- Home
- Business
- Business Ideas: మీ ఇంటి వెనుక స్థలం ఖాళీగా ఉందా, ఈ పని చేస్తే చాలు నెలకు లక్షల్లో ఆదాయం..
Business Ideas: మీ ఇంటి వెనుక స్థలం ఖాళీగా ఉందా, ఈ పని చేస్తే చాలు నెలకు లక్షల్లో ఆదాయం..
ఉన్న ఊరిలోనే లాభసాటి వ్యాపారం తో చక్కటి ఆదాయం సంపాదించాలని కోరుకుంటున్నారా అయితే నాటు కోడి గుడ్ల వ్యాపారం చక్కటి అవకాశం. ప్రస్తుతం మార్కెట్లో ఆర్గానిక్ కోడిగుడ్లకు మంచి డిమాండ్ ఉంది. దీన్నే వ్యాపారం గా మార్చుకోండి.

వ్యాపారం చేయడమే లక్ష్యమా అయితే అతి తక్కువ పెట్టుబడి తో వ్యాపారం చేయడం ద్వారా ప్రతి నెలా ఆదాయం పొందే వీలుంది. అలాంటి వ్యాపారం గురించి తెలుసుకుందాం. మీరు ప్రతి నెల సంపాదన సరిపోవటం లేదా అయితే మీ పెరట్లో కాస్త స్థలం ఉంటే చాలు చక్కటి ఆదాయం సొంతం చేసుకోవచ్చు అలాంటి వ్యాపారం గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం ఆర్గానిక్ ఉత్పత్తుల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. ఆర్గానిక్ కూరగాయలు పండ్లు అలాగే ఆర్గానిక్ మాంసం తినేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఆహారం కలుషితం అయిపోయింది. ముఖ్యంగా ముఖ్యంగా ఎడా పెడా వాడేస్తున్న రసాయనాల మూలంగా ఆహార పదార్థాలు కలుషితం అయిపోతున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. పౌల్ట్రీ పరిశ్రమలో రసాయనాలు అత్యధికంగా వాడుతారు. తద్వారా కోడిమాంసము అలాగే సైతం అయిపోయాయి వీటిలో పెరిగింది. దీంతో ప్రజలు ప్రస్తుతం నాటు కోళ్లు నాటు కోడి గుడ్లు తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
సరిగ్గా ఈ అవకాశాన్ని మీరు వ్యాపారంగా మలుచుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ పెరట్లోనే ఆర్గానిక్ కోడి గుడ్ల వ్యాపారం ప్రారంభించవచ్చు. మీ ఇంటి వెనుక ఖాళీ స్థలంలోనే ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. సాధారణ కోడిగుడ్ల కన్నా నాటు కోడి గుడ్ల ధర ఎక్కువ ఆదాయం కూడా ఎక్కువే. ముందుగా మీ పెరట్లోనే ఒక ఫామ్ ఏర్పాటు చేసుకోవాలి. అందులో నాటు కోళ్లను సేకరించి వాటి గుడ్లను ఇంక్యుబేటర్ సహాయంతో కోడి పిల్లలుగా మార్చుకోవచ్చు. తద్వారా మీరు నాటు కోళ్ల ఫారం అతి తక్కువ ఖర్చుతోనే ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇక ఈ నాటు కోళ్ల ఫారం సాధారణ కోళ్ల ఫారంలా కాదు,ఆరు బయటే పెంచాలి. అప్పుడు కోళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇక వీటి గుడ్లను పొదిగేందుకు ఇంక్యుబేటర్ సహాయం తీసుకోవాలి. ఇక నాటు కోడి విషయానికి వస్తే ఈ కోళ్లు 5వ నెల నుంచి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఉదాహరణకు 1000 కోళ్ల ను పెంచితే రోజుకు ఐదు వందల గుడ్లు ఉత్పత్తి వస్తుంది. అంటే రోజుకు సుమారు 500 కోడిగుడ్లను విక్రయించవచ్చు.
వీటిలో కొన్ని గుడ్లను పిల్లలుగా మార్చుకునేందుకు ఉంచుకోవాలి. మిగతా వాటిని మార్కెట్లో విక్రయించుకోవచ్చు. కోళ్లు అలాగే గుడ్ల మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడు కొత్త కోళ్లు కూడా చేరుతాయి. కొన్ని కోళ్లను మాంసం కోసం విక్రయించవచ్చు. తద్వారా మీకు అదనపు ఆదాయం వస్తుంది.