Business Ideas: ఉద్యోగం దొరకడం లేదని బాధపడవద్దు, కేవలం స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు నెలకు రూ.1 లక్ష ఆదాయం పక్కా..
నిరుద్యోగులు ఉద్యోగం లేదని బాధపడుతున్నారా పెరుగుతున్న నేపథ్యంలో జీవితం ఎలా గడుస్తుంది అని ఆందోళన చెందుతున్నారా. అయితే ఏమాత్రం బాధపడవద్దు. కష్టపడి పని చేస్తే చాలు ప్రతి నెల లక్షల్లో ఆదాయం సంపాదించే వ్యాపారాలు అనేకం ఉన్నాయి. అలాంటి ఓ వ్యాపారం గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఒకప్పుడు నగర ప్రాంతాల్లోనే ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు గ్రామ ప్రాంతాలకు కూడా విస్తరించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాలు ఏర్పాటు అయినప్పటి నుంచి జిల్లా కేంద్రాల్లో రియల్ఎస్టేట్ రంగం బాగా పుంజుకుంది. ఎన్ఆర్ఐలు సైతం రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. మీరు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలని అనుకుంటే, ఏం చేయాలో తెలుసుకుందాం.
రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అని ఆలోచిస్తున్నారా. అయితే ఇది నిజం కాదు. రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైనది. మీరు అమ్మదలుచుకున్న స్థలం లేదా ఇల్లు. ఓపెన్ ప్లాట్, లేదా విల్లా వంటి ఆస్తుల సమాచారం కస్టమర్లకు చేరవేయడం అనేది చాలా ముఖ్యమైన పని.
ప్రస్తుత కాలంలో డిజిటల్ మార్కెటింగ్ అనేది, చాలా విస్తరించింది. ఇందులో మార్కెట్ విస్తృతి ఎక్కువ. అంతేకాదు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కేవలం లోకల్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు మీ ప్రాజెక్టును చేర వేయవచ్చు. తద్వారా మీకు మంచి కస్టమర్లు లభించే అవకాశం ఉంది.రియల్ ఎస్టేట్ బిజినెస్ కు డిజిటల్ మార్కెటింగ్ తోడైతే, మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. అది ఎలాగో తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో ప్రజలు ఎక్కువగా యూట్యూబ్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, లాంటి డిజిటల్ ప్లాట్ ఫాంలకు చూసేందుకు ఎక్కువగా సమయం వెచ్చిస్తున్నారు. దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. యూట్యూబ్ లో మీకు మంచి subscribers ఉన్నట్లయితే, మీరు విక్రయించాలి అనుకుంటున్న, ప్లాటు లేదా ఫ్లాటును మంచి వీడియో తీసి అప్లోడ్ చేయడం ద్వారా కస్టమర్లకు చేరుతుంది. తద్వారా మీకు త్వరగా ప్లాటు అమ్ముడు పోయే అవకాశం ఉంది.
మీరు రియల్ ఎస్టేట్ వెంచర్లు, అపార్ట్ మెంట్లు, విల్లాస్, విక్రయించే వారిని సంప్రదించి, వారితో ఒప్పందం చేసుకొని. వీడియోలు తీసి అప్లోడ్ చేయడం ద్వారా. అటు యూట్యూబ్ ఆదాయంతో పాటు, రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.
డిజిటల్ మార్కెటింగ్ లో యూట్యూబ్ తో పాటు ఫేస్బుక్, ఇన్ స్టాగ్రాం వంటి ప్లాట్ ఫాంల ద్వారా కూడా చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ యాడ్స్ చేయడంలో వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. తద్వారా మీరు కస్టమర్లను ఆకర్షించవచ్చు.
అలాగే డిజిటల్ మార్కెటింగ్ గురించి మరింత విస్తృతంగా తెలుసుకోవాలి అనుకుంటే పలు కోర్సులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. తద్వారా మీరు వెబ్ సైట్ కూడా నిర్మించి డిజిటల్ మార్కెటింగ్ చేయవచ్చు.