, వెంకీస్ చికెన్, ఆర్ఆర్ చికెన్ వంటివి అవకాశం కల్పిస్తున్నాయి. మీరు కూడా చికెన్ షాపు ఏర్పాటు చేయాలనుకుంటే వెంటనే ఆయా కంపెనీల నుంచి వివరాలు పొందవచ్చు. ఇక చివరిగా చికెన్ షాపు విషయంలో కావాల్సింది వర్కర్స్, అనుభవం ఉన్న వారిని పెట్టుకుంటే మంచిది. ఇక పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చికెన్ వ్యర్థాలను ఏరోజుకు ఆరోజే పడేయాలి. లేకపోతే దుర్గంధం పెరుగుతుంది.
షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. తద్వారా మీరు నిరంతరం పర్యవేక్షించవచ్చు. అలాగే చికెన్ షాపులో లైవ్ బర్డ్స్ ను స్టోర్ చేసేందుకు జాలీలను ఏర్పాటు చేసుకోవాలి. నాటు కోళ్లను కూడా అందుబాటులో ఉంచితే అదనపు ఆదాయం లభిస్తుంది. చికెన్ తో పాటుగా కోడి గుడ్లను సైతం విక్రయిస్తే మంచి లాభం కలుగుతుంది. ఇక చికెన్ షాపు కు పెట్టుబడి విషయానికి వస్తే మీకు కనీసం రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. షాపు పరిమాణం, వ్యాపారాన్ని బట్టి ఏర్పాటు చేసుకోవాలి. వ్యాపారం బాగా నడిస్తే కనీసం నెలకు రూ. 1 లక్ష రూపాయల వరకూ సంపాదించుకోవచ్చు. షాపు ఏర్పాటు కోసం ముద్ర రుణం కూడా అప్లై చేసుకోవచ్చు.