- Home
- Business
- Business Ideas: ఒక్క సంవత్సరం ఈ బిజినెస్ చేస్తే చాలు..రూ. 20 లక్షలు మీ సొంతం..అయ్యే అవకాశం..
Business Ideas: ఒక్క సంవత్సరం ఈ బిజినెస్ చేస్తే చాలు..రూ. 20 లక్షలు మీ సొంతం..అయ్యే అవకాశం..
సంవత్సరానికి 365 రోజులు డిమాండ్ ఉన్న ఓ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా సంవత్సరం అంతా మీకు ఆదాయం లభిస్తుంది అంతే కాదు ఎప్పటికీ తిరుగు ఉండదు. అలాంటి ఓ మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మహానగరాలకు నిత్యావసర వస్తువులు అవసరం ఎప్పటికీ ఉంటుంది. ముఖ్యంగా పాలు, కూరగాయలు ఇతర వస్తువుల డిమాండ్ ఏడాది పొడుగునా ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు కూడా ఒక మంచి బిజినెస్ ప్లాన్ చేసుకున్నట్లయితే నెలకు రెండు లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నగరంలో కూరగాయలను కమర్షియల్ ట్రక్ ద్వారా విక్రయిస్తే మంచి ఆదాయం పొందే వీలుంది. ఉదాహరణకు హైదరాబాదు మహానగరానికి 150 కిలోమీటర్ల చుట్టూ ఉన్న పరిధిలోని పలు గ్రామాల్లో కూరగాయలను విరివిగా పండిస్తారు. ఎందుకంటే కూరగాయల డిమాండ్ హైదరాబాదులో చాలా ఉంటుంది. అందుకే రైతులు ఎక్కువగా కూరగాయల సాగు పైన దృష్టి సారిస్తారు. దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంది.
రైతులు కూరగాయలను పండించి వాటిని హైదరాబాదు తీసుకొచ్చి వినియోగదారులకు అమ్మడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని, అదే సమయంలో మీరు నేరుగా రైతుల వద్దకు వెళ్లి కూరగాయలను కొనుగోలు చేసి వాటిని కస్టమర్లకు విక్రయించినట్లయితే మీకు మంచి ఆదాయం లభిస్తుంది.
ముందుగా మీరు నగరానికి సమీపంలో ఉండే రైతులతో ఒప్పందం కుదుర్చుకోండి. ముఖ్యంగా కూరగాయలు పండించే రైతుల వద్ద నుంచి ప్రతి రోజు కూరగాయలు కొనుగోలు చేసేలా ముందుగానే ఆర్డర్ ఇవ్వండి. అనంతరం ఆ కూరగాయలను కమర్షియల్ ట్రక్కుల్లో ఉంచి వాటిని కాలనీను టౌన్షిప్ లో బస్తీలు ఇతర వాణిజ్య సముదాయాలకు నేరుగా విక్రయించవచ్చు తద్వారా మీకు మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది. ఇందుకోసం మీరు ఒక కమర్షియల్ ట్రక్కును కొనుగోలు చేస్తే సరిపోతుంది.
క్యాటరింగ్ సంస్థలు హోటల్లు కర్రీ పాయింట్ హాస్టల్లకు నిత్యం కూరగాయల డిమాండ్ ఉంటుంది వీరికితో కూడా మీరు ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. మార్కెట్ ధర కన్నా కూడా కొద్దిగా తక్కువకి విక్రయిస్తే మీకు గిట్టుబాటు అవుతుంది. అలాగే ఆర్డర్లు కూడా నిరంతరం వస్తాయి. అంతేకాదు కూరగాయలను మీరు ప్యాక్ చేసి విక్రయించడం ద్వారా త్వరగా అమ్ముడు అవుతాయి. కూరగాయలతో పాటు సీజనల్ పండ్లను కూడా అందుబాటులో ఉంచితే మీకు మరింత వ్యాపారం వృద్ధి చేసుకునే అవకాశం లభిస్తుంది.
నోట్: పైన పేర్కొన్న బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆదాయాలు, వ్యయం కేవలం అంచనా మాత్రమే. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు, ఏషియా నెట్ తెలుగు వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.