- Home
- Business
- Business Ideas: మీ ఇంటి వెనుక కాస్త స్థలం ఉందా, అయితే నెలకు రూ.35000 సంపాదించే బిజినెస్ ఇదే..
Business Ideas: మీ ఇంటి వెనుక కాస్త స్థలం ఉందా, అయితే నెలకు రూ.35000 సంపాదించే బిజినెస్ ఇదే..
నిరుద్యోగులారా.. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా, అయితే ఇకపై ఏమాత్రం ఆందోళన చెందవద్దు. మీరు కొద్దిగా కష్టపడితే చాలు వ్యాపార రంగంలో కూడా చక్కగా రాణించవచ్చు. మీరు సంపాదించే జీతం కన్నా, వ్యాపారంలోనే ఎక్కువ సంపాదించుకోవచ్చు. మీరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు అయితే, కొద్ది స్థలం ఉన్నా చాలు, ఈ బిజినెస్ చేయడం ద్వారా నెలకు లక్షల్లో సంపాదించే అవకాశం ఉంది. అది ఏంటో తెలుసుకుందాం.

ప్రస్తుతం మాంసాహారంలో చికెన్ మటన్ ఫిష్ తో పాటు ఇతర వెరైటీలను సైతం తినేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులో ప్రధానంగా కౌజు పిట్ట మాంసం తినేందుకు నగరంలోని చాలా మంది ఇష్టపడుతున్నారు. దీని రుచి చాలా బాగుంటుందని, రెస్టారెంట్లో సైతం తమ మెనూలో కౌజు పిట్ట మాంసంతో చేసిన వంటకాలను చేరుతున్నాయి. తద్వారా మీరు కూడా కౌజు పిట్టల పెంపకం చేపట్టి చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.
కౌజు పిట్ట మాంసం తినేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కౌజు పిట్టల పెంపకానికి కోళ్ల ఫారం లాగా, పెద్ద మొత్తంలో స్థలం అవసరం లేదు. ఇంటి వెనుక కొద్ది స్థలం ఉన్నా చాలు, మీరు పెద్ద మొత్తంలో వీటిని పెంచే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది. కౌజు పిట్టల పెంపకం విషయానికి వస్తే, కేవలం 10 చదరపు అడుగుల స్థలంలో సుమారు 100 పిట్టలను పెంచే వీలుంది. వీటి గుడ్ల కు కూడా చాలా డిమాండ్ ఉంది.
కౌజు పిట్టలు కేవలం నాలుగైదు వారాల్లోనే, దాదాపు 250 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి. ఈ బరువుతోనే వీటిని అమ్మవచ్చు. వీటికి మామూలు కూడా వేయవచ్చు. చిన్న షెడ్డు అందులో కేజ్ నిర్మించుకొని వీటిని చాలా సులభంగా పెంచవచ్చు. వీటి దాణా కింద మామూలు కోళ్లకు పెట్టె దాణానే వేయవచ్చు. కౌజు పిట్టలు సాధారణంగా, కీటకాలు, పురుగులు, ఇతర వ్యర్థాలను తింటాయి. నాటు కోళ్ల తరహాలోనే వీటికి పెద్దగా వ్యాక్సిన్ ల తో పని ఉండదు. వీటిని నాటు పద్ధతిలోనే పెంచాలి.
కౌజు పిట్టలను ప్రతి నెల ఒక బ్యాచ్ తయారు చేసుకోవచ్చు. కౌజు పిట్టల దాణాకు పెద్దగా ఖర్చు ఉండదు. ఒక్కో పిట్ట దాణాకు సుమారు రూ. 15 ఖర్చు అవుతుంది. ఒక పిట్ట సుమారుగా, 500 గ్రాముల దాణాను నాలుగు వారాల్లో తింటుంది. ఒక పిట్టను హోల్సేల్ గా రూ. 50 వరకు విక్రయించవచ్చు. అంటే మీకు ఒక పిట్టపై కనీసం 35 రూపాయల వరకు లాభం వస్తుంది. ఈ లెక్కన మీరు ఒక బ్యాచులో 100 పిట్టలను అమ్మితే దాదాపు 3500 వరకూ లాభం వస్తుంది.
అయితే మార్కెట్ పట్ల అవగాహన పెరిగిన తర్వాత, డిమాండ్ బట్టి కౌజు పిట్టల పెంపకం స్థాయిని పెంచవచ్చు. వీటి పెద్దఎత్తున ప్రారంభించవచ్చు. ఉదాహరణకు 100 పిట్టల బదులుగా బ్యాచుకుకు 1000 పిట్టలను పెంచినట్లయితే రూ. 35000 వరకూ మీకు లాభం లభించే అవకాశం ఉంది. అయితే మీరు జాగ్రత్తగా వీటి మార్కెట్, డిమాండ్ ను బట్టి బ్యాచులో పిట్టల సంఖ్యను పెంచుకోవాలి. డిమాండ్ లేకుండా పెంచితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.